వైసీపీ నేతలు నోరువిప్పకపోవడానికి రీజన్ ఇదేనా?

గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. ఇది వైసీపీకి ఊహించని విజయమే. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా జిల్లాలో నేతలు [more]

Update: 2021-05-23 11:00 GMT

గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. ఇది వైసీపీకి ఊహించని విజయమే. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా జిల్లాలో నేతలు మాత్రం మౌనంగానే ఉంటున్నారు. ఎన్నికలకు ముందు దూకుడు ప్రదర్శించిన వైసీపీ నేతలు రెండేళ్ల నుంచి మౌనంగానే ఉంటున్నారు. పదమూడు జిల్లాల్లో ఏ ఒక్క నేత నోరు విప్పడం లేదు. టీడీపీ చేసే ఆరోపణలపైనా పెద్దగా స్పందన లేదు.

తమ జిల్లాను టార్గెట్ చేసినా….?

స్థానిక సంస్థల ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నిక ముగిసిపోయింది. ఇక ఇప్పట్లో ఎన్నికలు లేవు. ప్రతిపక్ష నేత చంద్రబాబు మాత్రం వైఎస్ జగన్ ను టార్గెట్ చేసుకున్నారు. ప్రతి విషయంలో జగన్ పై విమర్శలు చేస్తున్నారు. ప్రధానంగా కర్నూలులో ఎన్ 440 కే వేరియంట్ వ్యాప్తి చెందిందని, ఇది ప్రమాదకరమని చంద్రబాబు పదే పదే విమర్శించారు. కానీ కర్నూలు జిల్లా నుంచి ఏ ఒక్క వైసీపీ నేత కూడా దీనిపై స్పందించలేదు.

పెద్ద నాయకులున్నా….

తమ కర్నూలు ప్రాంతంపై చంద్రబాబు ఆరోపణలు చేసినా ఆ ప్రాంత నేతలు ఎందుకు స్పందించలేదన్నది ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది. నిజానికి కర్నూలులో గత ఎన్నికలలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు రెండు పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకుంది. ఇక్కడ ఇద్దరు మంత్రులు ఉన్నారు. సీనియర్ నేతలున్నారు. కానీ కర్నూలు పై చంద్రబాబు ఆరోపణలు చేసినా నేతలు మాత్రం మౌనంగానే ఉండటం సందేహాలకు తావిస్తుంది.

కారణాలివేనా?

మరికొద్ది నెలల్లో మంత్రి వర్గ విస్తరణ ఉండటంతోనే వైసీపీ నేతలు మౌనంగా ఉన్నారా? అన్న అనుమానమూ వ్యక్తమవుతుంది. చంద్రబాబు పై విమర్శలు చేయడం వల్ల వచ్చే నష్టంలేకపోయినా వైసీపీ నేతలు స్పందించకపోవడానికి వేరే కారణాలున్నాయంటున్నారు. ఇక్కడ నియోజకవర్గాల్లో రెండు గ్రూపులు ఉన్నా అధిష్టానం పట్టించుకోవడం ఒక కారణమయితే, స్థానిక సంస్థల ఎన్నికల్లో తమమాట చెల్లుబాటు కాకపోవడం కూడా వారి మౌనానికి కారణమనే చెబుతున్నారు. మొత్తం మీద కర్నూలు వైసీపీ నేతలు నోరు మెదపకపోవడానికి అనేక కారణాలున్నాయంటున్నారు.

Tags:    

Similar News