ఖాన్ వర్సెస్ రెడ్డి… ఫుల్ స్టాప్ పడేట్లు లేదే?
కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీలో విభేదాలు తీవ్రమయ్యాయి. ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డిలు రెండు గ్రూపులు కావడంతో వైసీపీ క్యాడర్ లో [more]
కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీలో విభేదాలు తీవ్రమయ్యాయి. ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డిలు రెండు గ్రూపులు కావడంతో వైసీపీ క్యాడర్ లో [more]
కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీలో విభేదాలు తీవ్రమయ్యాయి. ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డిలు రెండు గ్రూపులు కావడంతో వైసీపీ క్యాడర్ లో అయోమయం నెలకొంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇలాంటి పరిస్థితే ఉన్నప్పటికీ అధిష్టానం సయితం చూసీ చూడనట్లు వదిలేసింది. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. కర్నూలు నియోజకవర్గం వైసీపీకి అండగా నిలిచింది.
హఫీజ్ ఖాన్ గెలుపుకోసం….
2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎస్వీ మోహన్ రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన టీడీపీలోకి వెళ్లిపోయారు. మళ్లీ ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. అప్పటికే వైసీపీ అధిష్టానం హఫీజ్ ఖాన్ కు కర్నూలు అసెంబ్లీ టిక్కెట్ ఖరారు చేసింది. దీంతో ఎస్వీ మోహన్ రెడ్డి హఫీజ్ ఖాన్ గెలుపునకు కృషి చేశారు. కర్నూలు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే గెలిచిన నెల రోజులకే హఫీజ్ ఖాన్ కు, ఎస్వీ మోహన్ రెడ్డికి మధ్య విభేదాలు తలెత్తాయి.
నామినేటెడ్ పనుల కోసం…..
హఫీజ్ ఖాన్ ఎమ్మెల్యేగా ఉండటంతో ఆయన చెప్పినట్లే పనులు జరగాల్సి ఉంది. అయితే ఎస్వీ మోహన్ రెడ్డి జోక్యం చేసుకుంటుండటం హఫీజ్ ఖాన్ కు ఇబ్బందిగా మారింది. దీంతో ఆయన ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయినా ఫలితం లేకుండా పోయింది. నామినేటెడ్ పనులను తన వర్గానికే ఇవ్వాలని ఎస్వీ మోహన్ రెడ్డి పట్టుబడుతుండటంతో హఫీజ్ ఖాన్ ఆయనను కలిసేందుకు కూడా ఇష్టపడటం లేదు. దీంతో అధికారులపై వత్తిడి చేసి మరీ తన వర్గానికే నామినేటెడ్ పనులను హఫీజ్ ఖాన్ కేటాయించుకున్నారు.
విభేదాలు తీవ్రమయినా….
అయితే తొలి నుంచి వైసీపీ కోసం కష్టపడిన వారికి కాకుండా తన వెంట ఉన్న వారికి హఫీజ్ ఖాన్ నామినేటెడ్ పనులు కట్టబెట్టారని ఎస్వీమోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. దీంతో ఇద్దరూ పార్టీ కార్యక్రమాలను విడివిడిగా చేస్తున్నారు. ఒకరిని కలిసేందుకు మరొకరు ఇష్టపడటం లేదు. ఎమ్మెల్యేగా తన ప్రొటోకాల్ తనకు ఉంటుందని హఫీజ్ ఖాన్ అంటున్నారు. గెలుపులో తన పాత్ర కూడా ఉందని ఎస్వీ మోహన్ రెడ్డి అంటున్నారు. మొత్తం మీద కర్నూలు వైసీపీలో గ్రూపు తగాదాలు తీవ్రమవువుతన్నా అధిష్టానం మాత్రం పట్టించుకోకపోవడం క్యాడర్ లో చర్చనీయాంశమైంది.