ఫెయిల్యూర్ ఎవరిది…? హైకమాండ్ దేగా?
2019 ఎన్నికల తర్వాత నుంచి అక్కడ విభేదాలున్నాయి. ఇరవై నెలల నుంచి అక్కడి నేతల మధ్య విభేదాలను అధినాయకత్వం పరిష్కరించలేకపోయింది. ఇంతకీ ఈ ఫెయిల్యూర్ ఎవరిది? అక్కడి [more]
2019 ఎన్నికల తర్వాత నుంచి అక్కడ విభేదాలున్నాయి. ఇరవై నెలల నుంచి అక్కడి నేతల మధ్య విభేదాలను అధినాయకత్వం పరిష్కరించలేకపోయింది. ఇంతకీ ఈ ఫెయిల్యూర్ ఎవరిది? అక్కడి [more]
2019 ఎన్నికల తర్వాత నుంచి అక్కడ విభేదాలున్నాయి. ఇరవై నెలల నుంచి అక్కడి నేతల మధ్య విభేదాలను అధినాయకత్వం పరిష్కరించలేకపోయింది. ఇంతకీ ఈ ఫెయిల్యూర్ ఎవరిది? అక్కడి విభేదాలను పరిష్కరించాలని చెప్పిన జగన్ నియమించిన పార్టీ నేతలదా? ఎవరు చెప్పినా వినకుండా తమ దారి తమదేనంటున్నా వైసీపీ నేతలదా? అన్న చర్చ పార్టీలో చర్చ జరుగుతుంది. అదే కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం.
ఎమ్మెల్యేగా గెలిచినా…
నందికొట్కూరు నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఆర్ధర్ వైసీపీ నుంచి విజయం సాధించారు. ఆయన విజయానికి వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సహకరించిందీ వాస్తవమే. ఎస్సీ నియోజకవర్గం కావడంతో అన్ని సామాజికవర్గాల నేతలు కలసి పనిచేయడంతోనే ఇక్కడ వైసీపీ గెలిచింది. ఇక అక్కడి నుంచి ఆధిపత్య పోరు మొదలయింది. ఎమ్మెల్యే ఆర్ధర్ పై పెత్తనం చేయాలని బైరెడ్డి సిద్దార్థరెడ్డి ప్రయత్నిస్తున్నారు. దీనిని ఆర్ధర్ అడ్డుకుంటున్నారు. ఒకదశలో తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆర్ధర్ హెచ్చరికలు కూడా అధినాయకత్వానికి పంపారు.
ఎంపీటీసీ ఎన్నికల్లోనూ….
ఎమ్మెల్యే తాను అయినా కనీసం తనను పట్టించుకోవడం లేదని ఆర్ధర్ చెబుతున్నారు. మొన్న జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సమయంలోనూ రచ్చ రచ్చ అయింది. నాలుగు మండలాల్లో తన అభ్యర్థులు నిలుచుంటారని సిద్ధార్ధరెడ్డి చెప్పారు. కుదరదని ఆర్ఢర్ పట్టుబట్టారు. దీనిపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్, బుగ్గన రాజేంద్రనాధ్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు సర్దిచెప్పి కొంత సర్దుబాటు చేసేలా ప్రయత్నించారు. కానీ ఈ ఇద్దరి మధ్య సఖ్యత అనేది జరగని పని అని మరోసారి రుజువయింది.
పంచాయతీ ఎన్నికల్లోనూ….
పంచాయతీ ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల ఎంపికలోనూ ఇద్దరి మధ్య విభేదాలు మరోసార ిబయటపడ్డాయి. మంత్రుల సమక్షంలోనే రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. తాను ఎమ్మెల్యేగా ఉన్న అధికారుల బదిలీలు, కాంట్రాక్టుల్లో కూడా సిద్ధార్దరెడ్డి వేలు పెట్టడమేంటని ఆర్ధర్ ప్రశ్నిస్తున్నారు. తన వర్గానికి చెందిన వారికి పదవులు ఇవ్వాల్సిందేనని సిద్ధార్ధరెడ్డి పట్టుబడుతున్నారు. మొత్తం మీద నందికొట్కూరులో ఇరవై నెలలుగా జరుగుతున్న విభేదాలను పరిష్కరించడంలో అధినాయకత్వం పూర్తిగా విఫలమయిందని చెప్పక తప్పదు.