రోజా దుమ్ము దులిపేసింది
వైసిపి ఫైర్ గన్, నగరి ఎమ్యెల్యే ఏపిఐఐసి చైర్మన్ రోజా చాలా రోజుల తరువాత తన నోటికి పని చెప్పారు. కొత్త ప్రభుత్వం కొలువుతీరాకా రోజా విపక్షంలో [more]
వైసిపి ఫైర్ గన్, నగరి ఎమ్యెల్యే ఏపిఐఐసి చైర్మన్ రోజా చాలా రోజుల తరువాత తన నోటికి పని చెప్పారు. కొత్త ప్రభుత్వం కొలువుతీరాకా రోజా విపక్షంలో [more]
వైసిపి ఫైర్ గన్, నగరి ఎమ్యెల్యే ఏపిఐఐసి చైర్మన్ రోజా చాలా రోజుల తరువాత తన నోటికి పని చెప్పారు. కొత్త ప్రభుత్వం కొలువుతీరాకా రోజా విపక్షంలో వున్నప్పటి స్పీడ్ ను కొనసాగించడం లేదన్న చర్చ నడుస్తూ వస్తుంది. మంత్రి వర్గంలోకి రోజా ను జగన్ తీసుకోకపోవడంతో ఆమె అసంతృప్తి తో ఉన్నారన్న ప్రచారం సాగేది. అయితే తాజాగా శాసన సభ సమావేశాల్లో రోజా చెలరేగి తనలో సత్తా ఏమి తగ్గలేదని చాటి చెప్పారు. దిశ ఘటనపైనా ఆడపిల్లల భద్రతపై గళమెత్తిన రోజా తనదైన శైలిలో విపక్షాలపై విరుచుకుపడ్డారు.
చంద్రబాబు నుంచి పవన్ వరకు …
ఆడపిల్లల భద్రత గత టిడిపి సర్కార్ లో ఎలా వుంది జగన్ ప్రభుత్వం వచ్చాకా ఎలా ఉందో వివరిస్తూ వాగ్భాణాలు సంధించారు రోజా. గతంలో ఎమ్మార్వో వనజాక్షి సంఘటన నుంచి అనేక కేసుల్లో మహిళల పట్ల చంద్రబాబు వ్యవహరించిన తీరును దుమ్మెత్తిపోశారు ఆమె. ఇక మహిళలపై గతంలో హీరో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను రోజా గుర్తు చేశారు. అమ్మాయిలకు ముద్దు అన్నా పెట్టాలని, కడుపన్నా చేయాలని బాలకృష్ణ వ్యాఖ్యలను గుర్తు చేశారు.
పవన్ కల్యాణ్ గన్ పట్టుకుని……
అలాగే పవన్ కళ్యాణ్ తన ఇంట్లో జరిగే సంఘటనలకు గన్, కత్తి పట్టుకుని బయటకు వచ్చి వేరే వారి విషయంలో బెత్తంతో కొట్టాలని చేసిన వ్యాఖ్యలను ఉదాహరిస్తున్న సందర్భంలో స్పీకర్ తమ్మినేని వారించారు. దాంతో రోజా పవన్ పై తన దాడిని తగ్గించి టిడిపి పై ఎక్కుపెట్టి దుమ్ములేపి శభాష్ అనేలా సాగించారు. మహిళలపై చేయి వేస్తే గన్ వచ్చేలోపు జగన్ వస్తాడంటూ పంచ్ డైలాగ్స్ తో తన ప్రసంగాన్ని రక్తి కట్టించారు. మహిళల భద్రతతపై చర్చ జరుగుతుంటే చంద్రబాబు తన కుమారుడు లోకేష్ కు పప్పులో ఉల్లిపాయ తగ్గిందన్న కోపంతో ఉల్లిధరలపై అడ్డం తగులుతున్నారని రోజా విరుచుకుపడ్డారు.