ఫ్యాక్ట్ చెక్: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇమ్రాన్ ఖాన్ తో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనలేదు.

భారత ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్థాన్ తో భారత్ స్నేహం;

Update: 2025-03-22 03:46 GMT
ఫ్యాక్ట్ చెక్: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇమ్రాన్ ఖాన్ తో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనలేదు.
  • whatsapp icon

అమెరికన్ పాడ్‌కాస్టర్ లెక్స్ ఫ్రిడ్‌మాన్‌తో పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్థాన్ తో భారత్ స్నేహం గురించి స్పందించారు. సీమాంతర ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ ప్రోత్సహిస్తూ ఉందంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శలు చేశారు. శాంతిని పెంపొందించడానికి న్యూఢిల్లీ చేస్తున్న ప్రయత్నాలను పాకిస్థాన్ పట్టించుకోలేదని, శత్రుత్వం, ద్రోహం పాకిస్థాన్ నుండి ఎదురయ్యాయని అన్నారు. పాకిస్తాన్ భారతదేశంపై పరోక్ష యుద్ధం చేస్తోందని ప్రధాని మోదీ విమర్శించారు. సామరస్యపూర్వక సహజీవనం వైపు పాకిస్థాన్ అడుగులు వేయలేదని విమర్శించారు. పదే పదే భారతదేశంతో విభేదించాలని నిర్ణయించుకున్నారని పాకిస్తాన్‌తో దెబ్బతిన్న సంబంధాల గురించి మోదీ వ్యాఖ్యానించారు. 2014లో తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అప్పటి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను ఆహ్వానించానని, ఇరు దేశాల మధ్య నెలకొన్న గందరగోళ పరిస్థితులకు ఫుల్ స్టాప్ పెట్టాలని తాను కోరినట్లు ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు.

గత కొన్ని దశాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా ఇది దౌత్యపరమైన చర్య అని అన్నారు. విదేశాంగ విధానం పట్ల నా పద్దతులను ఒకప్పుడు ప్రశ్నించిన వ్యక్తులే, సార్క్ దేశాధినేతలందరినీ ఆహ్వానించానని తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యపోయారన్నారు. పాకిస్థాన్ ప్రజలు నిరంతర ఉగ్రవాదంతో విసిగిపోయి కనిపించారు. అమాయక పిల్లలు చనిపోయారు. లెక్కలేనన్ని జీవితాలు నాశనం అయ్యాయని ప్రధాని మోదీ అన్నారు.
ఇంతలో ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో కలిసి ఒకే టేబుల్ మీద కూర్చొని భోజనం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. మోదీ తల మీద ముస్లింలు ధరించే టోపీ కూడా ఉంది.
"आप सभी देशवासियों को चचा मोदी जी के 😂 तरफ से
पहली इफ्तार पार्टी मुबारक हो
स्थान - इस्लामाबाद पाकिस्तान" అంటూ హిందీలో పోస్టులు పెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇఫ్తార్ పార్టీ కోసం పాకిస్థాన్ లోని ఇస్లామాబాద్ కు వెళ్లారని ఆ పోస్టుల్లో ఉంది.

Full View

వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు



 

ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న ఫోటోను డిజిటల్ గా ఎడిట్ చేశారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలి కాలంలో పాకిస్థాన్ కు వెళ్ళారా అని తెలుసుకోడానికి మేము సంబంధిత వార్తా కథనాల కోసం వెతికాం. అయితే ప్రధాని మోదీ ఇటీవల పాకిస్థాన్ కు వెళ్లలేదని ధృవీకరించాం.
ఇక ప్రధాని మోదీ చివరిసారిగా 2015లో పాకిస్థాన్ లో అడుగుపెట్టారు. ఆ సమయంలో పాకిస్తాన్ ప్రధానిగా నవాజ్ షరీఫ్ ఉన్నారు. డిసెంబర్ 25, 2025న ప్రధాని నరేంద్ర మోదీ లాహోర్ కు వెళ్లారు. అప్పట్లో 10 సంవత్సరాల తర్వాత భారత ప్రధాని పాకిస్తాన్ లో చేసిన తొలి పర్యటన ఇది. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకూ పాకిస్థాన్ పర్యటనకు ప్రధాని మోదీ వెళ్ళలేదు.
అందుకు సంబంధించిన కథనాన్ని ఇక్కడ చూడొచ్చు.
ఇక పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పలు కేసుల కారణంగా జైలులో ఉన్నాడు. 2018లో ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ప్రధానమంత్రి అయ్యాడు. తరువాత ఆ దేశ సైన్యంతో విభేదాలు వచ్చాయి. వరుస ఫిరాయింపుల కారణంగా ఇమ్రాన్ ఖాన్ తన పార్లమెంటరీ మెజారిటీని కోల్పోయాడు. అవిశ్వాస తీర్మానం కారణంగా పదవీచ్యుతుడయ్యాడు. అప్పటి సైన్యాధ్యక్షుడు జనరల్ కమర్ జావేద్ బజ్వా ఇందుకు కుట్రపన్నారని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ఏప్రిల్ 2022లో ప్రధాని పదవికి దూరమైనప్పటి నుండి ఇమ్రాన్ ఖాన్ పై అనేక కేసులు నమోదయ్యాయి. 9 మే 2023న, అల్-ఖాదిర్ ట్రస్ట్‌కు సంబంధించి అవినీతి ఆరోపణలపై పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌ను ఇస్లామాబాద్‌లోని హైకోర్టు లోపల నుండి నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో అరెస్టు చేసింది. అప్పటి నుండి ఇమ్రాన్ ఖాన్ జైలులోనే ఉన్నాడు.
ఇమ్రాన్ ఖాన్ బెయిల్ మీద బయటకు వచ్చినట్లు కానీ, ప్రధాని మోదీని కలిసినట్లుగా మాకు ఎలాంటి నివేదికలు లభించలేదు. ఇమ్రాన్ ఖాన్, ప్రధాని మోదీ డిసెంబర్, 2015 లో కలిశారు. అప్పటికి ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ ప్రధాని అవ్వలేదు.
ఇక వైరల్ ఫోటోను మేము రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. 2015 నాటి అనేక సోషల్ మీడియా పోస్ట్‌లలో అసలు చిత్రం కనిపించింది. అసలు చిత్రంలో, ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహమ్ ఖాన్ ఆయన పక్కన కూర్చుని ఉన్నారు. వైరల్ చిత్రాన్ని ఎడిట్ చేశారు, రెహమ్ ఖాన్ స్థానంలో ప్రధానమంత్రి మోదీ ఫోటోను ఉంచారు.



ఇక వైరల్ ఫోటోలో ఉపయోగించిన ప్రధాని మోదీ అసలు చిత్రం గురించి తెలుసుకోడానికి ప్రయత్నించాం. గూగుల్ లెన్స్ ఉపయోగించి సెర్చ్ చేయగా, నవంబర్ 13, 2013న ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రచురించిన గ్యాలరీలో అసలు ఫోటోను కనుగొన్నాము. “గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ బుధవారం నాడు గాంధీనగర్‌లోని తన నివాసంలో జర్నలిస్టులతో జరిగిన సమావేశంలో భోజనం చేస్తున్నారు." అని ఉంది.
అందుకు సంబంధించిన లింక్ ను ఇక్కడ చూడొచ్చు.
ఈ రెండు ఫోటోలను కలిపి ఎడిట్ చేశారని మేము ధృవీకరించాం.
ఈ ఫోటో గతంలో కూడా వైరల్ అయింది. అయితే వాటిలో నిజం లేదని పలు ఫ్యాక్ట్ చెక్ సంస్థలు కథనాలను ప్రచురించాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
కాబట్టి, ప్రధాని నరేంద్ర మోదీ ఇమ్రాన్ ఖాన్ తో కలిసి ఇఫ్తార్ పార్టీలో పాల్గొన్నారంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు.


Claim :  భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News