ఫ్యాక్ట్ చెక్: వైరల్ అవుతున్న వీడియోలో ఉన్న వ్యక్తి హిమాలయ సంస్థ సీఈఓ కాదు
ఆ వీడియోలో ఉన్నది లాయర్ భాను ప్రతాప్ సింగ్;

భారతదేశంలోని ముస్లిం మతాధికారుల అత్యున్నత సంస్థ అయిన ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) సభ్యులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సమావేశమై వక్ఫ్ (సవరణ) బిల్లుపై మార్చి 17, 2025న నిరసన వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ముస్లింలపై "ప్రత్యక్ష దాడి" అని అభివర్ణించారు. ఈ బిల్లు వక్ఫ్ ఆస్తులను ప్రభుత్వ పరం చేయడానికి మార్గం సుగమం చేస్తుందని బోర్డు పేర్కొంది. మార్చి 13న జరగాల్సిన ఈ నిరసన కార్యక్రమాన్ని హోలీ సెలవుల కారణంగా వాయిదా వేశారు. బోర్డు ప్రతినిధి సయ్యద్ ఖాసిం రసూల్ ఇలియాస్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిరసనను ప్రకటించారు. ఈ బిల్లు ముస్లింలపై వివక్షతకు సమానమని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం, జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపిసి) సిఫార్సు చేసిన మార్పుల తర్వాత వక్ఫ్ (సవరణ) బిల్లును ఆమోదించిన తర్వాత నిరసనలు వ్యక్తమయ్యాయి.
ఇంతలో ఓ వ్యక్తి రిలయన్స్ ప్రోడక్ట్స్ ను బాయ్ కాట్ చేయాలంటూ పిలుపునిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ముఖ్యంగా వాట్సాప్ లో ఓ వీడియో వైరల్ అవుతూ ఉంది. ఆ వీడియోలో ఉన్న వ్యక్తి మొహమ్మద్ మెరాజ్ మనల్ అని, హిమాలయా కంపెనీ ఓనర్ అంటూ చెప్పారు.
"This is Mohammad Meraj Manal, the owner of *"Himalaya" company. He is a Muslim. Listen to his speech given in Shaheen Bagh against CAA. He makes ayurvedic medicines and beauty products, from liv52 syrup to himaliya neem tulsi and soap, we quickly get emotional on hearing the name Himalaya and leaving aside the companies, we trust the name of Himalaya, whereas its truth can be seen in this video. Stop buying its products, it will come on its knees on its own. There are many options in ayurvedic medicines. From today onwards, do not buy any product of #Himalaya# company. " అంటూ మెసేజీ వైరల్ అవుతూ ఉంది.
"ఇందులో ఉన్నది మొహమ్మద్ మెరాజ్ మనల్, *"హిమాలయ" కంపెనీ యజమాని. ఆయన ఒక ముస్లిం. CAA కి వ్యతిరేకంగా షాహీన్ బాగ్‌లో ఆయన చేసిన ప్రసంగాన్ని వినండి. ఆయన ఆయుర్వేద మందులు, సౌందర్య ఉత్పత్తులను తయారు చేస్తారు, liv52 సిరప్ నుండి హిమాలయ వేప తులసి, సబ్బు వరకు, హిమాలయ అనే పేరు వినగానే మనం త్వరగా భావోద్వేగానికి గురవుతాము. కంపెనీలను పక్కన పెడితే, మనం హిమాలయ పేరును నమ్ముతాము, అయితే దాని నిజం ఈ వీడియోలో చూడవచ్చు. దాని ఉత్పత్తులను కొనడం మానేయండి, అప్పుడే ఆ సంస్థ దానంతట అదే మోకాళ్ల మీద కూర్చుంటుంది. ఆయుర్వేద మందులలో చాలా ఎంపికలు ఉన్నాయి. నేటి నుండి, #హిమాలయ# కంపెనీ యొక్క ఏ ఉత్పత్తిని కొనకండి." అన్నది పోస్టు ద్వారా తెలుస్తోంది.
ఈ పోస్టులు గతంలో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి
వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు
హిమాలయ సంస్థ యజమానికి సంబంధించిన వివరాలను తెలుసుకోడానికి మేము గూగుల్ సెర్చ్ చేశాం. హిమాలయ కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం, మొహమ్మద్ మనల్ అనే వ్యక్తి హిమాలయ కంపెనీ వ్యవస్థాపకుడు. ఆయన 1986లో మరణించారు. మెరాజ్ మనల్ హిమాలయ గ్లోబల్ హోల్డింగ్స్ లిమిటెడ్ ఛైర్మన్ గా ప్రస్తుతం వ్యవహరిస్తూ ఉన్నారు.
https://
మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేయగా వైరల్ వీడియోలో ఉన్న వ్యక్తి లాయర్ భాను ప్రతాప్ సింగ్ అని గుర్తించాం.
న్యూఢిల్లీలోని ముస్తఫాబాద్‌లో జరిగిన CAA వ్యతిరేక నిరసనకారుల ప్రదర్శనలో ప్రఖ్యాత న్యాయవాది భాను ప్రతాప్ సింగ్ కొన్ని సంస్థలను బాయ్ కాట్ చేయాలని కోరారని అందులో తెలిపారు. నిర్దిష్ట బ్రాండ్లు, వ్యాపారాలను బహిష్కరించాలని న్యాయవాది నిరసనకారులను కోరారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో, రిలయన్స్, పతంజలి సంస్థల అన్ని ఉత్పత్తులను బహిష్కరించాలని ప్రజలను కోరారు.
అందుకు సంబంధించిన కథనాల లింక్స్ ను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
బాబా రాందేవ్ తన సంస్థ ద్వారా వచ్చే లాభాలన్నింటినీ ముస్లింలపై ఆయుధాలు కొనడానికి RSS కి ఇస్తున్నారని కూడా భాను ప్రతాప్ సింగ్ ఆరోపించారు.
వైరల్ వీడియో గతంలో కూడా సోషల్ మీడియాలో ఇదే వాదనతో ప్రచారంలో ఉంది. దీంతో పలు ఫ్యాక్ట్ చెక్ సంస్థలు ఈ వాదనలో ఎలాంటి నిజం లేదంటూ కథనాలను ప్రచురించాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వీడియోలో ఉన్నది హిమాలయ సంస్థ యజమాని కాదు.