గుంటూరు వైసీపీలో నేతల తలరాతలు మారతాయా..?
వైసీపీలో ఆసక్తికర చర్చ సాగుతోంది. ప్రస్తుతం ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఉన్నవారిలో.. వచ్చే ఎన్నికల నాటికి కొందరిని పక్కన పెట్టడం ఖాయమని అంటున్నారు సీనియర్లు. వీరిలో ఒక మహిళా [more]
వైసీపీలో ఆసక్తికర చర్చ సాగుతోంది. ప్రస్తుతం ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఉన్నవారిలో.. వచ్చే ఎన్నికల నాటికి కొందరిని పక్కన పెట్టడం ఖాయమని అంటున్నారు సీనియర్లు. వీరిలో ఒక మహిళా [more]
వైసీపీలో ఆసక్తికర చర్చ సాగుతోంది. ప్రస్తుతం ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఉన్నవారిలో.. వచ్చే ఎన్నికల నాటికి కొందరిని పక్కన పెట్టడం ఖాయమని అంటున్నారు సీనియర్లు. వీరిలో ఒక మహిళా ఎమ్మెల్యేతో పాటు.. ఇద్దరు ఎంపీలు కూడా ఉన్నారు. గుంటూరులో మొత్తం మూడు పార్లమెంటు స్థానాలు ఉంటే.. ఒకటి టీడీపీ దక్కించుకుంది. నరసారావు పేట, బాపట్ల పార్లమెంటు స్థానాలను వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. అయితే.. వచ్చే ఎన్నికల నాటికి ఈ రెండు నియోజకవర్గాల్లోనూ కొత్త వారికి స్థానం ఇస్తారని.. ఇక్కడ నుంచి గెలిచిన.. నందిగం సురేష్‌ను ఎమ్మెల్యేగా పంపుతారని.. చర్చ సాగుతోంది. ఇక పొన్నూరు ఎమ్మెల్యేకు కూడా సీటు లేనట్టే అంటున్నారు.
ఆమెను తప్పించి…
ప్రస్తుతం తాడికొండ ఎస్సీ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన ఫైర్ బ్రాండ్ డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి ని పక్కన పెట్టి.. ఆ సీటును సురేష్‌కు అప్పగిస్తారని చర్చ సాగుతోంది. అయితే అదే సీటు కోసం ఎమ్మెల్సీ, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ సైతం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో నరసారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని నరసారావుపేట లోక్‌సభ సీటు నుంచి పోటీలోకి దింపంపుతారని జిల్లా పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఒక వేళ ఎన్నికల సమయానికి టీడీపీలో ఉన్న ఓ బలమైన కుటుంబం కనుక.. వైసీపీ తీర్థం పుచ్చుకుంటే దీనిని ఆ కుటుంబానికి విడిచి పెట్టి.. గోపిరెడ్డిని నరసారావు పేట ఎమ్మెల్యే టికెట్‌కే పరిమితం చేస్తారని అంటున్నారు.
రాజధాని ఎఫెక్ట్ తో…?
అదే సమయంలో టీడీపీ నుంచి వచ్చే నేతలను దృష్టి లో పెట్టుకుని వైసీపీ నేతలకు టికెట్లను కేటాయించే అవకాశం ఉందని అంటున్నారు. గత ఎన్నికల్లో గుంటూరులో మంచి మార్కులు వచ్చాయి.. కదా ? జంపింగ్‌లకు టిక్కెట్లు ఇవ్వడం ఎందుకు ? అన్న ప్రశ్న పార్టీ వర్గాలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ప్రస్తుతం గుంటూరుపై రాజధాని ఎఫెక్ట్ పడింది. అయితే.. స్థానిక ఎన్నికల్లో ఈ ప్రభావం కనిపించకపోయినా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న నేతలే మళ్లీ రంగంలోకి దిగితే.. వ్యతిరేక ఓటు చీలే ప్రమాదం ఉందని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు.
టీడీపీ నేతలకు ఆఫర్లు…
ఈ క్రమంలోనే ప్రజల్లో సానుభూతి, పట్టు ఉన్న నేతలను తమవైపు తిప్పుకొని.. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేయాలని వైసీపీ నిర్ణయిస్తున్నట్టు సమాచారం. సీఎం జగన్, పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలోనే టీడీపీలో మంచి పేరున్న నేతలకు భారీ ఆఫర్లతో వలేవేసే కార్యక్రమం త్వరలోనే ఉంటుందని జిల్లా పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. అదే జరిగితే వైసీపీలో కొందరు నేతల తలరాతలు మారిపోక తప్పదు