కంచుకోట జిల్లాల్లో వైసీపీకి ట్రబుల్.. పుంజుకుంటున్న టీడీపీ
ఎక్కడైనా ఒకే పార్టీ నేతలు ఎన్ని విభేదాలు ఉన్నా.. కూడా పార్టీకి.. ప్రభుత్వానికి పరువు పోకుండా కాపాడుకుంటారు. కానీ, వైసీపీలో మాత్రం దీనికి భిన్నమైన రాజకీయాలు సాగుతున్నాయి. [more]
ఎక్కడైనా ఒకే పార్టీ నేతలు ఎన్ని విభేదాలు ఉన్నా.. కూడా పార్టీకి.. ప్రభుత్వానికి పరువు పోకుండా కాపాడుకుంటారు. కానీ, వైసీపీలో మాత్రం దీనికి భిన్నమైన రాజకీయాలు సాగుతున్నాయి. [more]
ఎక్కడైనా ఒకే పార్టీ నేతలు ఎన్ని విభేదాలు ఉన్నా.. కూడా పార్టీకి.. ప్రభుత్వానికి పరువు పోకుండా కాపాడుకుంటారు. కానీ, వైసీపీలో మాత్రం దీనికి భిన్నమైన రాజకీయాలు సాగుతున్నాయి. ముఖ్యంగా రెండు ప్రధాన జిల్లాల్లో పార్టీ నేతలు హద్దులు దాటుతున్నారని.. ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని.. దీంతో పార్టీ సహా ప్రభుత్వ పరువు పోతోందని అంటున్నారు పరిశీలకులు. ఈ జిల్లాల్లో నెల్లూరు, ప్రకాశం జిల్లాల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ రెండు జిల్లాలు పార్టీకి కంచుకోటలే.
నేతల డామినేషన్ తో…?
నెల్లూరులో కొందరు నేతల డామినేషన్ ఎక్కువగా ఉందని.. కొన్నాళ్లుగా విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. నెల్లూరు ను క్లీన్ స్వీప్ చేసిన తర్వాత.. జిల్లా అభివృద్ధికి నేతలు పాటు పడతారని.. స్థానికంగా ఏర్పడిన అభిప్రాయాలు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండేళ్లలో అభివృద్ధి విషయంలో నెల్లూరులో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదనేది వాస్తవం. అయినప్పటికీ.. ఎవరూ అభివృద్ధి విషయాన్ని ప్రస్తావించకపోవడం గమనార్హం. పైగా ఇక్కడ గెలిచిన నేతలు..ఒకరిపై ఒకరు పైచేయి సాధించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో జిల్లాలో వైసీపీ పరిస్థితి ఇబ్బందుల్లో పడింది.
పరిస్థిితులను చక్కదిద్దకపోతే?
ఇక, ఇటీవల తెరమీదికి వచ్చిన ఆనందయ్య మందు విషయం.. వైసీపీ నేతల మధ్య ఉన్న విభేదాలను మరింత స్పష్టంగా చూపిందనేది కూడా వాస్తవం. ఇక జిల్లాలో మంత్రులు మంత్రులకు పొసగట్లేదు. ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేలకు, సీనియర్లకు, జూనియర్లకు మధ్య కూడా పెద్ద గ్యాప్ ఉంది. దీంతో ఇక్కడ పరిస్థితిని చక్కదిద్దేందుకు.. పార్టీ నేతలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు పరిశీలకులు. పరిస్థితి మారకపోతే ఈ విబేధాలే ఇక్కడ వైసీపీని సర్వనాశనం చేసే పరిస్థితే ఉంది.
నేతల మధ్య విభేదాలతో…?
ఎంపీ వర్సెస్ మంత్రి, మంత్రి వర్సెస్ ఎమ్మెల్యేలు ఇలా.. ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాలు అధికార పార్టీని, ప్రభుత్వాన్ని కూడా ఇరకాటంలోకి నెడుతున్నాయి. అటు ఒంగోలు పార్లమెంటు పరిధిలోనే కాకుండా ఇటు బాపట్ల పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. చీరాల, పరుచూరు, అద్దంకిలో గ్రూపుల గోల మామూలుగా లేదు. ఇక్కడ ప్రతి నిత్యం పార్టీ నేతల మధ్య ఏదో ఒక వివాదం కామన్ అయిపోయింది. వైసీపీ నేతలు చేస్తున్న రాజకీయాలతో ఇక్కడ ఒకింత బలంగా ఉన్న టీడీపీ పుంజుకుంటోంది. జిల్లా వ్యాప్తంగా టీడీపీ పుంజుకుంటే.. వైసీపీ నేతలు వెనకబడే పరిస్థితి ఉత్పన్నం అవుతుందని అంటున్నారు పరిశీలకులు. ఇక, వైసీపీలో పెరుగుతున్న ఆధిపత్య రాజకీయాలను దగ్గరగా పరిశీలిస్తున్న టీడీపీ నేతలు.. వ్యూహాత్మకంగా ఎదిగేందుకు పావులు కదుపుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.