అంతర్మథనంలో వైవీ.. కొడుకు దూకుడుతో చిక్కులు?
వైసీపీ కీలక నాయకుడు, సీఎం జగన్‌కు స్వయానా చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డి అంతర్మథనంలో కూరుకుపోయారు. తన కుమారుడు.. విక్రాంత్‌రెడ్డి దూకుడుతో ఆయనకు రాజకీయ చిక్కులు వచ్చిపడ్డాయి. విశాఖలో [more]
వైసీపీ కీలక నాయకుడు, సీఎం జగన్‌కు స్వయానా చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డి అంతర్మథనంలో కూరుకుపోయారు. తన కుమారుడు.. విక్రాంత్‌రెడ్డి దూకుడుతో ఆయనకు రాజకీయ చిక్కులు వచ్చిపడ్డాయి. విశాఖలో [more]
వైసీపీ కీలక నాయకుడు, సీఎం జగన్‌కు స్వయానా చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డి అంతర్మథనంలో కూరుకుపోయారు. తన కుమారుడు.. విక్రాంత్‌రెడ్డి దూకుడుతో ఆయనకు రాజకీయ చిక్కులు వచ్చిపడ్డాయి. విశాఖలో బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి పెద్ద ఎత్తున మీడియాలో వస్తున్న వార్తలతో.. కేంద్రంలోని జాతీయ హరిత ట్రైబ్యునల్ తీవ్రంగా స్పందించింది. ముఖ్యంగా అటవీ ప్రాంతాన్ని నరికేయడం.. రోడ్లు వేయడం.. వంటి పరిణామాలు.. తీవ్రంగా మారుతున్నాయి. మరోవైపు.. సీఎం జగన్ కూడా ఈ విషయంలో సీరియస్‌గానే ఉన్నారని.. పార్టీ పెద్దలే చెబుతున్నారు.
ప్రభుత్వ నిబంధనలన అతిక్రమించి….
దీంతో వైవీ సుబ్బారెడ్డి కి ఇప్పుడు ఊపిరి సలపడం లేదట. ఇటీవల టీటీడీ చైర్మన్ పదవి కూడా పోవడం.. దీనిని రెన్యువల్ చేయకుండా జగన్ పక్కన పెట్టడానికి కూడా ఇదే పెద్ద కారణమనే ప్రచారం ఆలస్యంగా వెలుగు చూసింది. ఇక ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఉబలాట పడుతున్నారు. వైవీ సుబ్బారెడ్డిరొ రాజ్యసభ ఇచ్చే పరిస్థితి లేదు. ఇటు ఎమ్మెల్సీ కూడా కష్టమే అని తెలుస్తోంది. ఇక విశాఖ ప్రాజెక్టుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినా.. ప్రభుత్వ పరిధి దాటి తవ్వకాల కోసం ప్రయత్నాలు చేశారని అంటున్నారు. ఈ పరిణామం.. వైసీపీ వ్యతిరేక మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చేలా చేసింది.
పార్టీ బాధ్యతలను కూడా…?
దీనిని సుమోటోగా పరిగణించిన హరిత ట్రైబ్యునల్ కేసు నమోదుకు అధికారులను ఆదేశించింది. దీంతో వైవీ సుబ్బారెడ్డి రాజకీయ పరిస్థితిపైనా నీలినీడలు కమ్ముకుంటున్నాయని అంటున్నారు. వాస్తవానికి టీటీడీ బోర్డును మరోసారి ప్రక్షాళన చేసి.. వైవీనే చైర్మన్‌గా నియమిస్తారని అందరూ అనుకున్నారు. కానీ, ఇప్పుడు జగన్ ఆయన పేరును పక్కన పెట్టి మేకపాటి పేరును పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు.. పార్టీలో ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పటికీ.. ఆయనకు ఇంచార్జ్‌గా బాధ్యతలు అప్పగించిన రెండు జిల్లాల్లో తూర్పుగోదావరి బాధ్యతలను సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించేందుకు కూడా రెడీ అయ్యారని అంటున్నారు.
విజయమ్మ తో లాబీయింగ్….
ఈ పరిణామాలతో వైవీ సుబ్బారెడ్డి భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. పార్టీలో నెంబర్ 2 లేదా 3గా ఇప్పటి వరకు చలామణి అయిన.. వైవీ సుబ్బారెడ్డి తన కుమారుడు దూకుడు కారణంగా ఎసరు తెచ్చుకున్నారని.. పార్టీలో తీవ్ర చర్చ సాగుతుండడం గమనార్హం. ఇక ఆయన సొంత జిల్లా ప్రకాశంలోనూ ఆయన మాట ఏ మాత్రం చెల్లుబాటు కావడం లేదు. చివరకు వైవీ సుబ్బారెడ్డి తన మునుపటి ప్రభావం కోసం విజయమ్మతో జగన్ దగ్గర లాబీయింగ్ స్టార్ట్ చేశారట. మరి ఇది ఎంత వరకు ఫలిస్తుందో ? చూడాలి.