ఫ్యాక్ట్ చెక్: ఒక స్క్రిప్టెడ్ వీడియోను నిజమైనదిగా ప్రచారం చేస్తున్నారు

చుట్టూ జరుగుతున్న కొన్ని సంఘటనలు, ఉదంతాలు చూస్తూ ఉంటే పెళ్లి చేసుకున్నాక అబ్బాయిలే ఎక్కువ బాధపడుతున్నారు, ఇబ్బందులు;

Update: 2025-03-24 11:00 GMT
woman found in a hotel room
  • whatsapp icon

చుట్టూ జరుగుతున్న కొన్ని సంఘటనలు, ఉదంతాలు చూస్తూ ఉంటే పెళ్లి చేసుకున్నాక అబ్బాయిలే ఎక్కువ బాధపడుతున్నారు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అనిపిస్తూ ఉంది. చాలామంది బయటకు చెప్పుకోలేక కుమిలి, కుమిలి ఏడుస్తూ ఉన్నారు. వైవాహిక సమస్యల కారణంగా తమ జీవితాలను చాలా మంది అర్ధాంతరంగా ముగించుకుంటూ ఉన్నారు. NCRB డేటా ప్రకారం పెళ్ళైన జంటలలో మహిళలతో పోలిస్తే ఎక్కువ మంది పురుషులే ఆత్మహత్య చేసుకున్నారు. 2022 సంవత్సరంలో 83,713 మంది పెళ్ళైన మగవాళ్ళు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలను వదిలేయగా, అదే సమయంలో 30,771 మంది మహిళలు మరణించారు. బెంగళూరు, ఆగ్రా నగరాలకు చెందిన టెకీలు ఇటీవల ఆత్మహత్య చేసుకునే ముందు విడిచిపెట్టిన సూసైడ్ నోట్లు, కేసులు దేశాన్ని కదిలించాయి. మహిళల వేధింపుల నుండి మగవాళ్లను రక్షించడానికి భారతదేశంలో కఠినమైన చట్టాలు ఉండాలనే డిమాండ్ మొదలైంది.

బెంగళూరుకు చెందిన అతుల్ సుభాష్ డిసెంబర్ 2024లో ఆత్మహత్య చేసుకున్నాడు. వివాహం, విడాకుల ప్రక్రియలో ఎదురైన ఇబ్బందుల గురించి 24 పేజీల సూసైడ్ నోట్ రాశాడు. 81 నిమిషాల వీడియోను రికార్డు చేశాడు. ఈ కేసు మాదిరిగానే, TCSలో మేనేజర్‌గా పనిచేస్తున్న 30 ఏళ్ల వ్యక్తి కూడా అదే తరహా కష్టాలను ఎదుర్కొని ప్రాణాలు కోల్పోయాడు. మగవారి కష్టాల గురించి అవగాహన కల్పించాలని వేడుకుంటూ 6 నిమిషాల వీడియోను రికార్డ్ చేసిన తర్వాత తన జీవితాన్ని ముగించాడు. ఇలాంటి ఎన్నో ఘటనల గురించి ఇటీవల దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది.
ఈ సంఘటనల తర్వాత, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో, మగవాళ్లు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడడానికి పలువురు కొన్ని వీడియోలను పంచుకోవడం ప్రారంభించారు.
ఒక హోటల్ గదిలో ప్రియుడితో గడుపుతున్న మహిళను ఆమె భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు చూపించే వీడియో వైరల్ అవుతూ ఉంది. "ఈ వివాహిత తన ప్రియుడితో హోటల్ గదికి వచ్చింది, ఆమె భర్త ఆమెను పట్టుకున్నప్పుడు ఆమె ఏ మాత్రం సిగ్గు పడలేదు" వంటి క్యాప్షన్లతో షేర్ చేస్తున్నారు. ఈ వీడియోలో ఉన్న మహిళ నేటి సమాజంలోని మహిళలను సూచిస్తుందని చెబుతూ మహిళలను కించపరిచే పదజాలంతో వీడియోను షేర్ చేస్తున్నారు.
“ये हैं आज के समाज की बदतमीज़ और बेहया औरतें!! बताइये….ये औरत शादीशुदा है होटल में दूसरे मर्द के साथ पकड़ी गई है फिर भी पति से बोल रही है कि "मैं तुझे क्यों बताऊं। सवाल यह कि शादी को मजाक बना रखा है! फिर ये गुजारा भत्ता मांगेगी या पति को मारवा देगी!” "వీళ్ళు నేటి సమాజంలోని సిగ్గులేని స్త్రీలు!! ఈ స్త్రీ పెళ్లి అయ్యాక మరొక వ్యక్తితో ఒక హోటల్‌లో పట్టుబడింది, అయినప్పటికీ ఆమె తన భర్తతో, "నేను మీకు ఎందుకు చెప్పాలి?" అని అడుగుతోంది. ఇలాంటి వాళ్లు వివాహాన్ని ఓ జోక్ చేశారు! ఆమె భరణం అడుగుతుంది లేదా తన భర్తను చంపేస్తుంది!" అనే అర్థం వచ్చేలా హిందీలో పోస్టు వైరల్ అవుతూ ఉంది.


క్లెయిం ఆర్చైవ్ లింక్ ఇక్కడ చూడొచ్చు

ఫ్యాక్ట్ చెక్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ వీడియో స్క్రిప్టెడ్. ఇటీవల జరిగిన ఏ వాస్తవ సంఘటనకు సంబంధించినది కాదు.

ముందుగా, వీడియో లో ఉన్న TV1ఇండియా లోగో ను చూసి, ఆ పేరు పైన ఉన్న సోషల్ మీడియా హ్యాండిల్స్ కోసం వెతకగా, TV1 ఇండియా ఈన్స్తగ్రం హ్యాండిల్ షేర్ చేసిన వీడియో లభించింది. వీడియో నవంబర్ 2, 2024న షేర్ చేయబడింది. ఆ వీడియో పైన వచ్చిన వ్యాఖ్యలను గమనించినప్పుడు, కొంతమంది వినియోగదారులు ఇది స్క్రిప్టెడ్ వీడియో అని రాసినట్టు తెలుసుకున్నాం.

వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను సంగ్రహించి, గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా వీడియోలో కనిపించిన వారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అని, స్క్రిప్ట్ చేసిన వీడియోలను YouTubeలో ప్రచురిస్తారని తెలుసుకున్నాం. Ankita Karotiya అనే యూట్యూబ్ పేజీలో ఆగస్టు 25, 2024న వీడియోను పోస్టు చేశారు. ‘Ankita Karotiya II @royaltiger02” అనే టైటిల్ తో వీడియోను పోస్టు చేశారు.

Full View

వీడియోలో ఉన్న అంకిత కరోటియా ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ను
మేము కనుగొన్నాము. ఇందులో అనేక రీల్స్, వీడియోలను చూడొచ్చు. యూట్యూబ్ ఛానెల్‌ లో పలు స్క్రిప్టెడ్ వీడియోలు ఉన్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె బయో ద్వారా ఆమె ఒక ప్రాంక్‌స్టర్ అని, ఆమె ఢిల్లీకి చెందినదని తెలిపింది.

ఆమె ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో ఆమె ఢిల్లీకి చెందిన డిజిటల్ కంటెంట్ సృష్టికర్త, నటి అని తెలిపింది.


ఇలాంటి స్క్రిప్ట్‌లు ఉన్న ఇతర వీడియోలను కూడా మేము కనుగొన్నాము. ఈ వీడియోపై మాకు ఎటువంటి డిస్క్లైమర్ కనిపించనప్పటికీ, ఇతర వీడియోలపై ప్రచురించిన డిస్క్లైమర్‌ను మేము కనుగొన్నాము.

Full View
ఇటీవల, అదే యూట్యూబ్ ఛానెల్‌లో ప్రచురించిన మరొక వీడియోను తెలుగుపోస్ట్ ఫ్యాక్ట్ చెక్ చేసింది. ఒక స్క్రిప్టెడ్ వీడియో అని తేల్చింది. ఆ ఫ్యాక్ట్  చెక్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.
కంటెంట్ సృష్టికర్త అప్లోడ్ చేసిన ఒక స్క్రిప్టెడ్ వీడియోలోని ఒక భాగాన్ని, ఒక మహిళ హోటల్ గదిలో ప్రియుడితో గడుపుతూ ఉంటే ఆమె భర్త పట్టుకున్నాడని చూపిస్తున్నట్లుగా షేర్ చేస్తున్నారు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim :  ఓ మహిళ తన ప్రియుడితో కలిసి హోటల్ రూమ్ లో ఉండగా ఆమె భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు
Claimed By :  Twitter users
Fact Check :  False
Tags:    

Similar News