ఒక్కసారి మంత్రిని చేస్తే… ?
మంత్రి పదవి అంటే ఎపుడూ గొప్పదే. ఆ కుర్చీ మహిమ అలాంటిది. బతికున్నన్నాళ్ళూ మాజీ మంత్రి హోదా ట్యాగ్ తగిలించుకుని కధ సాగించవచ్చు. పోయాక ప్రభుత్వ లాంచనాలతో [more]
మంత్రి పదవి అంటే ఎపుడూ గొప్పదే. ఆ కుర్చీ మహిమ అలాంటిది. బతికున్నన్నాళ్ళూ మాజీ మంత్రి హోదా ట్యాగ్ తగిలించుకుని కధ సాగించవచ్చు. పోయాక ప్రభుత్వ లాంచనాలతో [more]
మంత్రి పదవి అంటే ఎపుడూ గొప్పదే. ఆ కుర్చీ మహిమ అలాంటిది. బతికున్నన్నాళ్ళూ మాజీ మంత్రి హోదా ట్యాగ్ తగిలించుకుని కధ సాగించవచ్చు. పోయాక ప్రభుత్వ లాంచనాలతో రాజ గౌరవం చేస్తారు. మొత్తానికి రాజకీయాల్లోకి ఎవరు అడుగు పెట్టినా అంతిమ లక్ష్యం మంత్రి పదవి అన్నది తెలిసిందే. ఇక కోరికలు అలా పెరిగిపోతున్నాయి. ఇపుడు అర్జంటుగా ఎమ్మెల్యే, ఆ వెంటనే మినిస్టర్ కావాల్సిందే. వైసీపీలో అయితే ఈ జోరు మరీ ఎక్కువగా ఉంది. దాంతో ఎవరికి వారు తమ ప్రయత్నాలను చేసుకుంటున్నారు.
శ్రీ లక్ష్మి నీ మహిమలూ…?
శ్రావణ మాసం పవిత్ర మాసం. పండుగలే పండుగలు. దాంతో స్వామి కార్యం స్వకార్యం అన్నట్లుగా వైసీపీ నేతలు పూజలు చేస్తూనే మొక్కులు మొక్కేస్తున్నారు. ఒక్కసారి మంత్రిని చేయి దేవుడా అంటూ వేడుకుంటున్నారు. ఫైర్ బ్రాండ్, సినీ నటి కమ్ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అయితే వరలక్ష్మీ వ్రతాన్ని తన ఇంట్లో ఈసారి ఘనంగా నిర్వహించారు. గతం కంటే ఎక్కువ సందడి కూడా చేశారు. రోజాకు భక్తి ప్రపత్తులు ఎక్కువే. దాంతో పాటు ఈసారి మరిన్ని మొక్కులు కూడా జోడించి అమ్మ వారిని వేడుకుందని చెబుతున్నారు. కచ్చితంగా మంత్రి పదవి ఈసారి ఖాయమనే వైసీపీలో ఆమె అనుచరులు కూడా ధీమాగా ఉన్నారుట.
అన్నయ్య సన్నిధి ….
మరో వైపు చూస్తే గుంటూరు జిల్లాకు చెందిన బీసీ మహిళా నేత, వైసీపీ ఎమ్మెల్యే విడదల రజనీ కూడా అన్నయ్య సన్నిధి అంటూ నేరుగా జగన్ వద్దనే వెళ్ళి తమ బాధను వెళ్ళబోసుకుంటున్నారు. దానికి ఆమె రాఖీ పండుగను బాగా ఉపయోగించుకున్నారు. అందరి కంటే ముందే ఆమె జగన్ చేతికి రాఖీ కట్టేసి అసలైన చెల్లెమ్మ తానేనని చెప్పేసుకున్నారు. చెల్లెలు రాఖీ కడితే అన్న అభయం ఇస్తాడు, కోరిక కోరికలు కూడా తీరుస్తాడు. అందుకే తెలివిగా రజనీ జగన్ నే దేవుడిగా భావించి ఆయనే తనను దీవిస్తాడు అంటూ ధీమాగా ఉన్నారుట.
ఇంకా చాలా ఉన్నాయి…
రానున్న కాలమంతా పండుగలే. తొందరలోనే వినాయక చవితి కూడా వస్తుంది. అపుడు కూడా మన నాయకులు శివ శివమూర్తిని గణనాధా అంటూ భక్తి పాటలు చాలానే పాడతారు. ఒక్కసారి కుర్చీ ఇవ్వు గణనాధా అంటూ గణపతి తొండానికి దండాలు కూడా పెడతారు కూడా. మొత్తానికి వైసీపీ నేతల్లో మంత్రి గిరి కోసం ఫీవర్ అలా పెరిగిపోతోంది. దానికి ఎన్నో మార్గాలు కూడా వెతుక్కుంటున్నారు. దేవుడిని పండుగలను కూడా లాగేసి మరీ రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారు. ఇంతకీ రాజకీయ ఘనాపాఠి జగన్ కి ఇవన్నీ తెలియవనుకోవాలా. చూడాలి మరి ఆయన ఎవరికి అందలం ఇచ్చి ఆనందం కలిగిస్తాడో.