వైసీపీకి టచ్ లో ఉన్న టీడీపీ నేతలు వీరేనా?

ఎన్నిక‌ల‌కు స‌మయం ఎక్కువ‌గా లేక‌పోవ‌డం.. నేత‌ల మ‌ధ్య ఇంకా స‌మ‌న్వయం సాధించ‌ని నేప‌థ్యంలో అధికార పార్టీలో దాదాపు ఆరేడు జిల్లాల్లో ప‌రిస్థితి దారుణంగానే ఉంద‌ని చెప్పక‌తప్పదు. కేవలం [more]

Update: 2019-01-17 01:30 GMT

ఎన్నిక‌ల‌కు స‌మయం ఎక్కువ‌గా లేక‌పోవ‌డం.. నేత‌ల మ‌ధ్య ఇంకా స‌మ‌న్వయం సాధించ‌ని నేప‌థ్యంలో అధికార పార్టీలో దాదాపు ఆరేడు జిల్లాల్లో ప‌రిస్థితి దారుణంగానే ఉంద‌ని చెప్పక‌తప్పదు. కేవలం టీడీపీ అధినేత చంద్రబాబుకు భ‌య‌ప‌డి స‌ర్దుకు పోతున్న నాయ‌కులు క‌నిపిస్తున్నారే త‌ప్ప.. పార్టీని నిజంగా నిబ‌ద్ధత‌తో ముందుకు నడిపించాల‌నే వ్యూహాన్ని మాత్రం చాలా మంది త‌మ్ముళ్లు విస్మరిస్తున్నారు. ఏ ఎండ‌కు ఆ గొడుగు అనే సామెత‌ను నాయ‌కులు నిజం చేస్తున్నారు. ఎవ‌రికి వారే వ్యక్తిగ‌తంగా స‌ర్వేలు చేయించుకుని టీడీపీ అధికారంలోకి వ‌స్తుందో రాదో తెలుసుకుంటున్నారు. నిజానికి ఈ విషయం రెండు నెల‌లుగా న‌లుగుతున్నా.. చంద్రబాబు సీరియ‌స్ గా తీసుకోలేదు.

టిక్కెట్ ఆశిస్తున్న నేతలు…..

కానీ, ఇప్పుడు మాత్రం వెలుగులోకి వ‌స్తోంది. నియోజ‌క‌వ‌ర్గాల్లో సిట్టింగు ఎమ్మెల్యేలు త‌మ భ‌విష్యత్తును తెలుసుకుంటుండ‌గా.. కొంద‌రు టికెట్ ఆశిస్తున్న నేత‌లు మాత్రం ఏకంగా పార్టీపైనే గురి పెట్టారు. అసలు పార్టీ అధికారంలోకి వ‌స్తుందో రాదో తెలుసుకుంటున్నారు. అదేస‌మ‌యంలో చంద్రబాబు వేస్తున్న వ్యూహాల‌ను కూడా ప‌సిగ‌డుతున్నారు. వీరంతా వైసీపీకి చేరువ కూడా అవుతుండడం ఇప్పుడు టీడీపీలో పెద్ద ఎత్తున సంచ‌ల‌నం సృస్టిస్తోంది. ఇలా పార్టీకి ఇక‌, నూక‌లు చెల్లాయ్‌! అని భావిస్తున్న నేత‌లు వైసీపీ నేత‌ల‌తో ట‌చ్‌లో ఉంటున్నారు వీరంద‌రూ ఇప్పటికిప్పుడు పార్టీ మారే ఆలోచ‌న చేయ‌కున్నా.. వైసీపీకి ప‌రోక్షంగా సాయం చేయాల‌ని నిర్ణయించుకున్నారు.

విజయసాయిరెడ్డి వద్ద…..

ఈ క్రమంలోనే టీడీపీని సాధ్యమైనంత దిగ‌జార్చేందుకు కృషి చేయాల‌ని నిర్ణయించుకున్నారు. ఇలాంటివారి జాబితా వైసీపీలో కీల‌క నేత‌గా ఉన్న విజ‌యసాయిరెడ్డి ద‌గ్గర ఉంద‌ని తాజా స‌మాచారం. వీరంద‌రికి వైసీపీ అధినేత జ‌గ‌న్ కూడా అభ‌యం ఇచ్చార‌ని, త‌మ ప్రభుత్వం రాగానే నామినేటెడ్ పోస్టుల‌ను క్రియేట్ చేసి సంతృప్తి ప‌రుస్తామ‌ని కూడా హ‌మీ ఇచ్చిన‌ట్టు వైసీపీలో చ‌ర్చ న‌డుస్తోంది. అంటే టీడీపీలోనే ఉంటూ.. స్థానిక నాయ‌క‌త్వానికి స‌హ‌క‌రించకుండా.. చిచ్చు పెట్టడం ద్వారా టీడీపీ ఓట్లు చీలి వైసీపీ ల‌బ్ది పొందేలా వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నార‌ని స‌మాచారం. ఇలాంటి వారు జిల్లాకు ఇద్దరు చొప్పున ఉన్నార‌నేది ప్రాథ‌మిక స‌మాచారం. ఇప్పటికే ప‌లు స‌ర్వేలు చేయించి ప‌నితీరు బాగోలేద‌ని చంద్రబాబు చెప్పిన నాయ‌కులు అంద‌రూ ఇదే బాట‌లో న‌డుస్తున్నార‌ని తెలుస్తోంది. మ‌రి బాబు ఇప్పటికైనా వీరిని దారిలో పెట్టాల‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

Tags:    

Similar News