రెండేళ్లవుతున్నా .. ఏ ఒక్క విషయంలోనూ…?

వైసీపీ అధికారంలోకి వచ్చి మరో మూడు నెలల్లో రెండేళ్ళు పూర్తి అవుతాయి. వైసీపీ ఎన్నికల ముందు ఎన్నో చెప్పింది. కానీ అధికారంలోకి వచ్చాక మాత్రం వాటిలో ఒక్కటి [more]

Update: 2021-03-23 06:30 GMT

వైసీపీ అధికారంలోకి వచ్చి మరో మూడు నెలల్లో రెండేళ్ళు పూర్తి అవుతాయి. వైసీపీ ఎన్నికల ముందు ఎన్నో చెప్పింది. కానీ అధికారంలోకి వచ్చాక మాత్రం వాటిలో ఒక్కటి కూడా జనాల ముందు పెట్టలేకపోయింది అన్న విమర్శలు అయితే ఎక్కువగానే ఉన్నాయి. ఇంతకీ వైసీపీ చెప్పింది చేయలేనిది ఏంటి అంటే హామీలు మాత్రం కాదు. అవి బాగానే నిలబెట్టుకున్నారు. కానీ వాటితో పాటే గత ప్రభుత్వంలో అవినీతి అక్రమాలను వెలికితీస్తామని చెప్పి మరీ గద్దెనెక్కారు. వాటి సంగతి తేల్చేందుకు వైసీపీకి రెండేళ్ల విలువైన సమయం సరిపోలేదా అన్న విమర్శలు అయితే వస్తున్నాయి.

సిట్ అంటే సిట్…..

సిట్.. ఈ షార్ట్ కట్ పదం రాజకీయ జీవులకు ఎంత బాగా నచ్చుతోందో మరి. అందుకే విశాఖ భూ కుంభకోణాల మీద నాడు వైసీపీ సహా విపక్షాలు ఆందోళనలు చేసి మరీ సీబీఐ విచారణను కోరితే నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు తాపీగా సిట్ అన్నారు. అంటే అది స్పెషల్ ఇవెస్టిగేషన్ టీమ్ ట. కానీ విశాఖలో భూ కబ్జాదారులను ఆ సిట్ ఎక్కడా బయటపెట్టలేదు. నివేదిక ఇచ్చింది అన్నారు అది ఇప్పటికీ బయటకు రాలేదు. అధికార‌ పార్టీ సిట్ అంటే సిట్ అన్నట్లుగానే ఆ తంతు ముగిసింది అని సెటైర్లు కూడా విపక్ష పార్టీల నుంచి పడ్డాయి.

అదే తీరులో..

ఇక వైసీపీ నాడు గర్జించిన తీరే వేరు. మేము అధికారంలోకి వస్తే విశాఖ భూ కబ్జాకోర్లను బయటపెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పిన వైసీపీ పెద్దలు ఇప్పటికీ అసలు నిందితులు ఎవరో తేల్చలేదు. జగన్ సీఎం అయ్యాక బాబు సిట్ ని కాదని కొత్తగా మరో సిట్ వేశారు. ఆ సిట్ కాలపరిమితిని అలా పెంచుకుంటూ పోతున్నారు. మరి దర్యాప్తు ఎపుడు పూర్తి అయ్యేనో, నివేదిక మరెపుడు వచ్చేనో అన్నట్లుగా సీన్ ఉంది. మొత్తానికి చూస్తే సిట్ నివేదికా లేదు, చర్యలూ లేవు అన్నట్లుగానే వైసీపీ సర్కార్ వ్యవహారం కూడా ఉందని అంటున్నారు.

అదే రాజకీయమా….?

సందు దొరికితే చాలు విశాఖలో టీడీపీ నేతలు భూ కబ్జాలకు పాల్పడ్డారు. వారి సంగతి తేల్చేస్తామంటూ వైసీపీ నేతలు పెద్ద మాటలే మాట్లాడుతూంటారు. జీవీఎంసీ ఎన్నికల సందర్భగా కూడా ఇవే మాటలను ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి వల్లించారు. తొందరలోనే అసలు నిందితులను పట్టుకుంటాం. విశాఖను కబ్జా చేసిన వారి బాగోతాలను బయటపెడతామని బిగ్ సౌండ్ చేశారు. అయితే ఇలాంటి మాటలను చాలాసార్లు విన్న విశాఖ జనం మాత్రం సీరియస్ గా పట్టించుకోవడం మానేశారు. ఇవి రాజకీయ విమర్శలుగానే చూస్తున్నారు. ఇంతకీ విశాఖలో భూ కుంభకోణం జరిగిందా లేదా. ఏమో నాయనా పులివచ్చె కధలాగ ఇంతటి తీవ్రమైన విషయమూ మారిపోవడం విషాదమే.

Tags:    

Similar News