అమరావతి ఉద్యమం వెనుక అధికార పార్టీ షాడో నేతలు?
కొన్ని విషయాలు వినేందుకు చాలా ఆసక్తిగా ఉంటాయి. కొన్ని చిత్రంగా అనిపిస్తాయి. మరికొన్ని.. నిజమా? అనిపించేలా ఉంటాయి. అచ్చు ఇలాంటి వార్తే ఒకటి ఏపీ రాజధాని అమరావతి [more]
కొన్ని విషయాలు వినేందుకు చాలా ఆసక్తిగా ఉంటాయి. కొన్ని చిత్రంగా అనిపిస్తాయి. మరికొన్ని.. నిజమా? అనిపించేలా ఉంటాయి. అచ్చు ఇలాంటి వార్తే ఒకటి ఏపీ రాజధాని అమరావతి [more]
కొన్ని విషయాలు వినేందుకు చాలా ఆసక్తిగా ఉంటాయి. కొన్ని చిత్రంగా అనిపిస్తాయి. మరికొన్ని.. నిజమా? అనిపించేలా ఉంటాయి. అచ్చు ఇలాంటి వార్తే ఒకటి ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో వైరల్ అవుతోంది. అదే.. రాజధాని అమరావతి విషయంలో జరుగుతున్న ఉద్యమం వెనుక అధికార పార్టీ నేతలు ఉన్నారని! ఇది చాలా సీరియస్ విషయం. ఇప్పటి వరకు ఈ ఉద్యమాన్ని కించపరిచిన.. అసలు ఉద్యమమేలేదని చెప్పిన వైఎస్సార్ సీపీ నాయకులకు షాక్ ఇచ్చే అంశం. అయినా.. ఇది నిజమేనని అంటున్నారు విశ్లేషకులు సైతం..!
అనేక మంది పెట్టుబడులు పెట్టి….
అమరావతి రాజధానిగా ఏర్పాటు కానుండడంతో చాలా మంది పారిశ్రామిక వర్గాల నుంచి రాజకీయ నేతల వరకు విద్యాసంస్థల అధినేతల నుంచి ఒకింత ఆర్థికంగా బలంగా ఉన్నవారి వరకు ఇక్కడ పెట్టుబడులు పెట్టారు. కొందరు నేరుగా స్థలాలు కొనుగోలు చేస్తే.. మరికొందరు ఏదో ఒక రూపంలో పెట్టుబడులు పెట్టారు. ఇలా పెట్టుబడులు పెట్టిన వారిలో ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా చాలా మంది నేతలు ఉన్నారనేది వాస్తవం. జగన్‌కు అనుకూలంగా ఉండేవారు కూడా అమరావతి రాజధాని కాబట్టి.. అంటూ.. పెట్టుబడులు పెట్టారు.
వైసీపీ నేతలు కూడా…
అంతేకాదు, రేపు ఒకవేళ మా ప్రభుత్వమే వచ్చినా.. ఇబ్బంది లేదులే.. అని వారు అనుకున్నారు. అంతేకాదు.. జగన్ కూడా అమరావతికి అనుకూలంగానే ఉన్నారు కాబట్టి తమకు ఇబ్బంది లేదని భావించారు. అయితే, అనూహ్యంగా జగన్ అమరావతిపై యూటర్న్ తీసుకున్నారు. దీంతో టీడీపీ నాయకులు ఎంత బాధపడ్డారో.. మనకు తెలిసిందే. కానీ, ఇంతకంటే ఎక్కువగా ప్రస్తుత అధికార పార్టీ నేతలు బాధపడుతున్నారని తాజాగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే వారు కూడా అమరావతి ఇక్కడే ఉండాలనే డిమాండ్‌ను ఎత్తుకున్నారు.
ఆరా తీయగా…?
అయితే, నేరుగా ఈ విషయాన్ని వ్యక్తం చేయకుండా తెరచాటున ఉండి.. కొందరు అనుంగులతో అమరావతి ఉద్యమానికి పెట్టుబడులు పెట్టారని తెలుస్తోంది. ప్రస్తుతం అమరావతి ఉద్యమానికి సంబంధించి ఎవరెవరు వెనకాల ఉన్నారనే విషయంపై ఆరా తీయగా.. తమ పార్టీ నేతలు కూడా కొందరు ఉన్నారని తెలిసి.. జగన్ కూడా ఖిన్నులయ్యారని సమాచారం. మరి వీరిపై యాక్షన్ తీసుకుంటారో.. లేక తమ పార్టీ నేతలే కదా ? అని వదిలేస్తారో చూడాలి.