ఫ్యాక్ట్ చెక్: అమితాబ్ బచ్చన్ ఆసుపత్రి పాలవ్వలేదు.. ఆయనకు ఎలాంటి సర్జరీ తాజాగా జరగలేదు
లెజెండరీ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఆసుపత్రిలో చేరి యాంజియోప్లాస్టీ సర్జరీ చేయించుకున్నారనే
లెజెండరీ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఆసుపత్రిలో చేరి యాంజియోప్లాస్టీ సర్జరీ చేయించుకున్నారనే వార్తలు ఇంటర్నెట్ ను కుదిపేశాయి. ఈ వార్త ట్విట్టర్ తో సహా వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో విస్తృతంగా వైరల్ అయింది. దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న అమితాబ్ బచ్చన్ కు ఏమైందా అని పలువురు ఆరా తీశారు. అభిమానులు ఆందోళన చెందారు.
ట్విట్టర్ లో ఒక వినియోగదారుడు "బాలీవుడ్ షహెన్‌షా అమితాబ్ బచ్చన్ ఆరోగ్యం క్షీణించడంతో ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరారు. యాంజియోప్లాస్టీ జరిగింది." అంటూ పోస్టు పెట్టాడు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
వైరల్ అవుతున్న వార్తల ప్రామాణికతను ధృవీకరించడానికి.. మేము Googleలో సంబంధిత కీవర్డ్స్ ను ఉపయోగించి సెర్చ్ చేసాము. బాలీవుడ్ కు సంబంధించిన పలు వార్తలను ప్రసారం చేసే యూట్యూబ్ న్యూస్ ఛానెల్ 'వైరల్ భయాని' ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఇటీవల పోస్ట్ చేసిన వీడియోను మేము కనుగొన్నాము. "ఐఎస్‌పిఎల్ ముగింపు వేడుకకు హాజరైన అమితాబ్ బచ్చన్ బాగా ఫిట్ గా కనిపించడం ఆనందంగా ఉంది" అంటూ చెప్పుకొచ్చారు. ఈ వీడియో ద్వారా అమితాబ్ బచ్చన్ ఆరోగ్యానికి సంబంధించిన తప్పుడు కథనాలను మనం తోసిపుచ్చవచ్చు.
వైరల్ పోస్టులను ఖండిస్తూ అనేక మీడియా నివేదికలను కూడా మేము కనుగొన్నాము. 'ది ఎకనామిక్ టైమ్స్' నివేదిక ప్రకారం, అమితాబ్ బచ్చన్ ఆరోగ్యం బాగా ఉంది. ఆయన యాక్టివ్ గా తన పనులు చేస్తుకుంటూ ఉన్నారు. ఇటీవల అమితాబ్ ఆసుపత్రిలో చేరిన తర్వాత యాంజియోప్లాస్టీ చేయించుకున్నట్లు వచ్చిన వార్తలను ఖండించారు. అమితాబ్ బచ్చన్ క్షేమంగా ఉన్నారని తెలియడంతో ఆయన అభిమానుల మనసు కుదుటపడింది.
అమితాబ్ మాఝీ ముంబై, టైగర్స్ ఆఫ్ కోల్‌కతా మధ్య జరిగిన ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL) మ్యాచ్‌కు హాజరై.. థానేలోని దాదోజీ కొండదేవ్ స్టేడియం నుండి బయటకు వస్తున్న వీడియో ఈ పుకార్లకు ముగింపు పలికింది.
ఏప్రిల్ 2023లో అమితాబ్ బచ్చన్ ఆసుపత్రిలో ఉన్నారని.. మరణశయ్యపై ఉన్నారంటూ వచ్చిన వదంతులను మీడియా పబ్లికేషన్‌లు ఖండించాయి. అమితాబ్ బచ్చన్ పాత ఫోటో ఇటీవలి కాలంలో ఆయన ఆరోగ్యం క్షీణించిందనే వాదనతో తప్పుడు వాదనతో షేర్ చేశారు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. అమితాబ్ బచ్చన్ ఆసుపత్రిలో చేరి యాంజియోప్లాస్టీ సర్జరీ చేయించుకున్నారనే వార్తలు అవాస్తవమని తేలింది. అమితాబ్ బచ్చన్ స్వయంగా వైరల్ వార్తలను కొట్టిపారేశారు.
Claim : Amitabh Bachchan being hospitalized and undergoing an angioplasty surgery
Claimed By : Social Media Users
Fact Check : False