వైసీపీ గిల్లుతోంది…. టీడీపీ ఏడుస్తోంది
ఏపీ జనాలకు బోరు కొడుతున్న రాజకీయ సినిమా ఇది. గతంలోనూ ఇలాగే జరిగాయి. కానీ ఇపుడు జరుగుతున్నది మాత్రం యమ బోరు గా ఉంది. అధికార పార్టీ [more]
ఏపీ జనాలకు బోరు కొడుతున్న రాజకీయ సినిమా ఇది. గతంలోనూ ఇలాగే జరిగాయి. కానీ ఇపుడు జరుగుతున్నది మాత్రం యమ బోరు గా ఉంది. అధికార పార్టీ [more]
ఏపీ జనాలకు బోరు కొడుతున్న రాజకీయ సినిమా ఇది. గతంలోనూ ఇలాగే జరిగాయి. కానీ ఇపుడు జరుగుతున్నది మాత్రం యమ బోరు గా ఉంది. అధికార పార్టీ అన్నాక విపక్షాన్ని బలహీనం చేయాలనే చూస్తుంది. దాని కోసం టార్గెట్ కూడా పెట్టుకుంది. రాజకీయం అన్నాక అన్నీ భరించే రావాలి. ప్రతీ దానికీ అరచి గీ పెట్టి జనం సానుభూతి నిండారా జుర్రుకుందామని టీడీపీ చేస్తున్న ప్రయత్నం ఏనాడో బూమరాంగ్ అయింది. ఇక వైసీపీ చేస్తున్న రాజకీయాన్ని విపక్ష నేతల అరెస్టులను జనం అసలు సీరియస్ గా తీసుకోవడంలేదు. కానీ అనుకూల మీడియా తాటికాయంత రాతలతో హడావుడి చేస్తూంటే టీడీపీ హై కమాండ్ నుంచి దిగువ స్థాయి నేతలంతా తెగ గగ్గోలు పెడుతుండడం షరా మామూలు వ్యవహారం అవుతోంది.
రోజు ఉన్న దానికి …
ఏపీలో వైసీపీ టీడీపీల మధ్య రాజకీయం దాటేసి ఇంకేదో స్టేజికి కధ వచ్చేసింది. అది జనాలకు కూడా బాగా తెలుసు. ఏ టీడీపీ నేత కాస్తా కట్టు దాటుదాడో చూసిమరీ లటక్కున అరెస్ట్ చేసి పారేయడం అధికార పార్టీ వంతుగా ఉంది. అలా అరెస్ట్ చేసిన వెంటనే పెదబాబు, చినబాబు సహా టేడీపీ నేతలు అంతా పెద్ద సౌండ్ చేస్తూ జగన్ని, వైసీపీని విమర్శించడమూ చూస్తున్న వ్యవహారమే. దీని వల్ల కలసి వచ్చేది ఏదీ లేదని రెండు పార్టీలకు తెలుసు. ఇదొక రాజకీయ సయ్యాట. విపక్ష నేతలను తన అధికార బలంతో కంట్రోల్ లో పెట్టాను అను ఆత్మ తృప్తి పొందడం అధికార వైసీపీ వంతు అయితే వైసీపీని తిట్టేందుకు మరొక అవకాశం దొరికింది అన్న సంబరం తమ్ముళ్లది.
ఏమైపోయింది….?
ఇక వైసీపీ సర్కార్ గత రెండున్నరేళ్లలో టీడీపీ నేతలను చాలా మందిని అరెస్ట్ చేసింది. వారిలో బిగ్ షాట్స్ కూడా ఉన్నారు. అయినా సరే వారు ఎంచక్కా బెయిల్ మీద బయటకు వచ్చేశారు. దీని మీద టీడీపీ అదే పనిగా గుండెలు బాదేసుకున్నా కూడా లోకల్ బాడీ ఎన్నికల్లో అధికార పక్షానికే జనాలు ఓటేశారు. మరో వైపు వైసీపీ టీడీపీని నియంత్రించామని, భయపెట్టామని అనుకుంటే పొరపాటు ఆ పార్టీదే అవుతుంది. ఇక్కడ ఎవరూ భయపడరు, అలా అయితే రాజకీయమే చేయరు. పదేళ్ల పాటు విపక్షంలో ఉన్నపుడు జగన్ భయపడ్డారా. కాబట్టి ఆ థియరీ టీడీపీకి కూడా వర్తిస్తుంది. సో ఇది అంతా ఒక రాజకీయ నాటకంగా అలా సాగిపోవాల్సిందే.
కొండను తవ్వుతూనే …?
వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక కొండనే తవ్వుతోంది కానీ ఒక్క చిన్న ఎలకను కూడా పట్టడంలేదు. ఆ విషయమే తాజాగా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చెప్పారు. ఆయన అరెస్ట్ అంతా కూడా అర పూట ముచ్చటే అయింది. అంటే వైసీపీకి గిల్లడం సరదా. టీడీపీకి ఏడవడం సరదా. ఆ గిల్లడమూ నిజం కాదు, ఈ ఏడుపూ నిజం కాదు, ఇదంతా రాజకీయంగా చేస్తున్న విన్యాసాలుగానే చూడాలి. అంతకు ముందు అయిదేళ్ళూ టీడీపీ కూడా ఇలాగే చేసేది. కాకపోతే నాడు వైసీపీకి మీడియా మద్దతు తక్కువ కాబట్టి అది పెద్దగా ప్రచారంలోకి రాలేదు. ఇపుడు అనుకూల మీడియా అండతో ఇది రాక్షస పాలన, ఆటవిక పాలన అంటూ టీడీపీ బిగ్ స్టేట్మెంట్స్ ఇస్తోంది. మరి రేపటి రోజున ఇంతకు ఇంతా మూల్యం చెల్లిస్తాం, అందరి జాతకాలూ మా దగ్గర ఉన్నాయని బెదిరిస్తున్న చినబాబు. అచ్చెన్నాయుడు తమది కూడా రాక్షస పాలన అని ముందే చెప్పేస్తున్నారా అన్నదే డౌట్.