ఫ్యాక్ట్ చెక్: వైరల్ అవుతున్న పత్రికా ప్రకటన అదానీ గ్రూప్ విడుదల చేయలేదు
కెన్యా భారతదేశానికి చెందిన అదానీ గ్రూప్, ఆఫ్రికన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ సమ్యుక్తంగా పవర్ ట్రాన్స్‌మిషన్ లైన్‌లను నిర్మించడానికి
కెన్యా భారతదేశానికి చెందిన అదానీ గ్రూప్, ఆఫ్రికన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ సమ్యుక్తంగా పవర్ ట్రాన్స్‌మిషన్ లైన్‌లను నిర్మించడానికి 1.3 బిలియన్ డాలర్ల పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య రాయితీని మంజూరు చేసింది. జోమో కెన్యాట్టా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 1.85 బిలియన్ డాలర్ల తో అభివృద్ధి చేస్తున్నందుకు బదులుగా అదానీ గ్రూప్‌కు 30 సంవత్సరాల పాటు ఏయిర్ పోర్ట్ ను లీజుకు ఇవ్వాలని కెన్యా ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే, కెన్యా హైకోర్టు ఈ ప్రతిపాదిత ఒప్పందాన్ని సస్పెండ్ చేసింది.
ప్రస్తుతం, అదానీ భారతదేశంలోని 7 విమానాశ్రయాలను నిర్వహిస్తోంది, వీతిని చేజిక్కించుకోవడానికి ప్రభుత్వ అధికారులకు అదాని గ్రూప్ లంచం ఇచ్చిదని భారత ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. విమానాశ్రయాన్ని అదాని గ్రూప్ స్వాధీనం చేసుకుంటున్నారనే వార్త కెన్యాలో దుమారం రేపింది. కెన్యా విమానాశ్రయంలోని విమానయాన కార్మికులు ప్రభుత్వంతో అత్యవసర చర్చలకు పిలుపునిచ్చారు. అదానీ గ్రూపుతో ఎయిర్‌పోర్టు లీజు ఒప్పందానికి సంబంధించిన వివరాలను ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు.
ఇంతలో, సెప్టెంబర్ 10, 2024 నాటి ‘అదానీ ఎనర్జీ సొల్యూషన్స్’ లెటర్ హెడ్‌పై “అదానీ గ్రూప్ నిరాధార ఆరోపణలు, బెదిరింపులను ఖండిస్తోంది” అనే శీర్షికతో ఒక పత్రికా ప్రకటన విడుదల అయ్యింది. కెన్యాలో కొనసాగుతున్న మా ప్రాజెక్టులను లక్ష్యంగా చేసుకుని ఇటీవలి ప్రదర్శనలు, బెదిరింపుల వల్ల అదానీ గ్రూప్ తీవ్రంగా కలత చెందిందని ఇందులోని వాదన. ప్రదర్శనలలో పాల్గొనడానికి ప్లాన్ చేస్తున్న ప్రజలు చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని కూడా ఈ పత్రికా ప్రకటన హెచ్చరించింది. బెదిరింపులు కొనసాగితే, ప్రాజెక్టుల ద్వారా లబ్ది పొందిన ప్రభుత్వ వాటాదారుల పేర్లతో పాటు కంపెనీ నుండి గణనీయమైన లంచాలు పొందిన వ్యక్తుల పేర్లను బహిర్గతం చేస్తామనేది ఈ ప్రకటన సారాంశం.
అయితే, కొంతమంది వినియోగదారులు ఈ పత్రికా ప్రకటన నిజమా కాదా అనే ఊహాగానాలతో పంచుకున్నారు.
ప్రాజెక్ట్‌లను దక్కించుకునేందుకు కెన్యా అధికారులకు లంచాలు ఇచ్చినట్లు అదానీ గ్రూప్ అంగీకరించింది అనే క్యాప్షన్‌తో కొందరు వినియోగదారులు దాన్ని షేర్ చేశారు.
ఫ్యాక్ట్ చెక్:
వాదన అబద్దం. సర్క్యులేషన్‌లో ఉన్న పత్రికా ప్రకటన నకిలీది.
మేము అదానీ గ్రూప్ వెబ్‌సైట్‌ను శోధించినప్పుడు, వారి వెబ్‌సైట్ లేదా సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో అటువంటి పత్రికా ప్రకటన ప్రచురించబడలేదు. వారి వెబ్‌సైట్‌లో, వారు విడుదల చేసిన మీడియా ప్రకటనను మాకు లభించింది. కెన్యాలో మా ఉనికికి సంబంధించి “అదానీ గ్రూప్ నిరాధార ఆరోపణలు మరియు బెదిరింపులను ఖండించింది” అనే శీర్షికన విడుదల అయిన ప్రకటన తో పాటు అనేక మోసపూరితమైన పత్రికా ప్రకటనలను హానికరమైన ఉద్దేశంతో కొందరు స్వార్ధపరులు ప్రసారం చేస్తున్నారని పేర్కొంది. అదానీ గ్రూప్, దాని అనుబంధ సంస్థలు కెన్యాకు సంబంధించిన ఎలాంటి ప్రెస్ రిలీజ్‌లను జారీ చేయలేదని స్పష్టం చేసింది.
"మేము ఈ మోసపూరిత చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాము, ఈ నకిలీ విడుదలలను పూర్తిగా విస్మరించమని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాము. తప్పుడు కథనాలను ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. మా అధికారిక పత్రికా ప్రకటనలు మా వెబ్‌సైట్లలో అందుబాటులో ఉన్నాయి. అదానీ గ్రూప్‌లో ఏవైనా కథనాలు లేదా వార్తలను ప్రచురించే లేదా ప్రసారం చేసే ముందు వాస్తవాలు, మూలాలను ధృవీకరించమని మేము మీడియా, ఇంకా ఇంఫ్లుయెంజర్లను ప్రోత్సహిస్తున్నాము." అనేది ఈ ప్రకటన సారాశం.
ఇండిపెండెంట్ న్యూస్ ఏజెన్సీ ఐఏఎనెస్ కూడా అదానీ గ్రూప్ చేసిన ప్రకటనను విడుదల చేసింది.
Business standard.com ప్రకారం, అదానీ కంపెనీ ఈ తప్పుడు, నిరాధారమైన ఆరోపణలను వ్యాప్తి చేయడానికి హానికరమైన ఉద్దేశ్యంతో స్వార్థ ప్రయోజనాలను నిందించింది. లా సొసైటీ ఆఫ్ కెన్యా, కెన్యా హ్యూమన్ రైట్స్ కమీషన్ దరఖాస్తు చేసుకున్న తరువాత కెన్యా న్యాయస్థానం ప్రతిపాదిత ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు కథనం పేర్కొంది, ఈ ఒప్పందం ప్రాంతీయూలకు నష్టం కలిగిస్తుందని వాదించింది.
కాబట్టి, చెలామణిలో ఉన్న పత్రం అదానీ గ్రూప్ విడుదల చేయని నకిలీది. వాదన అబద్దం