Ycp : నెల్లూరు ఎన్నిక వైసీపీలో రచ్చ రేపడం ఖాయమా?

నెల్లూరు కార్పొరేషన్ కు ఈ నెల 15వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. సహజంగా అధికార వైసీపీకి ఇక్కడ అనుకూల వాతావరణమే ఉంటుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ [more]

Update: 2021-11-01 12:30 GMT

నెల్లూరు కార్పొరేషన్ కు ఈ నెల 15వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. సహజంగా అధికార వైసీపీకి ఇక్కడ అనుకూల వాతావరణమే ఉంటుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నెల్లూరు జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటింది. నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలు కూడా వైసీపీకి ప్రతిష్టాత్మకమే. ఇక్కడ జనసేన, టీడీపీ, బీజేపీ సయితం బలంగా ఉండటంతో అభ్యర్థుల ఎంపిక కీలకంగా మారనుంది.

గెలుపు సులువైనా…?

నెల్లూరు కార్పొరేషన్ లో 54 డివిజన్లు ఉన్నాయి. మేయర్ పదవిని చేపట్టాలంటే 28 డివిజన్లను గెలుచుకోవాల్సి ఉంటుంది. నెల్లూరు టౌన్, నెల్లూరు రూరల్ శాసనసభ నియోజకవర్గాలు ఇందులో కలసి ఉన్నాయి. మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇక్కడ నెల్లూరు కార్పొరేషన్ బాధ్యతలను చూసుకోవాల్సి ఉంటుంది. అయితే నెల్లూరు వైసీీపీలో గ్రూపుల గోల ఎక్కువగా ఉండటం పార్టీని ఇబ్బంది పెట్టే అవకాశముందంటున్నారు.

అన్నీ గ్రూపులే…

నెల్లూరు జిల్లాలో పది ఎమ్మెల్యే స్థానాలను వైసీపీ గెలుచుకుంది. ఇందులో దాదాపు ఆరుగురు ఎమ్మెల్యేలకు నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో పట్టుంది. మేకపాటి, ఆనం, ఆదాల, నల్లపురెడ్డి, కాకాణి కుటుంబాలు సయితం ఇక్కడ ప్రభావం చూపుతాయి. అయితే ఇప్పటి వరకూ అనేక గ్రూపులుగా ఉన్నాయి. మంత్రి అనిల్ కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక గ్రూపుగా ఉండగా, కాకాణి వేరు కుంపటి పెట్టారు. వీరి పార్టీ కార్యాలయానికి కూడా రావడం మానేశారు.

అభ్యర్థుల ఎంపికే….

జిల్లా పార్టీ అధ్కక్షుడిగా ఉన్న కాకాణి గోవర్థన్ రెడ్డి అభ్యర్థుల ఎంపికలో కీలక పాత్ర పోషించనున్నారు. కాకాణి, ఆనం, అనిల్ కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లు అభ్యర్థుల ఎంపికలో తమ వర్గానికి కావాలని పట్టుబట్టే అవకాశముంది. ఇప్పుడు వైసీపీకి గెలుపు సంగతి ఎలా ఉన్నా అభ్యర్థుల ఎంపిక తలనొప్పిగా మారనుంది. హైకమాండ్ అభ్యర్థులను ఎంపిక చేయాల్సిన పరిస్థితులు అయితే నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో నెలకొన్నాయని చెప్పకతప్పదు.

Tags:    

Similar News