వైసీపీ ప్లీనరీ అపుడేనా… ?
వైసీపీ ఒక రాజకీయ పార్టీ. ముందు పార్టీ సవ్యంగా ఉంటేనే అధికారాలూ వైభోగాలు. ఇవన్నీ పక్కన పెడితే పార్టీ రాజ్యాంగం ప్రకారం రెండేళ్ళకు ఒకమారు ప్లీనరీ నిర్వహించాలి. [more]
వైసీపీ ఒక రాజకీయ పార్టీ. ముందు పార్టీ సవ్యంగా ఉంటేనే అధికారాలూ వైభోగాలు. ఇవన్నీ పక్కన పెడితే పార్టీ రాజ్యాంగం ప్రకారం రెండేళ్ళకు ఒకమారు ప్లీనరీ నిర్వహించాలి. [more]
వైసీపీ ఒక రాజకీయ పార్టీ. ముందు పార్టీ సవ్యంగా ఉంటేనే అధికారాలూ వైభోగాలు. ఇవన్నీ పక్కన పెడితే పార్టీ రాజ్యాంగం ప్రకారం రెండేళ్ళకు ఒకమారు ప్లీనరీ నిర్వహించాలి. కొత్త కార్యవర్గాలు కూడా ఏర్పాటు చేయాలి. కానీ గత నాలుగేళ్లుగా వైసీపీ పార్టీ మహా జన సభ జరిగింది లేదు. 2017 జూలైలో ఆఖరు సారిగా వైసీపీ ప్లీనరీని పెద్ద ఎత్తున నిర్వహించారు. నాటి ప్లీనరీకి వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అతి పెద్ద ఆకర్షణ. ఒక వైపు చెల్లెలు షర్మిల, మరో వైపు తల్లి విజయమ్మ ఇలా నాటి ప్లీనరీ చూస్తే చాలు వైసీపీ అధికారంలోకి వచ్చేసినట్లుగానే అనిపించింది.
ఏవీ నాటి వెలుగులు..?
ఇక 2017 నాటి ప్లీనరీ వైసీపీ చరిత్రలోనే గుర్తుండిపోయేదిగా చెప్పుకోవాలి. ఆ ప్లీనరీ జగన్ కి చక్కని దిశానిర్దేశం చేసింది. ఆయన సుదీర్ఘ పాదయాత్రకు కూడా ప్లీనరీలోనే డిసైడ్ చేశారు. అది సూపర్ డూపర్ సక్సెస్ అయి జగన్ని 2019 నాటికి బంపర్ మెజారిటీతో సీఎం కుర్చీలో కూర్చేబెట్టింది. నాడు పార్టీ క్యాడర్ అంతా పడి లేచే కడలి తరంగాల్లా ఉత్సాహంగా ఉండేవారు. మరి ఇపుడు చూస్తే వైసీపీలో నాటి జోష్ ఎటు చూసినా కనిపించడంలేదు. అసలు వైసీపీకి ప్రెసిడెంట్ ఎవరు అన్న డౌట్ కూడా కొత్తగా పుట్టుకువస్తోంది.
కదలిక వచ్చిందా..?
అయితే తాజాగా వైసీపీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం వచ్చే రెండు నెలల్లో వైసీపీ ప్లీనరీ నిర్వహిస్తారు అంటున్నారు. ఈ ప్లీనరీ ద్వారా రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి వరకూ కొత్త కమిటీలు ఏర్పాటు చేస్తారని కూడా చెబుతున్నారు. అదే నిజం అయితే జగన్ మేలుకున్నట్లే లెక్క. నిజంగా ఇపుడు పార్టీ పడకేసింది. ఎంతలా అంటే ఇది తమ ప్రభుత్వమని కూడా క్యాడర్ బయటకు వచ్చి చెప్పలేకపోతున్నారు. వారికి అధినాయకత్వానికి అతి పెద్ద అగాధం ఏర్పడింది. నిండా నిరాశ ఆవహించింది. దానిని సరైన టైమ్ లో జగన్ గుర్తించినట్లే ఉన్నారు. అందుకే ప్లీనరీ అంటున్నారు అనుకోవాలి.
అలా చేస్తేనే …?
ఇక పార్టీ పదవులు కీలకమైన వారికి పంపిణీ చేయాలని జగన్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అయితే పార్టీ కోసం పనిచేసే వారికే పదవులు ఇస్తే మంచిది అన్న మాట ఉంది. పార్టీకి ఒకనాడు పనిచేసిన వారు అంతా ఎమ్మెల్యేలు మంత్రులుగా మారిపోయారు. ఇక చాలా మంది నామినేటెడ్ పదవులలో కూడా కుదురుకున్నారు. అందువల్ల వారికే తిరిగి వైసీపీ పగ్గాలు ఇస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. కాబట్టి పార్టీ మళ్ళీ పునరుత్తేజం పొందాలంటే వైసీపీ జెండా మోసేవారికి, ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు నలుగురికీ చెప్పేవారికీ అవకాశం ఇస్తే బాగుంటుంది. రేపటి రోజున వారి నుంచే మంచి నాయకులు కూడా వస్తారు. మరి ఈ విషయంలో జగన్ ఆలోచనలు కూడా ఇదే తీరున సాగితే వైసీపీ 2024 ఎన్నికలకు రెడీ అయిపోయినట్లే.