ఎంపీలు ఏం చేస్తున్నారు… ఎవరిదారి వారిదేనా…?
రాష్ట్రంలో 22 మంది వైఎస్సార్ సీపీ ఎంపీలు ఏం చేస్తున్నారు ? ఎక్కడున్నారు ? ఆసక్తికరమైన ఈ చర్చ పార్టీలోనే సాగుతోంది. త్వరలోనే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు [more]
రాష్ట్రంలో 22 మంది వైఎస్సార్ సీపీ ఎంపీలు ఏం చేస్తున్నారు ? ఎక్కడున్నారు ? ఆసక్తికరమైన ఈ చర్చ పార్టీలోనే సాగుతోంది. త్వరలోనే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు [more]
రాష్ట్రంలో 22 మంది వైఎస్సార్ సీపీ ఎంపీలు ఏం చేస్తున్నారు ? ఎక్కడున్నారు ? ఆసక్తికరమైన ఈ చర్చ పార్టీలోనే సాగుతోంది. త్వరలోనే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని సంధించాల్సిన అంశాలపై పార్టీ నోట్ తయారు చేస్తున్న క్రమంలో.. ఎంపీల విషయం చర్చకు వచ్చింది. దీంతో ఎవరెవరు అందుబాటులో ఉన్నారో.. వారిని పార్టీ కేంద్ర కార్యాలయం వద్దకు రావాలని ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా ఆహ్వానాలు పంపారు. అయితే, వీరిలో చాలా మంది స్తానికంగా లేక పోవడంపై ఆయన ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఏపీకి దూరంగా…..
చాలా మంది ఎంపీలు.. ప్రస్తుతం.. ఢిల్లీలోను, హైదరాబాద్‌లోను ఉన్నారు. కరోనా నేపథ్యంలో ఏపీలో ఉండకుండా వారు తమకు నచ్చిన ప్రాంతంలో ఉన్నారు. మిగిలిన వారు తమ తమ నియోజకవర్గాల కేంద్రం లోనే ఉన్నప్పటికీ.. పార్టీ కార్యక్రమాలకు ప్రజలకు కూడా దూరంగా ఉన్నారు. వైసీపీ నుంచి గెలిచిన 22 మంది లోక్‌సభ సభ్యుల్లో మెజార్టీ ఎంపీలు ఢిల్లీ, హైదరాబాద్‌లో ఉంటే మరో ముగ్గురు ఎమ్మెల్యేలు బెంగళూరులో సేద తీరుతున్నారట.
వైఎస్ జయంతి కార్యక్రమాల్లోనూ….
ఇటీవల వైఎస్ జయంతి సందర్భంగా భారీ ఎత్తున నియోజకవర్గాల్లో కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ పిలుపునిచ్చింది. అయితే, కొన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమాలు చేసినా.. చాలా నియోజకవర్గాల్లో పట్టించుకున్న నాథుడు కనిపించలేదు. దీనిపై పార్టీలోనూ అంతర్గత చర్చ సాగుతోంది. ఇదిలావుంటే, కొందరు ఢిల్లీలో ఉన్న విషయంపై సీఎం జగన్ సీరియస్ అయ్యారని అంటున్నారు. కీలకమైన కరోనా సమయంలో పార్టీ ఎంపీలు నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండాల్సి ఉన్నప్పటికీ.. ఎందుకు దూరంగా ఉన్నారని వారిని ప్రశ్నించినట్లు తెలిసింది.
కరోనా భయపెట్టిందా?
కరోనా సెంటర్లలో సదుపాయాలు సరిగా అందడం లేదని పిర్యాదులు వస్తున్నాయిని, వీటిపై ప్రతిపక్షాలు విమర్శలు సంధిస్తున్నాయని, ఈ నేపథ్యంలో వాటిని ఖండించాల్సిన ఎంపీలు, ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండకుండా.. దూరంగా ఉండడం ఏంటి? అనే ప్రశ్న కూడా వస్తోంది. కొందరు తమ సొంత వ్యాపారాలు చూసుకుంటున్నారని తెలుస్తోంది. ఇంకొందరు.. నియోజకవర్గాల్లోనే ఉన్నప్పటికీ.. కరోనా ఎఫెక్ట్‌తో ప్రజలకు దూరంగా ఉంటున్నారట.
అంతర్గత చర్చల్లో మాత్రం…..
అయితే అదే టైంలో ఎంపీల నుంచి మరో వాదన కూడా వినిపిస్తోంది. ఈ 15 నెలల కాలంలో మమ్మల్ని పార్టీ అధినేత, పార్టీ ఎంత మాత్రం పట్టించుకోలేదని.. పదవులు, నామినేటెడ్ పోస్టుల విషయంలోనూ ఎమ్మెల్యేలు, మంత్రుల మాటే చెల్లుబాటు అయ్యిందని.. తాము పార్లమెంటు సమావేశాలకు మాత్రం కావాల్సి వచ్చిందా ? అన్న అసహనం వ్యక్తం చేస్తున్నారట. రాష్ట్ర సమస్యలు పార్లమెంటులో ప్రస్తావించడానికి మాత్రం కావాలా ? అని చర్చించుకుంటున్నారట.
అపాయింట్ మెంట్ కూడా….
ఎన్నికలు ముగిశాక జగన్ సైతం కనీసం 10 మంది ఎంపీలకు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని… మొత్తంగా ఒకరిద్దరు ఎంపీలు మినహా మిగిలిన వారు జిల్లాల్లో తమ వర్గానికి చిన్న పదవి కూడా ఇప్పించుకోలేనంత డమ్మీగా మారామన్న ఆవేదనలో ఉన్నారట. ఇక బయట కూడా వీరు ఎవరికి వారుగా తమ పనుల్లో మునిగి తేలుతున్నారట. మొత్తంగా వైసీపీ ఎంపీల ముచ్చట్లపై సోషల్ మీడియాలోనూ సెటైర్లు పేలుతున్నాయి.