జగన్ రాంగ్ స్ట్రాటజీ.. ఆ మూడు సీట్లు గోవిందా?
రాజకీయాల్లో వ్యూహాలు పదునుగా ఉండాలి. ఏ మాత్రం తేడా వచ్చినా.. అసలుకే ఎసరొచ్చే ప్రమాదం పొంచి ఉంటుంది. ఇదే మాట ఇప్పుడు వైసీపీ అనుసరించాలని భావిస్తున్న ఒక [more]
రాజకీయాల్లో వ్యూహాలు పదునుగా ఉండాలి. ఏ మాత్రం తేడా వచ్చినా.. అసలుకే ఎసరొచ్చే ప్రమాదం పొంచి ఉంటుంది. ఇదే మాట ఇప్పుడు వైసీపీ అనుసరించాలని భావిస్తున్న ఒక [more]
రాజకీయాల్లో వ్యూహాలు పదునుగా ఉండాలి. ఏ మాత్రం తేడా వచ్చినా.. అసలుకే ఎసరొచ్చే ప్రమాదం పొంచి ఉంటుంది. ఇదే మాట ఇప్పుడు వైసీపీ అనుసరించాలని భావిస్తున్న ఒక వ్యూహంపై పరిశీలకులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం. ప్రకాశం జిల్లాలోని కీలకమైన మూడు నియోజకవర్గాల్లో వైసీపీ వ్యూహం లేకుండా వ్యవహరిస్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా పుంజుకున్నప్పటికీ.. ప్రకాశం విషయానికి వస్తే.. వైసీపీ నాలుగు చోట్ల విజయం దక్కించుకోలేక పోయింది. వీటిలో కొండపి మినహా.. మిగిలిన మూడు అత్యంత కీలకం.
మళ్లీ ఆయనకే…?
చీరాల, అద్దంకి, పర్చూరు. ఈ మూడు నియోజకవర్గాల్లోనూ వైసీపీ సునామీని తట్టుకుని టీడీపీ విజయం దక్కించుకుంది. అయితే.. ఇప్పుడు చీరాల కేంద్రంగా వైసీపీ ఒక వ్యూహం వేస్తోంది. ఇక్కడ నుంచి గెలిచిన టీడీపీ నాయకుడు కరణం బలరాంను వైసీపీవైపునకు తిప్పుకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లోనూ ఇక్కడే ఆయనకు టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. కానీ, ఇక్కడ నుంచి గతంలో రెండుసార్లు విజయం దక్కించుకున్న ఫైర్ బ్రాండ్ ఆమంచి కృష్ణమోహన్ కు ఈ నియోజకవర్గంపై పట్టుంది. గతంలో ఇక్కడ ఆయన ఇండిపెండెంట్‌గా కూడా గెలిచి రికార్డు సృష్టించారు.
అక్కడ కాపులకిస్తే….?
అయితే.. గత ఎన్నికల్లో ప్రజలు తమ సహజ ధోరణికి భిన్నంగా కరణం బలరాంను గెలిపించారు. అయితే.. నెక్స్ట్ టైం కూడా ఇదే రిపీట్ అవుతుందనే గ్యారెంటీ లేదు. అయినప్పటికీ.. వైసీపీ వ్యూహం మాత్రం ఇక్కడ కరణం బలరాంకే అవకాశం ఇవ్వావాలని.. అదే సమయంలో కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న పర్చూరు సీటును ఆమంచికి కేటాయించాలని భావిస్తున్నారు. ఇప్పటికే పార్టీలో దీనిపై చర్చలు నడుస్తున్నాయి. అయితే.. ఈ రెండూ కూడా రాంగేనని అంటున్నారు పరిశీలకులు. కమ్మ వర్గం బలంగా ఉన్న పర్చూరులో కాపు నేతను నిలబెడితే.. ఓడిపోవడం ఖాయమని అంటున్నారు.
బలం లేని చోట…..
అదే సమయంలో అద్దంకి విషయంలోనూ వైసీపీ వ్యూహం మార్చుకోవాలనే సూచనలు వస్తున్నాయి. ఇక్కడ వైసీపీ ఇంచార్జ్ గా ఉన్న చెంచుగరటయ్య కుమారుడు బాచిన కృష్ణచైతన్యకే టికెట్ ఇవ్వాలని భావిస్తున్నారు. కానీ, ఇప్పటికే ఎమ్మెల్యేగా గొట్టిపాటి రవి దూకుడుముందు ఈ ఫ్యామిలీ నిలబడడం కష్టమని అంటున్నారు. ఈ క్రమంలో కరణంకు అద్దంకి కేటాయిస్తే.. బెటర్ అని.. ఇక్కడ ఆయనకు గట్టి పట్టు ఉండడంతోపాటు. గట్టి ఫైట్ చేసైనా విజయం దక్కించుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకంటే కరణం ఫ్యామిలీ పట్టు అంతా అద్దంకిలోనే.. చీరాలలో గత ఎన్నికలకు ముందు వచ్చి గెలిచినా ఇక్కడ ఇప్పటికీ పట్టు చిక్కడం లేదు.
వ్యూహం మార్చుకుంటేనే?
అదే సమయంలో ఆమంచికి చీరాలను కేటాయించడం ద్వారా సునాయాసంగా ఈ సీటును వైసీపీ ఖాతాలో వేసుకోవచ్చని సూచిస్తున్నారు. ఇక, పర్చూరు విషయానికి వస్తే.. బలమైనన కమ్మనేతకు అవకాశం ఇవ్వడం ద్వారా ఇక్కడ కూడా విజయం దక్కించుకునే అవకాశం ఉండడం లేదా గట్టి పోటీ ఉంటుందని చెబుతున్నారు. అంటే.. ఇప్పుడున్నవ్యూహంతో వైసీపీ వెళ్తే.. మూడు సీట్లలోనూ వైసీపీ గెలిచే అవకాశం లేదని.. అలా కాకుండా.. వ్యూహం మార్చుకుని ముందుకు సాగితే.. ఫలితం ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. మరి జగన్ ఏం చేస్తారో చూడాలి