వాయిస్ కు ఇక నో ఛాయిస్?

టీడీపీ హార్డ్ కోర్ నాయ‌కుడు, కృష్ణాజిల్లా పెన‌మ‌లూరు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన నేత‌, ప్రస్తుతం శాస‌న మండ‌లి స‌భ్యుడు వైవీబీ రాజేంద్రప్రసాద్. టీడీపీ త‌ర‌పున బ‌ల‌మైన గ‌ళం వినిపించే [more]

Update: 2020-02-06 13:30 GMT

టీడీపీ హార్డ్ కోర్ నాయ‌కుడు, కృష్ణాజిల్లా పెన‌మ‌లూరు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన నేత‌, ప్రస్తుతం శాస‌న మండ‌లి స‌భ్యుడు వైవీబీ రాజేంద్రప్రసాద్. టీడీపీ త‌ర‌పున బ‌ల‌మైన గ‌ళం వినిపించే నాయ‌కుల్లో ఈయ‌న కూడా ఒక‌రు. పెన‌మ‌లూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి అసెంబ్లీలో విజ‌యం సాధించాల‌ని ఉవ్విళ్లూరిన‌ప్ప టికీ పార్టీ అధినేత చంద్రబాబు ఆయ‌న‌కు ఛాన్స్ ఇవ్వలేదు. రెండు సార్లు కూడా రాజేంద్రప్రసాద్ ఆశ‌లు నెర‌వేర‌లేదు. ఓ సారి దివంగ‌త నేత చ‌ల‌సాని పండు ఆ ఛాన్స్ త‌న్నుకుపోతే, 2014లో రాజేంద్రప్రసాద్ కి ఇవ్వాల్సిన టికెట్‌ను బోడే ప్రసాద్‌కు ఇచ్చారు. అదే స‌మ‌యంలో వైవీబీ సీనియార్టీని గుర్తించి ఆయ‌న‌కు శాస‌న మండ‌లిలో ఛాన్స్ ఇచ్చారు.

వంశీ విషయంలోనూ….

పార్టీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిన వ‌ల్లభ‌నేని వంశీ లాంటి వాళ్ల చేత రాజేంద్రప్రసాద్ పార్టీ కోసం నానా మాట‌లు ప‌డ్డారు. గ‌తంలో రోజా సైతం మీడియా చ‌ర్చల్లోనే వైవీబీనీ తీవ్ర ప‌ద‌జాలంతో దూషించిన సంగ‌తి తెలిసిందే. రాజ‌కీయంగా పార్టీ కోసం మీడియా చ‌ర్చల్లో దూకుడు ప్రద‌ర్శిస్తున్న రాజేంద్రప్రసాద్ కి ఇప్పుడు మండ‌లి ర‌ద్దు అంశం సంక‌టంగా మారింది. ఏపీ ప్రభుత్వం తాజాగా శాస‌న మండ‌లిపై క‌త్తి క‌ట్టింది.

మండలి రద్దు ప్రతిపాదనతో….

అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుల‌పై ప్రజా బ‌లం ఉన్న అసెంబ్లీ తీర్మానం చేసిన త‌ర్వాత శాస‌న మండ‌లి ర‌గ‌డ చేయ‌డం, సెల‌క్ట్ క‌మిటీకి పంప‌డం వంటి విష‌యాల‌పై సీరియ‌స్ అయిన వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ అసలు రాష్ట్రానికి శాసన మండ‌లి అవ‌స‌ర‌మా ? అనే చ‌ర్చను తెర‌మీదికి తెచ్చారు. అంతేకాదు, అనుకున్నదే త‌డువుగా మూడు రోజుల్లోనే అసెంబ్లీలో ర‌ద్దు తీర్మానం ఆమోదించారు. రాష్ట్ర అసెంబ్లీ పాస్ చేసిన ఈ తీర్మానం ప్రస్తుతం కేంద్రం వ‌ద్దకు వెళ్లింది. దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

బలమైన వాయిస్ తో…..

పార్లమెంటులో పెట్టి ఏపీ అసెంబ్లీ చేసిన తీర్మానానికి ప‌చ్చ జెండా ఊపుతుందా ? ఏళ్ల త‌ర‌బ‌డి కాల‌యాపన చేస్తుందా ? అనేది ఆస‌క్తిగా మారింది. ఒక వేళ శాసనమండలి ర‌ద్దయితే.. టీడీపీలోని చాలా మంది నాయ‌కులు న‌ష్టపోయే అవ‌కాశం ఉంది. వీరిలో కృష్ణాజిల్లా నుంచి బుద్దా వెంక‌న్న, వైవీబీ రాజేంద్రప్రసాద్ వంటివారు కీల‌కంగా క‌నిపిస్తున్నారు. ఈ ఇద్దరూ కూడా పెద్దగా ప్రజాబ‌లం ఉన్న నాయ‌కులు కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. అయితే, పార్టీకి గ‌ట్టి వాయిస్ వినిపిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో మండ‌లి ర‌ద్దయితే వీరికి బాబు ఎలాంటి ప‌ద‌వులు ఇస్తారు? వీరికి ఉన్న ఛాన్స్ ఏంటి? అనేది చూడాలి.

Tags:    

Similar News