టార్గెట్ చైనా… ఇండియా లాభపడేనా?

కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా భయోత్పాతాన్ని సృష్టిస్తుంది. లక్షల సంఖ్యలో కరోనా వైరస్ బారిన పడుతున్నారు. అదే సంఖ్యలో మరణిస్తున్నారు. ఇక అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థ [more]

Update: 2020-04-26 17:30 GMT

కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా భయోత్పాతాన్ని సృష్టిస్తుంది. లక్షల సంఖ్యలో కరోనా వైరస్ బారిన పడుతున్నారు. అదే సంఖ్యలో మరణిస్తున్నారు. ఇక అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతినింది. కరోనా దెబ్బకు అన్ని దేశాలు లాక్ డౌన్ చేయడంతో అమెరికా లాంటి దేశమే ఆర్థికంగా విలవిలలాడుతుంది. అమెరికాలోనూ ఆకలి కేకలు విన్పిస్తున్నాయి. దీనికంతటికీ కారణం చైనా అని ప్రపంచ దేశాలన్నీ గట్టిగా నమ్ముతున్నాయి. చైనాను కంట్రోల్ చేయకుంటే భవిష్యత్తులో కష్టమేనని భావించి ఆంక్షల దిశగా ఆ దేశాలు వెళుతున్నాయి.

ప్రపంచ దేశాలన్నీ…..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే రోజు మార్చి రోజు చైనా పై విరుచుకుపడుతున్నారు. చైనా వల్లనే ఇంతటి విధ్వంసం జరిగిందని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ముందే గుర్తించినా చైనా వైరస్ ను దాచిపెట్టిందన్నది ట్రంప్ ఆరోపణ. ఇది ఒక్క ట్రంప్ మాత్రమే కాదు జపాన్ వంటి దేశాలు సయితం వేలును చైనా వైపే చూపిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం వైరస్ చైనా ల్యాబ్ నుంచి బయటకు రాలేదని, జంతువుల ద్వారానే ఈ వైరస్ వ్యాపించిందని చెబుతోంది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థను కూడా ట్రంప్ తప్పుపట్టారు. చైనాను వెనుకేసుకురావడమేంటని ప్రశ్నించారు.

కంపెనీలను తరలించేందుకు……

ఇదిలా ఉండగా చైనా ఎగుమతులపై ఆంక్షలను పెట్టేందుకు అనేక దేశాలు యోచిస్తున్నాయి. జర్మనీ అయితే ఏకంగా నష్టపరిహారాన్ని కోరుతూ చైనాకు వార్నింగ్ ఇచ్చింది. నోటీసులు జారీ చేసింది. చైనా నుంచి తమ పరిశ్రమలను తరలించేందుకు కూడా కొన్ని దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. దక్షిణ కొరియా, అమెరికా, జపాన్ వంటి దేశాలు తమ పరిశ్రమలను చైనా నుంచి ఇతర ప్రాంతాలకు తీసుకు వెళ్లేందుకు సిద్ధమయినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

భారత్ వైపే చూపు…..

ఈ నేపథ్యంలో అన్ని దేశాలూ భారత్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. చైనా నుంచి భారత్ కు తమ పరిశ్రమలను తరలించే యోచనలో ఉన్నాయి. ఈ మేరకు భారత్ తో చర్చలు కూడా ఆ యా దేశాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా దక్షిణ కొరియా, చైనా నుంచి కంపెనీలు భారత్ కు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. భారత్ ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే ఆర్థికంగా లాభపడుతుందంటున్నారు ఆర్థిక నిపుణులు. కరోనా వైరస్ కంట్రలో అయ్యాక భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు అనేక దేశాలు చూస్తుండటం శుభపరిణామం.

Tags:    

Similar News