ఫ్యాక్ట్ చెక్: హైదరాబాద్ కు చెందిన కాంగ్రెస్ నేత తన సొంత కూతురినే పెళ్లి చేసుకున్నాడా..?

తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేత సొంత కుమార్తెను పెళ్లి చేసుకున్నాడంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి.

Update: 2022-06-11 14:59 GMT

క్లెయిమ్: హైదరాబాద్ కు చెందిన కాంగ్రెస్ నేత తన సొంత కూతురినే పెళ్లి చేసుకున్నాడా

ఫ్యాక్ట్ : వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు

తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేత సొంత కుమార్తెను పెళ్లి చేసుకున్నాడంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి.

కాంగ్రెస్ పార్టీ సభ్యుడైన ఆ వ్యక్తికి సంబంధించిన షాకింగ్ ఫేస్‌బుక్ పోస్ట్ హల్ చల్ చేస్తోంది. పోస్ట్‌లోని టెక్స్ట్‌లో హైదరాబాద్‌కు చెందిన అయూబ్ ఖాన్ తన కుమార్తె తర్నుమ్ ఖాన్‌ను వివాహం చేసుకున్నట్లు ఉంచారు. అందులో ఒక వార్తాపత్రిక నివేదిక యొక్క ఫోటో కూడా ఉంది. "ముస్లిం వ్యక్తి తన స్వంత కుమార్తెను వివాహం చేసుకున్నాడు, ఆమెను గర్భవతి చేశాడు."( "Muslim man married own daughter, impregnates her.") అని అందులో ఉంది.

ఫ్యాక్ట్ చెకింగ్:

మా బృందం ఈ పోస్టును ప్రజలను తప్పుదోవ పట్టించే వార్తగా కొట్టి పడేసింది.

పోస్ట్‌ను పరిశోధించి, అది తప్పుదారి పట్టించేదిగా గుర్తించింది మా బృందం. వార్తాపత్రిక క్లిప్పింగ్ పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పైగురిలో 2017లో జరిగిన సంఘటన గురించి అయితే, అయూబ్ ఖాన్ తన కుమార్తెను వివాహం చేసుకున్నాడని చెబుతున్న వాదన అంతా బూటకమే..!

అయూబ్ ఖాన్ తన కూతురిని పెళ్లి చేసుకున్నాడనే వైరల్ పోస్టు రెండేళ్లుగా ఇంటర్నెట్‌లో ఉందని మేము కనుగొన్నాము. 2020లోనే ఇండిపెండెంట్ ఫ్యాక్ట్ చెకర్స్ ఇదొక బూటకపు వార్త అని తెలిపారు.

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన తర్నుమ్ ఖాన్‌ గతంలో ఇలాంటి పోస్టు ఒకటి చేసింది. తన ఫేస్‌బుక్ ఖాతాలో పెళ్లి బట్టలలో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ఫోటోల క్యాప్షన్ లో "మా నాన్న అయూబ్ ఖాన్‌తో వివాహం. భయంగా వుంది నాకు. నాకు పెళ్లి అనుభవం లేదు."("Got Married with my Dad Ayub Khan. I'm nervous. I don't have marriage experience.") అని ఉంది.

వాస్తవానికి, ఆమె ఫోటో క్యాప్షన్ ను చాలాసార్లు మార్చింది, చివరకు "వైట్ అటెయిర్" అని ఉంచింది. ఆమె తన
పోస్ట్‌కు అయూబ్ ఖాన్‌ను ట్యాగ్ చేసింది
. అయితే ఆ తర్వాత అతని ఫేస్ బుక్ ప్రొఫైల్ డిలీట్ అయింది.



ఆమె సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించగా.. అనేక వీడియోలను కనుగొన్నాము. ఆమె పలువురు ప్రముఖులతో తనకు రిలేషన్ షిప్ ఉందని ప్రస్తావించింది. అలాంటి ఒక వీడియోలో.. ఆమె తనను తాను క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్యగా పేర్కొంది.
Full View

Full View
అయూబ్ పహెల్వాన్ అని కూడా పిలువబడే అయూబ్ ఖాన్ హైదరాబాద్‌కు చెందిన వాంటెడ్ క్రిమినల్, గ్యాంగ్‌స్టర్. నవంబర్ 2020లో అయూబ్ ఖాన్ కుమారుడు తన తండ్రికి ఐదుగురు కుమారులు ఉన్నారని, కుమార్తెలు లేరని చెప్పాడు. అతను తన కుమార్తెను పెళ్లి చేసుకున్నాడన్న వాదనలకు తెరపడింది. 2019 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్‌పై బహదూర్‌పురా నుంచి పోటీ చేస్తున్నట్లు ఖాన్ ప్రకటించిన 2018 నాటి వీడియోను మేము గుర్తించాం. 2018 ఆగస్టులో, హైదరాబాద్‌లోని స్థానిక కోర్టు నకిలీ పాస్‌పోర్ట్ కేసులో గ్యాంగ్‌స్టర్‌తో పాటు అతని భార్యకు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తెలంగాణ హైకోర్టు ఆయనకు 15 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 2019లో బహదూర్‌పురాలో షేక్ మొహమ్మద్ కళెంముద్దీన్ కాంగ్రెస్ అభ్యర్థిగా నిలిచాడు.

వైరల్ పోస్ట్‌లోని వార్తాపత్రిక నివేదిక ప్రకారం. అఫాజుద్దీన్ అనే ముస్లిం వ్యక్తి తన కుమార్తెను వివాహం చేసుకున్నాడు. అయితే ఈ వార్తా నివేదిక 2017 నాటిది. అదే నివేదికను నవంబర్ 2017లో టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించింది.

కాబట్టి, అయూబ్ ఖాన్ తన కుమార్తెను వివాహం చేసుకోలేదని నిర్ధారించాం.


క్లెయిమ్: అయూబ్ ఖాన్ తన కుమార్తెను వివాహం చేసుకున్నాడా..?
క్లెయిమ్ చేసింది ఎవరు: సోషల్ మీడియా యూజర్లు
ఫ్యాక్ట్: వైరల్ పోస్టుల ద్వారా చెబుతున్నది అబద్ధం
Claim :  Congress leader from Hyderabad marry his daughter
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News