ఎమ్మెల్యేల గ‌గ్గోలు.. 70 నియోజ‌క‌వ‌ర్గాలు గాలికేనా..?

వైసీపీ ఎమ్మెల్యేలు గ‌గ్గోలు పెడుతున్నారా ? రాష్ట్రంలో దాదాపు 70 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యేలు తీవ్ర ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుస్తామా ? లేక [more]

Update: 2021-08-19 11:00 GMT

వైసీపీ ఎమ్మెల్యేలు గ‌గ్గోలు పెడుతున్నారా ? రాష్ట్రంలో దాదాపు 70 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యేలు తీవ్ర ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుస్తామా ? లేక ఇప్పటితో స‌రా అంటూ.. వారు తమ అనుచరుల వ‌ద్ద వ్యాఖ్యానిస్తున్నారు. విష‌యంలోకి వెళ్తే.. గ‌త ఎన్నిక‌ల్లో యువ‌త‌కు, ముఖ్యంగా కొత్తవారికి జ‌గ‌న్ ఎమ్మెల్యే టికెట్ లు ఇచ్చి విజ‌యం సాధించేలా ప్రోత్సహించారు. అంద‌రూ ఎమ్మెల్యేలు అయ్యారు. అయితే.. ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి విష‌యంలో నిధులు వీరికి అంద‌డం లేదు.

సమస్యలు ఎక్కడివక్కడే….

దీంతో నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌మ‌స్యలు ఎక్కడివ‌క్కడే ఉన్నాయ‌ని వాపోతున్నారు. ప్రభుత్వం ఒక‌వైపు ల‌క్షల కోట్లతో ప్రజ‌ల‌కు సంక్షేమ ప‌థ‌కాల‌ను నేరుగా అందిస్తున్నా.. రేపు ఎన్నిక‌ల స‌మ‌యానికి తాము ప్రజ‌ల ద‌గ్గర‌కు వెళ్తే.. నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి విష‌యాన్ని ప్రశ్నించ‌కుండా ఉంటారా? అనేది వీరి అనుమానం. అంతేకాదు.. ప్రజ‌ల‌తో త‌మ‌కు సంబంధాలు కూడా ఉండడం లేద‌ని.. వ‌లంటీర్లు-ప్రజ‌లు, సీఎం-ప్రజ‌లు, అధికారులు-ప్రజ‌లు అన్నట్టుగానే ప‌రిస్థితి ఉంద‌ని.. త‌మ‌ను ఎవ‌రూ ఖాత‌రు చేయ‌డం లేద‌ని వైసీపీ ఎమ్మెల్యేలు వాపోతున్నారు.

నిలిచిపోయిన పనులు….

ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌మ‌స్యలు తిష్టవేశాయి. చంద్రబాబు హ‌యాంలో కొంత మేర‌కు ప‌నులు జరిగినా.. చాలా చోట్ల ప‌నులు నిలిచిపోయాయి. ఉదాహ‌ర‌ణ‌కు గుంటూరు జిల్లా ప‌ల్నాడు ప్రాంతంలో వెలిస‌ల సాగునీటి ప్రాజెక్టును నిర్మించాల‌నేది ఇక్కడి ప్రజ‌ల డిమాండ్‌. గ‌త చంద్రబాబు ప్రభుత్వంలో కేంద్రం నుంచి కొద్దిగా నిధులు తెచ్చి ప్రారంభించారు. దీనికి రాష్ట్ర స‌ర్కారు వాటా ఇవ్వాల్సి ఉంది. కానీ, ఇది ముందుకు సాగ‌డం లేదు. విజ‌య‌వాడ‌-మ‌చిలీప‌ట్నం.. ప్రధాన ర‌హ‌దారి విస్తర‌ణ‌లో భూములు కోల్పోయిన వారికి ఇప్పటికి న‌ష్టప‌రిహారం అంద‌లేదు. దీంతో వైసీపీ ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.

దొనకొండ విషయంలోనూ….

అదేస‌మయంలో ప్రకాశంజిల్లా దొన‌కొండ అభివృద్ధి స‌హా అనేక ప్రాజెక్టుల‌కు ఎన్నిక‌ల‌కుముందు ప్రజలకు హామీ ఇచ్చినా.. ఇప్పటి వ‌ర‌కు ఒక్క అడుగు కూడా ముందుకు ప‌డ‌లేదు. మ‌రోవైపు.. ర‌హ‌దారులు గుంత‌లు ప‌డిపోయినా.. ప‌ట్టించుకుని బాగు చేసేందుకు స్థానిక వైసీపీ ఎమ్మెల్యేల‌కు నిధులు చిక్కడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ర‌హ‌దారుల ప‌రిస్థితి అధ్వానంగా ఉంది. ఎమ్మెల్యేలు నిధులు అడుగుతున్నా అపాయింట్‌మెంట్లు లేవు.. నిధులూ రావ‌డం లేదు.

సంక్షేమం అమలవుతున్నా…?

వైసీపీ ప్రభుత్వం సంక్షేమం చేస్తున్నా.. నేరుగా ప్రజ‌ల‌కు డ‌బ్బులు ఇస్తున్నా.. స్థానిక స‌మ‌స్యల‌ను కూడా ప‌ట్టించుకునేందుకు ఎమ్మెల్యేల‌కు కూడా నిధులు ఇవ్వాలి క‌దా! అంటున్నారు కొత్తగా ఎన్నికైన నాయ‌కులు. సీనియ‌ర్లు అంటే..ఎలాగోలా మేనేజ్ చేస్తున్నార‌ని.. తాము ప్రజ‌ల‌కు ముఖం చూపించ‌లేక పోతున్నామ‌ని తీవ్ర ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నారు

Tags:    

Similar News