Kuppam : “కుప్పం” ను ఫిక్స్ చేసేస్తున్నారా?

ప్రధాన నేతను రాజకీయంగా ఇరుకున పెట్టినప్పుడే సక్సెస్ చూడగలుగుతాం. రాజకీయాల్లో దానికి మించిన సంతృప్తి మరొకటి ఉండదు. ఇప్పుడు కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబును మరింత ఇరకాటంలోకి నెట్టాలన్న [more]

Update: 2021-10-24 08:00 GMT

ప్రధాన నేతను రాజకీయంగా ఇరుకున పెట్టినప్పుడే సక్సెస్ చూడగలుగుతాం. రాజకీయాల్లో దానికి మించిన సంతృప్తి మరొకటి ఉండదు. ఇప్పుడు కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబును మరింత ఇరకాటంలోకి నెట్టాలన్న ప్రయత్నంలో జగన్ ఉన్నారు. ఇప్పటికే కుప్పం పైన కొంత వైసీపీ పట్టు సాధించగలిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో జెండా ఎగురవేసి ఆధిపత్యాన్ని చాటుకుంది. దీంతో చంద్రబాబులో కంగారు మొదలయింది.

బాబులో కలవరం….

అందుకే చంద్రబాబు గతంలో ఎన్నడూ లేని విధంగా కుప్పం నియోజకవర్గంలో పర్యటనలు ఏర్పాటు చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం నుంచే చంద్రబాబు పోటీ చేస్తారు. ఇందులో తేడా ఉండదు. తేడా కొట్టకుండా చంద్రబాబు కూడా పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రయత్నిస్తున్నారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ ఇప్పుడు కుప్పం పైనే దృష్టి పెట్టింది. కుప్పం కోటను బద్దలు చేయాలని భావిస్తుంది.

బలోపేతం చేయడానికి….

కుప్పం నియోజకవర్గంలో వైసీపీని మరింత బలోపేతం చేయడానికి అస్త్ర శస్త్రాలు ముఖ్యమంత్రి జగన్ సిద్దం చేస్తున్నారు. ఇందుకోసం ఆయన కుప్పం అభివృద్ధిపై ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ఇప్పటికే కుప్పం నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ రెడ్డప్పలు విస్తృతంగా పర్యటిస్తున్నారు. మరింత పర్యటలను పెంచాలని జగన్ ఆదేశించినట్లు తెలిసింది. చేరికలను కూడా మరింతగా పెంచాలని కోరారు.

కుప్పం పర్యటనకు…

దీంతో పాటు రచ్చ బండ కార్యక్రమంలో భాగంగా జగన్ కుప్పం నియోజకవర్గాన్ని ఎంచుకునే అవకాశాలు కూడా కన్పిస్తున్నాయి. కుప్పంలో పాదయాత్ర సమయంలోనూ జగన్ పర్యటించలేదు. ఈ రెండేళ్లలో జగన్ కుప్పం నియోజకవర్గంలో పర్యటించలేదు. అయితే ఈసారి జగన్ పర్యటన కుప్పంలో ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రచ్చబండ కార్యక్రమంలో కుప్పంలో పర్యటించే అవకాశాలున్నాయని జగన్ పార్టీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబును కుప్పంలో టైట్ చేసి రాజకీయంగా, మానసికంగా ఇబ్బంది పెట్టాలన్నది వైసీపీ ఆలోచన. మరి ఏమేరకు సక్సెస్ అవుతారో చూడాలి.

Tags:    

Similar News