Midhun reddy : మిధున్ ముంచుతారో? తేలుస్తారో?

ఆంధ్రప్రదేశ్ లో ఏదో ఒక ఎన్నిక జరుగుతూ రాజకీయాలను మరింత హీటెక్కిస్తుంది. ప్రస్తుతం కుప్పం నియోజకవర్గం మున్సిపాలటీ ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కుప్పం మున్సిపాలిటీని ఎలాగైనా [more]

Update: 2021-10-24 12:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఏదో ఒక ఎన్నిక జరుగుతూ రాజకీయాలను మరింత హీటెక్కిస్తుంది. ప్రస్తుతం కుప్పం నియోజకవర్గం మున్సిపాలటీ ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కుప్పం మున్సిపాలిటీని ఎలాగైనా కైవసం చేసుకుని టీడీపీ అధినేత చంద్రబాబును మానసికంగా దెబ్బకొట్టాలని వైసీపీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి కుప్పం మున్సిపాలిటీ ఎన్నిక బాధ్యతను చూస్తున్నారు.

ఇప్పటికే పలు దఫాలు…

బద్వేలు ఉప ఎన్నిక ఉండటంతో మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డిని జగన్ అక్కడ ఇన్ ఛార్జిగా నియమించారు. దీంతో కుప్పం మున్సిపాలిటీ ఎన్నిక ను ఆయన కుమారుడు మిధున్ రెడ్డి చూస్తున్నారు. ప్రచారం ఎలా నిర్వహించాలన్న దానిపై ఇప్పటికే కుప్పం లోని వైసీపీ నేతలతో మిధున్ రెడ్డి పలు దఫాలుగా సమావేశమయ్యారు. వార్డుల వారీగా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే బాధ్యత తామే తీసుకుంటామని ప్రజలకు హామీ ఇవ్వాలని మిధున్ రెడ్డి నేతలకు సూచించారు.

రెండు నెలల నుంచి….

కుప్పం మున్సిపాలిటీ 2019లో ఏర్పడింది. అప్పటి వరకూ అది మేజర్ గ్రామ పంచాయతీగానే ఉండేది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ అయింది. మొత్తం 25 వార్డులున్న కుప్పం మున్సిపాలిటీకి త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. అయితే దాదాపు రెండు నెలల నుంచి అభ్యర్థులు ప్రచారంలో మునిగి ఉన్నారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కుప్పం మున్సిపాలిటీ ఎన్నికలు వాయిదా పడ్డాయి.

ఇద్దరికీ ముఖ్యమే….

ఇక్కడ టీడీపీ కూడా బలంగా ఉంది. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తుండటంతో కుప్పం మున్సిపల్ ఎన్నిక టీడీపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. రెండు పార్టీలు అభ్యర్థులను వార్డుల వారీగా నిర్ణయించారు. పదమూడు వార్డులను గెలుచుకుంటే మున్సిపల్ ఛైర్మన్ పదవి దక్కినట్లే. కుప్పం మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు వైసీప సర్వశక్తులు ఒడ్డుతోంది. త్వరలో చంద్రబాబు కూడా కుప్పంలో పర్యటించే అవకాశముంది. ప్రస్తుతానికి మిధున్ రెడ్డికి ఈ బాధ్యతలను అప్పగించారు. ఆయన ముంచుతారో? తేలుస్తారో? చూడాలి.

Tags:    

Similar News