ఇంతలో, ఒక పరీక్షా కేంద్రంలో అభ్యర్థులు మాస్ కాపీయింగ్‌లో పాల్గొంటున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఉత్తరప్రదేశ్‌లోని IAS పరీక్షా కేంద్రంలో జరిగిన మోసం అంటూ వీడియో పోస్టుల్లో తెలిపారు. “IAS Exam centers of UP, Bihar, Jharkhand !!! The future of Indian governance. New India” అనే క్యాప్షన్ తో వీడియోను పోస్టు చేశారు.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదన తప్పుదారి పట్టిస్తూ ఉంది. వైరల్ వీడియోలోని వాయిస్ వింటే మనకు సదరు వ్యక్తి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంటూ వ్యాఖ్యానిస్తూ ఉండడం తెలుస్తుంది.
మార్చి 2024లో యూపీలోని బారాబంకిలో జరిగిన ఎల్‌ఎల్‌బి పరీక్షలో మాస్ కాపీయింగ్ జరిగినట్లు ఈ వీడియో ద్వారా తెలుస్తోంది. వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను తీసుకుని, గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇండియా టుడే, ఆజ్ తక్ మీడియా సంస్థలు ప్రచురించిన నివేదికలు మాకు కనిపించాయి.
మార్చి 1, 2024న పబ్లిష్ చేసిన
ఇండియా టుడే కథనంలో వైరల్ వీడియోకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌లను చూడొచ్చు. ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలోని ఒక కళాశాలలో ఎల్‌ఎల్‌బి పరీక్ష సమయంలో విద్యార్థులు స్పష్టంగా కాపీ చేస్తూ పట్టుబడిన షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. విద్యార్థులు కాపీ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది ఉపాధ్యాయుల సమక్షంలో జరిగింది. విద్యార్థులు ఏ మాత్రం భయపడకుండా మోసం చేస్తూ దొరికిపోయారు. వీడియోలో, విద్యార్థులు గైడ్‌లు, చిట్టీల సాయంతో సమాధానాలు రాసుకుంటున్నారు.
ఈ సంఘటనపై అధికారులు వేగంగా స్పందించారు. పరీక్ష సమయంలో మోసం చేసినందుకు మొత్తం 26 మంది విద్యార్థులను అరెస్టు చేశారు. అవధ్ లా కళాశాలలో 12 మంది విద్యార్థులు, TRCలో 25 మంది విద్యార్థులు రెండవ షిఫ్ట్ పరీక్షల సమయంలో కాపీ చేస్తూ పట్టుబడ్డారు.
ఆజ్ తక్ “Uttar Pradesh के Barabanki में LLB परीक्षा का सामूहिक नकल का Facebook वीडियो हुआ Viral | Aaj Tak” అనే టైటిల్ తో ఫిబ్రవరి 29, 2024న అదే వీడియోను షేర్ చేసింది.
జీన్యూస్ కథనం ప్రకారం, వైరల్ వీడియోలో గైడ్‌లు, నోట్స్‌తో విద్యార్థులు ఎల్‌ఎల్‌బి పరీక్ష రాస్తూ ఉండడం స్పష్టంగా కనిపిస్తుంది. వీడియోలో, సిటీ లా కాలేజీలో ఎల్‌ఎల్‌బి పరీక్ష సమయంలో మాస్ కాపీయింగ్ జరుగుతోందని ఒక యువకుడు ఆరోపించాడు. లా కాలేజీ విద్యార్థులు గైడ్‌లు, నోట్స్ సహాయంతో ఎల్‌ఎల్‌బి పరీక్ష రాస్తున్న సమయంలో ఈ వీడియోను రికార్డు చేశారు.
వైరల్ వీడియోలో ఉన్నది యూపీలో ఐఎఎస్ పరీక్ష సమయంలో జరిగిన మాస్ కాపీయింగ్ ఘటన కాదు. ఈ సామూహిక మోసం యుపిలోని బారాబంకిలో జరిగిన ఎల్ఎల్‌బి పరీక్ష సమయంలో కనిపించింది. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది.