నాలుగుసార్లు గెలిపించారు.. మరి ఐదోసారి?

రాజకీయాల్లో ఎప్పుడూ ఒకరిదే పెత్తనం ఉండదు. ప్రజలు మార్పు కోరుకుంటారు. ఇప్పుడు అదే విపక్షంలో ఉన్న టీడీపీలో ఆశలు పెరగడానికి కారణమని చెప్పవచ్చు. కడప జిల్లా రైల్వే [more]

Update: 2021-10-03 14:30 GMT

రాజకీయాల్లో ఎప్పుడూ ఒకరిదే పెత్తనం ఉండదు. ప్రజలు మార్పు కోరుకుంటారు. ఇప్పుడు అదే విపక్షంలో ఉన్న టీడీపీలో ఆశలు పెరగడానికి కారణమని చెప్పవచ్చు. కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం 1999 వరకూ టీడీపీకి కంచుకోటా ఉండేది. ఆ నియోజకవర్గంలో టీడీపీ విజయం సాధించి రెండు దశబ్దాలవుతుంది. వరసగా నాలుగు ఎన్నికల్లోె రైల్వే కోడూరు నియోజకవర్గంలో ప్రజలు టీడీపీని ఓడించారు.

1999 తర్వాత…?

రైల్వే కోడూరు నియోజకవర్గంలో 2004, 2009లో కాంగ్రెస్ విజయం సాధించగా, 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. 2012 లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ రైల్వే కోడూరు నియోజవర్గంలో వైసీపీ విజయం సాధించింది. ఇక్కడ శ్రీనివాసులు ఎమ్మెల్యేగా ఉన్నారు. శ్రీనివాసులు 2009, 2012 ఉప ఎన్నిక, 2014, 2019 ఎన్నికల్లో వరస విజయాలు సాధించారు. అంటే నాలుగుసార్లు రైల్వే కోడూరు ప్రజలు ఆయనకే అండగా నిలబడ్డారు.

వైసీపీలో విభేదాలు…

అయితే ఈసారి గెలుపు అంత సులువు కాదంటున్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గం వైసీపీలో విభేదాలు తలెత్తడమే ఇందుకు కారణం. వైసీపీలో ఒక సామాజికవర్గం నేతలు పెత్తనం చేస్తుండటంతో కాంట్రాక్టు పనులతో పాటు ఇతర అధికారుల బదిలీలు సయితం ఎమ్మెల్యేకు తెలియకుండా జరుగుతుండటంతో వర్గాలుగా విడిపోయారు. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా రైల్వే కోడూరు నియోజకవర్గంలో వైసీపీ బలహీనమయిందంటున్నారు.

యాక్టివ్ కావడంతో….?

ఇక ఇదే సమయంలో రైల్వే కోడూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడిప్పుడే బలోపేతం అవుతుంది. ఇక్కడ నరసింహ ప్రసాద్ యాక్టివ్ అయ్యారు. ఆయన మాజీ ఎంపీ శివప్రసాద్ అల్లుడు. టీడీపీని బలోపేతం చేసేందుకు నరసింహప్రసాద్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయనే చెప్పాలి. ఇప్పటికే రైల్వే కోడూరు లో శ్రీనివాసులు నాలుగుసార్లు గెలిచి ఉండటంతో ఈసారి విజయం తమదేనన్న ధీమాలో టీడీపీ నేతలున్నారు.

Tags:    

Similar News