తిరుప‌తి బాధ్యతపై వైసీపీలో సంక‌టం.. రీజ‌నేంటంటే?

తిరుప‌తి పార్లమెంటు నియోజకవర్గానికి ఉప ఎన్నిక‌కు ముహూర్తం ద‌గ్గర‌కు వ‌స్తోంది. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో వైసీపీ భారీ మెజార్టీతో ఇక్కడ విజ‌యం సాధించింది. అంతేకాదు 2014 ఎన్నిక‌ల్లోనూ [more]

Update: 2020-12-18 02:00 GMT

తిరుప‌తి పార్లమెంటు నియోజకవర్గానికి ఉప ఎన్నిక‌కు ముహూర్తం ద‌గ్గర‌కు వ‌స్తోంది. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో వైసీపీ భారీ మెజార్టీతో ఇక్కడ విజ‌యం సాధించింది. అంతేకాదు 2014 ఎన్నిక‌ల్లోనూ ఇక్కడ వైసీపీనే గెలుపు గుర్రం ఎక్కింది. ఇప్పుడు ఉప ఎన్నికే అయినా ఇక్కడ హ్యాట్రిక్ విజ‌యం ఆ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. ఇప్పటికే ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీ ఇక్కడ అభ్యర్థిని ప్రక‌టించేసి టికెట్‌పై ఆశ‌లు పెట్టుకునేవారు లేకుండా అస‌మ్మతి ప్రబ‌ల‌కుండా ముంద‌స్తుగా నిర్ణయం తీసుకుంది. ఇక‌, ప్రచారం కూడా ప్రారంభించేందుకు నాయ‌కులు రెడీ అవుతున్నారు. ఉప ఎన్నిక కోసం పార్టీ కీల‌క నేత‌ల‌కు ప్రాంతాల వారీగా బాధ్యత‌లు కూడా అప్పగించేసింది.

అభ్యర్థి కొత్త కావడంతో…..

బీజేపీ-జ‌న‌సేన కూట‌మి త‌రఫున ఎవ‌రు నిల‌బ‌డ‌తారు ? అనే విష‌యం కూడా త్వర‌లోనే తేల‌నుంది. అయితే.. వైసీపీ త‌ర‌ఫున ఇప్పటికే అభ్యర్థి రెడీ అయ్యార‌ని స‌మాచారం అందుతోంది. ప్రముఖ డాక్టర్‌ను తిరుపతి నుంచి పోటీకి పెట్టాల‌ని జ‌గ‌న్ నిర్ణయించుకున్నట్టు తెలిసింది. అయితే.. ఈయ‌న‌కు ఇప్పటి వ‌ర‌కు రాజ‌కీయాలు తెలియ‌వు. పైగా నియోజ‌క‌వ‌ర్గం కూడా కొత్తే. దీంతో ఆయ‌న‌ను పోటీకి నిలబెడితే అన్నీతామే చూసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని వైసీపీ వ‌ర్గాలు అంటున్నాయి. ఈ క్రమంలో నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీని, అభ్యర్థిని గెలిపించే బాధ్యత‌లు ఎవ‌రికి అప్పగిస్తారు ? అనే విష‌యం చ‌ర్చనీయాంశంగా మారింది.

జగన్ దూరంగా ఉండి…

జ‌గ‌న్ ఇప్పటికే ఈ తిరుపతి ఉప ఎన్నిక‌పై నెల్లూరు, చిత్తూరు జిల్లాల ప‌రిధిలో ఉన్న ఈ పార్లమెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని ఎమ్మెల్యేలు, నేల‌ల‌తో స‌మావేశం కూడా నిర్వహించారు. సీటు ఎవ‌రికి ఇచ్చినా అంద‌రూ క‌లిసిక‌ట్టుగా అభ్యర్థిని తిరుగులేని మెజార్టీతో గెలిపించాల‌ని సూచించారు. ఈ ఉప ఎన్నిక కోసం నేరుగా జ‌గ‌న్ రంగంలోకి దిగే ప‌రిస్థితి ఉండ‌ద‌ని అంటున్నారు. కేవ‌లం ఉప ఎన్నిక క‌నుక‌.. నేరుగా సీఎం రంగంలోకి దిగితే.. సంకేతాలు వేరుగా ఉంటాయి క‌నుక ఆయ‌న దూరంగా ఉంటార‌ని.. కీల‌క నేత‌కు బాధ్యత‌లు అప్పగిస్తార‌ని అంటున్నారు.

ఎవరికి అప్పగించాలి?

జిల్లాకు చెందిన కీల‌క మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రా రెడ్డికే ఇక్కడి బాధ్యత‌లు ఇస్తార‌ని అంటున్నారు. జ‌గ‌న్ కూడా తిరుపతి ఉప ఎన్నిక బాధ్యత అంతా పెద్దిరెడ్డి మీదే పెట్టాల‌ని చూస్తున్నా స్థానికంగా ప‌రిస్థితి వేరుగా ఉంది. పెద్దిరెడ్డికి చిత్తూరు జిల్లాలో వ్యతిరేక వ‌ర్గం పెరిగిపోయింది. దీంతో ఆయ‌న‌కు క‌లిసి వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌. ఈ నేప‌థ్యంలో టీటీడీ చైర్మన్‌గా ఉన్న జ‌గ‌న్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికే ఇక్కడ బాధ్య‌త అప్పగించే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. అదే స‌మ‌యంలో భూమ‌న‌, చెవిరెడ్డి భాస్కర‌రెడ్డి వంటి వారు కూడా బాధ్యత‌లు తీసుకునేందుకు ముందున్నారు. అయితే పెద్దిరెడ్డిని కాద‌ని జ‌గ‌న్ వీరికి ఈ బాధ్యత‌లు ఇవ్వడం డౌటే అంటున్నారు. ఏదేమైనా తిరుప‌తి ఉప ఎన్నిక బాధ్యత అనేది వైసీపీలో సంక‌టంగా మారిన‌ట్టే క‌నిపిస్తోంది.

Tags:    

Similar News