వైసీపీ స్పీడ్ పెంచింది అందుకేనా?
పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసం వైసీపీ, టీడీపీ పార్లమెంటు వేదికగా పోరాటాన్ని ప్రారంభించాయి. సమావేశాలు ప్రారంభమయిన తొలిరోజునే వైసీపీ సభ్యులు రాజ్యసభలో పోడియం వైపు [more]
పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసం వైసీపీ, టీడీపీ పార్లమెంటు వేదికగా పోరాటాన్ని ప్రారంభించాయి. సమావేశాలు ప్రారంభమయిన తొలిరోజునే వైసీపీ సభ్యులు రాజ్యసభలో పోడియం వైపు [more]
పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసం వైసీపీ, టీడీపీ పార్లమెంటు వేదికగా పోరాటాన్ని ప్రారంభించాయి. సమావేశాలు ప్రారంభమయిన తొలిరోజునే వైసీపీ సభ్యులు రాజ్యసభలో పోడియం వైపు దూసుకు వెళ్లారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలను వెంటనే ఆమోదించాలని పట్టుబట్టింది. సభలో రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై వైసీపీ దూకుడుగా వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు కనపడుతుంది.
విభజన అంశాలపై…?
రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లు గడుస్తున్నా మోదీ ప్రభుత్వం రాష్ట్ర విభజన అంశాలపై ఎటువంటి ముందడుగు వేయలేదు. అయినా గత రెండున్నరేళ్ల నుంచి వైసీపీ బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూనే ఉంది. రాష్ట్రపతి ఎన్నికల దగ్గర నుంచి వివిధ బిల్లుల విషయంలో వైసీపీ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తూనే వస్తుంది. కానీ మోదీ ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో ఈ పార్లమెంటు సమావేశాల్లో దూకుడుగా వెళ్లాలని భావిస్తుంది. అనేక అంశాలను సభ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నాన్ని ప్రారంభించింది.
విమర్శలను తిప్పికొట్టేందుకు…
వైసీపీ బీజేపీతో లాలూచీ పడిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రత్యేక హోదా విషయంలోనూ వైసీపీ వెనక్కు తగ్గిందన్న ఆరోపణలున్నాయి. దీంతో పాటు కొన్ని కీలక అంశాలను బీజేపీ ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదన్న బాధ వైసీపీలో ఉంది. ముఖ్యంగా తమ పార్టీపైనా, అధినేత పైనా నిత్యం ఆరోపణలు చేస్తున్న రఘురామ కృష్ణరాజు విషయంలోనూ చర్యలు తీసుకోవడం లేదన్న ఆగ్రహం వారిలో కన్పిస్తుంది. అందుకే వైసీపీ స్పీడ్ పెంచింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై కూడా రచ్చ చేయాలని నిర్ణయించింది.
వివిధ అంశాలపై…?
అయితే ప్రత్యేక హోదాను పక్కన పెట్టి కేవలం సొంత ప్రయోజనాల కోసమే వైసీపీ ప్రయత్నిస్తుందని టీడీపీ ఆరోపిస్తుంది. ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరింది. వైసీపీ మాత్రం కేవలం కొన్ని పాయింట్లకే పరిమితమయింది. ఈ సమావేశాల్లో రఘురామ కృష్ణరాజు విషయం తేల్చుకోవాలని వైసీపీ గట్టిగా ప్రయత్నించే అవకాశముంది. నేరుగా ఆ అంశాన్ని ప్రస్తావించకపోయినా ఇతర అంశాలపై సభలో రగడ చేసే అవకాశముంది. మొత్తం మీద వైసీపీ ఈ సమావేశాల్లో అగ్రెస్సివ్ గానే ముందుకు వెళ్లేటట్లు కన్పిస్తుంది.