Ys jagan : ఓవరాల్ స్టేట్… సింగిల్ హ్యాండ్
రెండున్నరేళ్ల పాలనలో అనేక ఇబ్బందులు జగన్ ఎదుర్కొన్నారు. న్యాయపరంగా చిక్కులు తప్పడం లేదు. ప్రతిపక్షం నేరుగా యుద్ధం చేయడం లేదు. చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా చేస్తున్న [more]
రెండున్నరేళ్ల పాలనలో అనేక ఇబ్బందులు జగన్ ఎదుర్కొన్నారు. న్యాయపరంగా చిక్కులు తప్పడం లేదు. ప్రతిపక్షం నేరుగా యుద్ధం చేయడం లేదు. చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా చేస్తున్న [more]
రెండున్నరేళ్ల పాలనలో అనేక ఇబ్బందులు జగన్ ఎదుర్కొన్నారు. న్యాయపరంగా చిక్కులు తప్పడం లేదు. ప్రతిపక్షం నేరుగా యుద్ధం చేయడం లేదు. చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా చేస్తున్న విష ప్రచారం రోజురోజుకూ ఎక్కువవుతోంది. ఏ మంచి నిర్ణయాన్ని తీసుకున్నా అందులో లొసుగులు వెదుకుతున్నారు. లోటుపాట్లను చెబితే తప్పులేదు. కానీ అవినీతి మరకలను అంటకడుతున్నారు. దీని నుంచి బయట పడేందుకు జగన్ కు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు బూస్ట్ ను ఇచ్చాయి.
70 శాతానికి పైగా ఓటింగ్….
ఎన్నికలు జరగలేదనడం అవాస్తవం. ఎన్నికలు జరిగాయి. ప్రజలు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓట్లేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 70 శాతానికి పైగానే పోలింగ్ జరిగింది. టీడీపీ తాము ఎన్నికలను బహిష్కరించామని చెప్పినా, వారి మద్దతు దారులు ఎన్నికల్లో పోటీ చేశారు. అనేక చోట్ల టీడీపీ గుర్తు పైనే పోటీ చేశారు. బ్యాలట్ బాక్స్ లోనూ సైకిల్ గుర్తు ఉంది. ఇక బీజేపీ, జనసేనలు కూడా బరిలో నిలిచాయి. అంటే ఎన్నికలు జరిగినట్లే భావించాలి.
ఏ జిల్లాలోనూ….
పదమూడు జిల్లాల్లోనూ వైసీపీ ప్రభంజనం ఈ ఎన్నికల్లో కన్పించింది. నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో వైసీపీ వన్ సైడ్ విజయం సాధించింది. చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పం, సొంత గ్రామమైన నారావారిపల్లె, ఎన్టీఆర్ సొంత గ్రామమైన నిమ్మకూరు వంటి ప్రాంతాల్లో కూడా వైసీపీ విజయం సాధించింది. ఇది వైసీపీకి ఖచ్చితంగా బలాన్నిచ్చేదే. ఈ ఫలితాలు కేవలం జగన్ కే కాదు పార్టీకి చెందిన ప్రతి కార్యకర్తకు బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి.
ఏ ఎన్నికలో అయినా….
ఓవరాల్ గా స్టేట్ ను వైసీపీ దక్కించుకుంది. ఎక్కడా విపక్షాలు పోటీ ఇచ్చిన పరిస్థితి కన్పించలేదు. జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలు తమను గెలిపించాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. పల్లె నుంచి పట్టణాల వరకూ ఫ్యాన్ హవా వీచింది. ఇప్పటికే పంచాయతీలు, మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను కైవసం చేసుకున్న వైసీపీ ఇప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఏకపక్ష గెలుపుతో ప్రత్యర్థులకు చోటు లేదని చెప్పకనే చెప్పింది.