వైవీపై మాగుంట ఇలా…?
ఒంగోలు రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ప్రకాశం జిల్లాలో మూడు తప్ప మిగిలిన అన్ని అసెంబ్లీ స్థానా ల్లోనూ వైసీపీ విజయం సాధించింది. ఇక, ఒంగోలు ఎంపీ సీటు [more]
ఒంగోలు రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ప్రకాశం జిల్లాలో మూడు తప్ప మిగిలిన అన్ని అసెంబ్లీ స్థానా ల్లోనూ వైసీపీ విజయం సాధించింది. ఇక, ఒంగోలు ఎంపీ సీటు [more]
ఒంగోలు రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ప్రకాశం జిల్లాలో మూడు తప్ప మిగిలిన అన్ని అసెంబ్లీ స్థానా ల్లోనూ వైసీపీ విజయం సాధించింది. ఇక, ఒంగోలు ఎంపీ సీటు కూడా వైసీపీ బుట్టలోనే వేసుకుంది. అయితే, ఇప్పుడు ఇక్కడ రాజకీయంగా వైసీపీ నేతల మధ్య విభేదాలు కనిపిస్తున్నాయి. గతం నుంచే ప్రస్తుత మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డికి ప్రస్తుత టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డికి పొసగదు. ఇక ఇప్పుడుఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, టీటీడీ చైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డిల మధ్య తీవ్రమైన విభేదాలు నడుస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. అయితే, ఇవి తెరచాటుగానే ఉన్నాయని, బహిరంగంగా మాత్రం బాగానే ఉన్నారని చెబుతున్నారు. విషయంలోకి వెళ్తే.. 2014 ఎన్నికలకు ముందు నుంచి చెప్పుకొవాలి.
చిరకాల ప్రత్యర్థులవ్వడంతో….
ఆ ఎన్నికలకు ముందు వైసీపీలోకి వచ్చేందుకు ప్రయత్నించిన మాగుంట శ్రీనివాసులరెడ్డి అనూహ్యంగా టీడీపీ కండువా కప్పుకొని.. ఆ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి వైసీపీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డిపై ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత మాగుంట టీడీపీ ఎమ్మెల్సీ అయ్యారు. అప్పటి నుంచి వైవీ వర్సెస్ మాగుంట రాజకీయాలు నడిచాయి. తర్వాత ఈ ఏడాది ఎన్నిక లకు ముందు వైవీని పక్కకు పెట్టిన జగన్ మాగుంటను తన పార్టీలో చేర్చుకున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు ఒంగోలు ఎంపీ టికెట్ ఇచ్చారు. అయితే, 2014లో తనకు ప్రత్యర్థి అయిన మాగుంట ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఏకంగా తన సీటుకే ఎసరు తేవడంతో వైవికి నచ్చలేదు.
ఎంపీగా గెలవడంతో….
ఈ క్రమంలోనే ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు తనకు ఇక్కడ పట్టున్న కొండపి, ఒంగోలు నియోజకవర్గాల్లో తన అనుచరులకు వైవీ ఓ పిలుపు ఇచ్చినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. ఎలాగైనా మాగుంటను ఓడించాలి.. ఆయనకు వేసే ఓట్లు టీడీపీ తరఫున పోటీ చేస్తున్న సిద్ధారాఘవరావుకు వేయా లని వైవీ తన అనుచరులకు గీతోపదేశం చేసినట్టు తెలిసింది. అయితే పార్టీ గాలిలో ఎవ్వరి మాటలు ఓటర్లు పట్టించుకోలేదు. మాగుంట ఘనవిజయం సాధించారు. దీంతో ఈ వ్యవహారంపై మాగుంట సీరియ స్‌గా ఉన్నాడు. ఎలాగైనా వైవీకి తనదైన స్టైల్ రివేంజ్ షాక్ ఇవ్వాలని కాచుకుని కూర్చొని ఉన్నారట.
నామినేటెడ్ పదవుల కోసం….
ఇక ఎంపీ సీటు వదులుకున్న వైవి ఇప్పుడు టీటీడీ చైర్మన్‌గా ఉన్నారు. ఇక, ఇప్పుడు ఒంగోలు నియోజ కవర్గంలో వైవీ సుబ్బారెడ్డి తన అనుచరులకు పదవులు ఇప్పించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ క్రమంలో.. ఒంగోలు నుంచి ఇప్పటికే మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ మాగుంట ఉన్నారు. వీరు కూడా తమ తమ అనుచరులకు నామినేటెడ్ పదవులు ఇప్పించుకోవాల్సి ఉంటుంది. సో.. ఇక్కడ వైవీ ఆశలు నెరవేరే పరిస్థితి లేకుండా ఎంపీ మాగుంట అడ్డుపుల్ల వేసే చాన్స్ ఉందని తెలుస్తోంది.
కామన్ శత్రువు కావడంతో….
త్వరలో జరిగే ఒంగోలు కార్పొరేషన్ ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా వైవీ వర్సెస్ మాగుంట వార్ జోరుగా సాగే అవకాశం కనిపిస్తోంది. ఒంగోలులో వైవి వర్గానికి పదవులు లేకుండా తన వర్గం లేదా మంత్రి బాలినేని వర్గంతోనే పదవులు ఫిలప్ చేయ్యాలన్న కసితో మాగుంట ఉన్నట్టు టాక్. సహజంగానే అటు బాలినేనికి వైవికి కూడా పడదు… ఇప్పుడు వైవికి కామన్ శత్రువులుగా ఉన్న వీరిద్దరు ఏకమైతే పెద్ద ఆశ్చర్య పడాల్సిన పనిలేదు.