ఫ్యాక్ట్ చెక్ - విద్యార్ధులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీ అంటూ షేర్ అవుతున్న లింకు బూటకపుది

వివిధ రాష్ట్రాలు ఉచిత ల్యాప్‌టాప్ యోజన 2024ని తమ తమ సామర్థ్యాన్ని బట్టి ప్రారంభించాయి. రాష్ట్రంలోని విద్యార్థులు ఈ పథకాల ద్వారా లబ్ధి పొందవచ్చు. ఈ ఉచిత ల్యాప్‌టాప్‌లను సాధారణంగా రాష్ట్రాలు

Update: 2024-09-14 08:18 GMT

Laptop

వివిధ రాష్ట్రాలు ఉచిత ల్యాప్‌టాప్ యోజన 2024ని తమ తమ సామర్థ్యాన్ని బట్టి ప్రారంభించాయి. రాష్ట్రంలోని విద్యార్థులు ఈ పథకాల ద్వారా లబ్ధి పొందవచ్చు. ఈ ఉచిత ల్యాప్‌టాప్‌లను సాధారణంగా రాష్ట్రాలు అర్హులైన ప్రతిభావంతులైన విద్యార్థులకు అందజేస్తాయి. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ మొదలైన రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలు చేస్తున్నయి, ప్రతి సంవత్సరం విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లను అందిస్తాయి. అయితే ప్రామాణికమైన పథకాలు విద్యార్థులకు చేరకపోగా, సోషల్ మీడియాలో ఉచిత ల్యాప్‌టాప్‌లు ఇస్తున్నాం అంటూ తప్పుడు సందేశాలు ఎక్కువయ్యాయి. వెబ్‌సైట్ లింక్‌ ను షేర్ చేస్తున్న వాట్సాప్‌ సందేశం ఒకటి వైరల్‌గా షేర్ అవుతోంది.

విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు ఇస్తున్నామని, ఆ సందేశంలో ఉన్న లింక్‌ను ఉపయోగించి విద్యార్థులు నమోదు చేసుకుంటే అందజేస్తామంటూ వాట్సాప్‌లో "విద్యార్థుల కోసం ఉచిత ల్యాప్‌టాప్‌లు 2024 ఎడిషన్ - ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి" అనే క్యాప్షన్ తో షేర్ అవుతోంది.


 

అదే వాదన ను షేర్ చేస్తున్న వెబ్‌సైట్‌ కూడా లభించింది.

నిజ నిర్ధారణ:

సందేశం ఒక బూటకం. ఇది వినియోగదారుల నుండి డేటాను సేకరించే క్లిక్‌బైట్ వెబ్‌సైట్ కి దారి తీస్తుంది.
సందేశంలో అందించిన లింక్‌పై క్లిక్ చేసినప్పుడు, దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాకపోయినా, ఎటువంటి అవసరమైన వివరాలను నమోదు చేయకపోయినా, దరఖాస్తు స్వీకరించినట్లు వెబ్‌సైట్ పేర్కొంది.

 తరువాత, వెబ్‌సైట్లో అర్హతను తనిఖీ చేసుకోమని అడుగుతుంది, 'చెక్' బటన్‌పై క్లిక్ చేసినప్పుడు, డ్రాప్ డౌన్ మెను లో ల్యాప్‌టాప్ కోసం నమోదు చేసుకొనే పేరు, ఇంకా ఉద్దేశ్యాన్ని నమోదు చేయమని వినియోగదారుడిని ప్రాంప్ట్ కనబడుతుంది - ఇక్కడ ఎంపికలు 'విద్యాపరమైన ప్రయోజనాలు, వ్యాపార ప్రయోజనాలు, ఇతరాలు ప్రయోజనాలూ.

ఒక ప్రయోజనాన్ని ఎంచుకుని, అభ్యర్థనను క్లిక్ చేసిన తర్వాత, అభినందన సందేశం కనిపిస్తుంది, “అభినందనలు, మీ అప్లికేషన్‌లను తనిఖీ చేసిన తర్వాత, విద్యార్థుల మద్దతు ల్యాప్‌టాప్‌ను స్వీకరించడానికి ఆమోదించబడింది. ఎలా కొనసాగాలి:

మీరు దిగువ సూచనలను పాటిస్తే మీ స్టూడెంట్స్ సపోర్ట్ ల్యాప్‌టాప్ వెంటనే అందుబాటులో ఉంటుంది. వాట్సాప్‌లోని 15 మంది స్నేహితులు లేదా 5 గ్రూపులతో ఈ సమాచారాన్ని షేర్ చేయడానికి "Share" బటన్‌ను క్లిక్ చేయండి, తద్వారా వారు కూడా ప్రోగ్రామ్ గురించి తెలుసుకోవచ్చు! " గ్రీన్ వెరిఫికేషన్ బార్ నిండిన తర్వాత "Validate" క్లిక్ చేయండి. మీరు 15 నిమిషాల్లో నిర్ధారణ సంస్ని అందుకుంటారు." అనేది దీని సారాంశం.

వెబ్‌సైట్ ప్రామాణికతను ధృవీకరించడానికి వైరస్ టోటల్ అనే వెబ్‌సైట్‌ను వాడగా, ఈ వెబ్‌సైట్ ఒక ఫిషింగ్ స్కామ్‌ వెబ్ సైట్ గా ఫ్లాగ్ చేయబడిందని తెలుస్తోంది.
ఉచిత ల్యాప్‌టాప్‌లను అంటూ షేర్ అవుతున్న సందేశం స్కామ్ అని పేర్కొంటూ ఫీభ్ ప్రచురించిన ఫ్యాక్ట్ చెక్ కూడా లభించింది. ఉచిత ల్యాప్‌టాప్‌లను అందించే బోగస్ వెబ్‌సైట్‌ల పట్ల జాగ్రత్త వహించాలని, అటువంటి అనుమానాస్పద లింక్‌లపై ఎప్పుడూ క్లిక్ చేయవద్దని, వ్యక్తిగత సమాచారాన్ని పంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఇది వినియోగదారులను హెచ్చరిస్తుంది.
కనుక, ఉచిత ల్యాప్‌టాప్‌లను అందిస్తున్న వైరల్ సందేశం ఒక బూటకం. దయచేసి అటువంటి ఆఫర్‌లను విశ్వశించకండి, వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయకండి, ఇవి డేటాను సేకరించే ఉద్దేశ్యంతో ప్రచారమయ్యే క్లిక్‌బైట్ వెబ్‌సైట్‌లు, మీ పరికరాలలో అనుమానాస్పద యాప్‌లను కూడా డౌన్లోడ్ చేయవచ్చు. వాదన అబద్దం.
Claim :  2024లో విద్యార్థుల కోసం ఉచిత ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేయబోతున్నారు, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు
Claimed By :  Whatsapp Users
Fact Check :  False
Tags:    

Similar News