ఇదే ధోర‌ణి కొన‌సాగితే.. మ‌న ప‌రిస్థితేంటి.. వైసీపీలో చ‌ర్చ.?

రాష్ట్రంలో ప్రస్తుతం జ‌రుగుతున్న ప‌రిణామాలను కొంద‌రు వైసీపీ నాయ‌కులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇదే విధానం కొన‌సాగితే త‌మ ప‌రిస్థితి ఏంటి ? అని వారు ప్రశ్నిస్తున్నారు. దీనికి [more]

Update: 2021-09-06 11:00 GMT

రాష్ట్రంలో ప్రస్తుతం జ‌రుగుతున్న ప‌రిణామాలను కొంద‌రు వైసీపీ నాయ‌కులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇదే విధానం కొన‌సాగితే త‌మ ప‌రిస్థితి ఏంటి ? అని వారు ప్రశ్నిస్తున్నారు. దీనికి ప్రధాన కార‌ణం.. టీడీపీ నాయ‌కుడు, ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్‌కు చెందిన అమ‌రరాజా బ్యాట‌రీస్‌.. కంపెనీని మూసివేయాల‌ని .. ప్రభుత్వమే ప్రక‌టించ‌డం. తిరుపతిలో అమ‌ర‌రాజా ప్లాంటు ఉన్న చోట సరిచేయలేనటువంటి పర్యావరణ నష్టం జరిగింద‌నేది ప్రభుత్వ వాద‌న‌. అంతేకాదు, లోపాలను సరిచేసుకోవడానికి సమయం ఇచ్చిన తర్వాత ఉత్పత్తి నిలుపుదల ఉత్తర్వులు జారీ చేశారు. ఈ లోపాలను సరిదిద్దుకోనందువల్లే మూసివేత ఉత్తర్వులు ఇచ్చామ‌ని ప్రభుత్వం స్పష్టం చేసింది.

చాలా మంది వ్యాపారాల్లో…?

దీంతో అమ‌ర‌రాజా కంపెనీ ప‌రిస్థితి ఇప్పుడు డోలాయ‌మానంలో ప‌డింది. ఇంత వ‌ర‌కు ప‌రిస్థితి ఎలా ఉన్న ప్పటికీ.. అధికార పార్టీ వైసీపీకి చెందిన చాలా మంది నాయ‌కులు కూడా అనేక వ్యాపారాలు, ప‌రిశ్రమ‌ల్లో ఉన్నారు. వారు కూడా అనేక నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తున్నారు. నిజానికి ఏ ప‌రిశ్రమ అయినా.. నూటికి నూరు శాతం నిబంధ‌న‌లు పాటించ‌డం చాలా క‌ష్టమ‌నే భావన పారిశ్రామిక వ‌ర్గాల్లో ఉంది. అందుకే.. ప్రభుత్వాల‌ను అవి మ‌చ్చిక చేసుకుని చూసీ చూడ‌న‌ట్టు పోయే వాతావ‌ర‌ణాన్ని ఏర్పరుచుకుంటాయి. అయితే.. గ‌ల్లా విష‌యంలో మాత్రం ప్రభుత్వం ప‌ట్టు స‌డ‌లించ‌డం లేదు. ఇప్పటికే మాజీ మంత్రి గ‌ల్లా అరుణ‌కుమారి.. పార్టీ పెద్దల‌తో ర‌హ‌స్యంగా ఈ విష‌యంపై మంత‌నాలు కూడా చేశారు.

పార్టీ మారకపోవడంతో…?

కానీ, పార్టీ మారి తీరాల్సిందేన‌ని.. వైసీపీ అధినేత నుంచి స్పష్టమైన సంకేతాలు వ‌చ్చాయ‌ట‌. కానీ, పార్టీమార్పున‌కు గ‌ల్లా కుటుంబం సిద్ధంగా లేదు. దీంతో ఫ్యాక్టరీ విష‌యంలో మ‌రింత క‌ఠినంగా వ్యవ‌హ‌రించాల‌ని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంద‌ని పొలిటిక‌ల్ స‌ర్కిళ్లలో ప్రచారం జ‌రుగుతోంది. అయితే.. త‌మ‌కు కూడా ప‌రిశ్రమ‌లు ఉన్నాయ‌ని.. ఇప్పుడు ప్రభుత్వం అనుస‌రిస్తున్న వైఖ‌రిని రేపు వ‌చ్చే ప్రభుత్వం(ఒక‌వేళ వైసీపీ రాక‌పోతే) అనుస‌రిస్తే.. త‌మ ప‌రిస్థితి ఏంట‌ని.. వైసీపీ నాయ‌కులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.

పట్టు విడుపులు లేకుండా…?

“ఏవిష‌యంలో అయినా.. ప‌ట్టువిడుపులు ఉండాలి. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ఆక్వా ప‌రిశ్రమ ఇంత‌కంటే ఎక్కువ‌గా నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తోంది. కానీ, ఇది బీజేపీ నేత‌కు చెందిన ఫ్యాక్టరీ. ఆయ‌న కుమారుడు కూడా మా పార్టీలో చేరాడు. అందుకే చూసీ చూడ‌న‌ట్టు వ్యవ‌హ‌రిస్తున్నార‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ పద్ధతి మంచిది కాదు“ అని గుంటూరుకు చెందిన వైసీపీ నాయ‌కులు వ్యాఖ్యానించారు. దీంతో భ‌విష్యత్తుపై వైసీపీ నేత‌ల్లో బెంగ ప‌ట్టుకుంద‌నే విష‌యం స్పష్టమ‌వుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News