నిజ నిర్ధారణ: వీడియో ఫీఫా వరల్డ్ కప్ 2022 ప్రారంభోత్సవ సమారోహం తరువాత డాక్టర్ జాకీర్ నాయక్ ప్రసంగాన్ని చూపడంలేదు; ఈ వీడియో 2016 నాటిది
భారతదేశంలో మనీలాండరింగ్, ద్వేషపూరిత ప్రసంగాల ఆరోపణలను ఎదుర్కొంటున్న ఇస్లామిక్ బోధకుడు డాక్టర్ జాకీర్ నాయక్ ఫీఫా ప్రపంచ కప్ 2022 ప్రారంభ వేడుకకు హాజరయ్యారు. ప్రపంచకప్ సమారోహంలో ఆయన ఉండడం కతార్ ప్రభుత్వాన్ని అందరూ విమర్శించేలా చేసింది.
భారతదేశంలో మనీలాండరింగ్, ద్వేషపూరిత ప్రసంగాల ఆరోపణలను ఎదుర్కొంటున్న ఇస్లామిక్ బోధకుడు డాక్టర్ జాకీర్ నాయక్ ఫీఫా ప్రపంచ కప్ 2022 ప్రారంభ వేడుకకు హాజరయ్యారు. ప్రపంచకప్ సమారోహంలో ఆయన ఉండడం కతార్ ప్రభుత్వాన్ని అందరూ విమర్శించేలా చేసింది.
ఫీఫా ప్రారంభోత్సవం రోజున కతార్‌లో డాక్టర్ నాయక్ కనిపించిన తర్వాత, ఆయన కతార్ లో ప్రసంగం చేస్తున్న వీడియో, ఇటీవల జరిగిందనీ, ఫీఫా వరల్డ్ కప్ 2022 సందర్భంగా వెళ్లినప్పుడు ఇస్లామిస్ట్ ప్రసంగాన్ని అందించినట్లు ప్రచారంలో ఉంది.
వీడియోలో, అతను యేసు, బైబిల్ గురించి ప్రేక్షకులలో ఒక మహిళతో చర్చిస్తున్నట్లు చూడవచ్చు.
నిజ నిర్ధారణ:
వీడియో ఇటీవలిది అనే క్లెయిం అబద్దం. వీడియో 2016 నాటిది.
వీడియో నుండి సంగ్రహించిన కీలక ఫ్రేమ్‌లను గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయడానికి ఉపయోగించినప్పుడు, ఆ వీడియో నిజంగా కతార్‌కు చెందినదే కానీ 2016లో చిత్రీకరించబడిందని తెలుస్తోంది.
వైరల్ వీడియో 'క్రిక్ ఫాస్ట్' అనే యూట్యూబ్ ఛానెల్‌లో జూన్ 4, 2016న కతార్‌లో డాక్టర్ జాకీర్ నాయక్ అనే టైటిల్‌తో పోస్ట్ చేసారు.
'కతార్‌లో జకీర్ నాయక్' అనే కీవర్డ్‌లతో సెర్చ్ చేసినప్పుడు, 'దేవుడు (సృష్టికర్త) ఉన్నాడా? - ఖతార్‌లో డాక్టర్ జాకీర్ నాయక్' అనే టైటిల్ ఉన్న వీడియో లభించింది.
మే 26, 2016న పోస్ట్ చేసిన కతార్ పర్యటన గురించి జాకీర్ నాయక్ ఫేస్‌బుక్ సందేశాన్ని కూడా లభించింది.
కనుక, 2016లో జకీర్ నాయక్ ఖతార్ పర్యటనలో ఉన్న పాత వీడియో ఇటీవలిదిగా షేర్ అయ్యింది. క్లెయిం అబద్దం.