వైసీపీలో క‌ష్టం ఒక‌రిది.. ప‌దవులు మ‌రొక‌రివి

జ‌గ‌న్ అంటే ఎంత అభిమానం ఉన్నా.. ఎంత ప్రేమ ఉన్నా.. నోటి దాకా అందివ‌చ్చిన ప‌ద‌విని లాగేసుకుంటే.. ఎవ‌రికి మాత్రం బాధ కాదు.. ఎవ‌రు మాత్రం ఆగ్రహంతో [more]

Update: 2021-08-18 00:30 GMT

జ‌గ‌న్ అంటే ఎంత అభిమానం ఉన్నా.. ఎంత ప్రేమ ఉన్నా.. నోటి దాకా అందివ‌చ్చిన ప‌ద‌విని లాగేసుకుంటే.. ఎవ‌రికి మాత్రం బాధ కాదు.. ఎవ‌రు మాత్రం ఆగ్రహంతో ఉండ‌రు ? ఇప్పుడు ఇదే పరిస్థితి వైసీపీ నేత‌ల్లో క‌నిపిస్తోంది. గ‌త ఏడాది ఎన్నిక‌ల స‌మ‌యంలో పార్టీ కోసం ప‌నిచేసిన వారికి ప‌ద‌వులు ద‌క్కలేద‌నే చింతే ఒక‌వైపు నేత‌ల‌ను హింసిస్తుండ‌గా.. మ‌రో వైపు.. రెండు మాసాల కింద‌ట జ‌రిగిన స్థానిక సంస్థల ఎన్నిక‌ల విష‌యంలోనూ పార్టీ అధిష్టానం త‌మ‌కు ప్రాధాన్యం లేకుండా చేయ‌డంపై రాష్ట్ర వ్యాప్తంగా నేత‌లు.. గ‌గ్గోలు పెడుతున్నారు.

కష్టపడి గెలిపించినా…?

గ‌త స్థానిక ఎన్నిక‌ల్లో వైసీపీ ప‌రంగా అనేక మంది కీల‌క నాయ‌కులు.. నేరుగా ఎమ్మెల్యేలు రంగంలోకి దిగి.. పార్టీ తర‌ఫున పోటీ చేసిన అభ్యర్థుల‌ను విజ‌య‌తీరం చేర్చారు. ఈ క్రమంలో తమ కుటుంబం స‌భ్యుల‌ను కూడా వార్డుల్లో పోటీ చేయించుకున్నారు. ఈ క్రమంలో గెలిచిన వారు.. చైర్మన్‌, వైస్ చైర్మన్ ప‌ద‌వుల‌పై ఆశ‌లు పెట్టుకున్నారు. విజ‌య‌వాడ‌కు చెందిన వైసీపీ నాయ‌కుడు పూనూరు గౌతం రెడ్డి కుమార్తె.. పోటీ చేసి ఓడియారు. వాస్తవానికి ఆమె గెలిచి ఉంటే (ఎన్నిక‌ల‌కు ముందు కొంద‌రు నేత‌లు ఇచ్చిన హామీ మేరకు) మేయ‌ర్ అభ్యర్థి కావాల్సి ఉంది.

పోటీ చేసి గెలిచినా…?

కానీ, ఇలాంటి ప‌రిస్థితి అన్ని మునిసిపాలిటీల్లోనూ చోటు చేసుకోలేదు. చాలా చోట్ల ఎమ్మెల్యేల బంధువులు, ఎంపీ బంధువులు.. మంత్రుల చుట్టరిక‌పు వ్యక్తులు.. కూడా.. స్థానిక ఎన్నిక‌ల్లో పోటీ చేశారు. వీరంతా కూడా ప‌ద‌వుల‌పై ఆశ‌ల‌తోనే ఎన్నిక‌ల్లో భారీ ఎ త్తున ప్రచారం చేశారు. డ‌బ్బులు కూడా ఖ‌ర్చు చేశారు. అయితే.. తీరా.. ఆయా ప‌దవుల‌ను ఫిల‌ప్ చేసే స‌మ‌యానికి సోష‌ల్ ఇంజ‌నీరింగ్ పేరిట‌.. జ‌గ‌న్ వేసిన‌.. పాచిక‌తో వీళ్లంతా హ‌ర్టయ్యార‌నేది వాస్తవం. దీంతో పోనీ.. వైఎస్ చైర్మన్ ప‌ద‌వి అయినా ద‌క్కుతుందా ? అనుకుంటే.. అది కూడా ద‌క్కని వారు చాలా మంది ఉన్నారు. చైర్మన్‌, వైఎస్ చైర్మన్ రెండు ప‌ద‌వుల‌ను వైసీపీ అధినేత జ‌గ‌నే పై నుంచి డిసైడ్ చేసి సీల్డ్ క‌వ‌ర్లలో వారి పేర్లు పంపారు.

ఇక్కడ కూడా సామాజికవర్గాలే….

వైఎస్ చైర్మన్‌ల‌ను కూడా సామాజిక వ‌ర్గాల ఆధారంగానే కేటాయించారు. దీంతో మ‌రింత‌గా ఎమ్మెల్యేలు, వైసీపీ కీల‌క నేత‌లు హ‌ర్ట్ అయ్యారు. ఇక‌, ఇప్పుడు రెండో వైఎస్ చైర్మన్‌.. రెండో డిప్యూటీ మేయ‌ర్‌ల‌ను ఎన్నుకునేలా.. ఎన్నిక‌ల సంఘం నోటీసులు జారీ చేసింది. మ‌రి దీనిలో అయినా.. త‌మ‌కు అవ‌కాశం ద‌క్కుతుందా? లేదా? అనే సందేహం పార్టీ కీల‌క వ్యక్తుల నుంచి లీకులు వ‌స్తున్నాయి. ఇందులో అనేక మంది నేతల బంధువులకు పదవులు దక్కకపోవడంతో వారిని మరింత తీవ్ర నిరాశలోకి నెట్టేసింది.

Tags:    

Similar News