Ysr congress party : పండగ రోజు వచ్చేస్తుందా?
మరోసారి వైసీపీ పండగ రోజు రానుంది. ఎంపీీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. గతంలో జరిగిన అన్ని ఎన్నికల్లోనూ వైసీపీనే విజయాన్ని వరించింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ [more]
మరోసారి వైసీపీ పండగ రోజు రానుంది. ఎంపీీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. గతంలో జరిగిన అన్ని ఎన్నికల్లోనూ వైసీపీనే విజయాన్ని వరించింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ [more]
మరోసారి వైసీపీ పండగ రోజు రానుంది. ఎంపీీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. గతంలో జరిగిన అన్ని ఎన్నికల్లోనూ వైసీపీనే విజయాన్ని వరించింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ తమదే విజయం అన్న ధీమాను పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. ఒకరకంగా అదీ నిజమే కావచ్చు. ఇప్పటి వరకూ జరిగిన ప్రతి ఎన్నికల్లో విపక్షాన్ని పక్కన పెట్టి వైసీపీ అత్యధిక స్థానాలను గెలుచుకుంది. ఇప్పుడు ఈ ఎన్నికల్లోెనూ అది సాధ్యమే కావచ్చు.
జడ్పీటీసీ స్థానాల్లో…
ఈ నెల 19వ తేదీన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఈ ఏడాది ఏప్రిల్ 8వ తేదీన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్ గా దిగిపోయిన తర్వాత ఈ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయింది. వాస్తవానికి పంచాయతీ ఎన్నికలకంటే ముందుగానే జరగాల్సి ఉన్నా అప్పటి కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయంతో ఎన్నికలు జరగలేదు. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 660 జడ్పీటీసీ స్థానాలున్నాయి. అయితే వివిధ కారణాలతో 8 స్థానాలకు ఎన్నికను జరపలేదు. 652 స్థానాలకు మాత్రమే నోటిఫికేషన్ విడుదలయింది. ఇందులో 126 జడ్పీటీసీలు ఏకగ్రీవమయ్యాయి. అయితే అభ్యర్థులు మృతి చెందడం వంటి కారణాలతో 81 స్థానాల్లో ఎన్నికను నిలిపివేశారు. 515 జడ్పీటీసీ స్థానాలకే కౌంటింగ్ జరగనుంది. ఈ 515 స్థానాలకు 2,058 మంది అభ్యర్థులు పోట చేశారు.
ఎంపీటీసీలకు…
ఇక ఎంపీటీసీ స్థానాల విషయానికొస్తే రాష్ట్రంలో మొత్తం 10,047 ఎంపీటీసీ స్థానాలున్నాయి. నోటిఫికేషన్ జారీ చేసే సమయానికి వివిధ కారణాలతో 375 స్థానాలకు ఎన్నికలు జరగలేదు. మొత్తం 9,672 స్థానాలకు మాత్రమే నోటిఫికేషన్ విడుదలయింది. ఇందులో 2,371 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వివిధ కారణాలతో 81 స్థానాల్లో పోలింగ ను నిలిపేశారు. ప్రస్తుతం కౌంటింగ్ 7,220 ఎంపీటీసీ స్థానాలకు మాత్రమే జరుగుతుంది. ఇందులో 18,782 మంది పోటీ చేశారు.
టీడీపీ మాత్రం….
అయితే దాదాపు అన్ని జిల్లా పరిషత్ లను, ఎక్కువ స్థాయిలో మండల పరిషత్ ను వైసీపీ కైవసం చేసుకునే అవకాశముంది. ఈ కౌంటింగ్ వైసీపీ లో వందల సంఖ్యలో పదవులు దక్కనున్నాయి. దాదాపు ఎనిమిది నెలల నిరీక్షణకు రేపు ఫలితం వెలువడనుంది. అయితే ఈ ఫలితాలపై తెలుగుదేశం పార్టీ పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. కానీ భయపెట్టి, బెదిరించి ఏకగ్రీవాలు చేసుకున్నారని మాత్రం ఆరోపిస్తున్నారు. మొత్తం మీద వైసీపీకి మరో పండగ రోజు గంటల్లోనే రానుంది.