ఫ్యాక్ట్ చెక్: నాందేడ్ లోక్ సభ ఫలితాల్లో అవకతవకలు జరిగాయనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదు

లోక్ సభలో అవకతవకలు జరిగాయనే వాదనలపై అధికారులు విచారణ

Update: 2024-12-16 05:30 GMT

ఎన్నికల్లో ఈవీఎంల హ్యాకింగ్ జరిగిందంటూ పలు పార్టీ నాయకులు ఆరోపణలు గుప్పిస్తూ ఉన్నారు. ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ఉద్ధవ్ థాకరే శివసేన పార్టీ కూడా ఈవీఎంలు టాంపరింగ్ జరిగిందంటూ ఆరోపణలు చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన మహావికాస్‌ అగాఢీ నేతలంతా ఈవీఎంలను తప్పుబట్టారు. 288మంది సభ్యులున్న అసెంబ్లీలో 235సీట్లను మహాయుతి గెలిచింది. అగాఢీ కూటమికి 46మాత్రమే దక్కింది. ఈ ఓటమికి ఈసీకి కూడా ఫిర్యాదు చేసింది.


మహారాష్ట్రలో ఈవీఎంల బాగోతం బయటపడిందని వాట్సాప్ లో పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి.

బిగ్ బ్రేకింగ్

మహారాష్ట్రలో మరోసారి బయటపడ్డ ఈవీఎంల బాగోతం

* నాందేడ్ లోకసభ కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయినట్లు ఈసీ ప్రకటించింది..
* కాని కాంగ్రెస్ అభ్యర్థి రీకౌంటింగ్ కోసం పట్టుబడితే మరోసారి రీకౌంటింగ్ చేయగా 1400 ల ఓట్లతో గెలిచాడు..
వైరల్ మెసేజీకి సంబంధించిన స్క్రీన్ షాట్ ఇక్కడ చూడొచ్చు 



 


ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు.

మేము సంబంధిత కీవర్డ్స్ ను ఉపయోగించి గూగుల్ సెర్చ్ చేశాం.

నాందేడ్ లోక్‌సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి రవీంద్ర చవాన్ తన ప్రత్యర్థి బీజేపీకి చెందిన శాంతుక్రావ్ హంబార్డేపై 1,457 ఓట్ల తేడాతో విజయం సాధించారు. చవాన్‌కు 5,86,788 ఓట్లు రాగా, హంబర్డేకు 5,85,331 ఓట్లు వచ్చాయి. చవాన్ వసంతరావు బల్వంతరావు మరణించినందున ఈ పార్లమెంటరీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.

నాందేడ్ లోక్‌సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి రవీంద్ర చవాన్ తన సమీప ప్రత్యర్థి బీజేపీకి చెందిన శాంతుక్రావ్ హంబార్డేపై 1457 ఓట్ల తేడాతో విజయం సాధించారని ఎన్నికల అధికారి కూడా తెలిపారు. చవాన్ కు 586788 ఓట్లు పోల్ కాగా, హంబర్డే 585331 ఓట్లు సాధించారని అధికారి తెలిపారు. ఆగస్టు 26న సిట్టింగ్ కాంగ్రెస్ ఎంపీ వసంత్ చవాన్ మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. రవీంద్ర చవాన్ ఆయన కుమారుడు. ఇదే విషయాన్ని పలు మీడియా సంస్థలు కూడా ధృవీకరించాయి. వాటిని
ఇక్కడ
, ఇక్కడ చూడొచ్చు. 


లోక్ సభలో అవకతవకలు జరిగాయనే వాదనలపై అధికారులు విచారణ కూడా జరిపారు. అయితే ఎలాంటి అవకతవకవలు జరగలేదని ధృవీకరించినట్లు మీడియా కథనాలు కూడా వచ్చాయి.

మహారాష్ట్రలోని నాందేడ్‌లోని జిల్లా యంత్రాంగం ఈవీఎంలు 75 వీవీప్యాట్ యంత్రాల మధ్య ఓట్లను సరిపోల్చింది. ఓట్ల లెక్కింపులో తేడా లేదని అధికారులు చెప్పినట్లుగా ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా(PTI) ధృవీకరించింది. ఆ కథనం ఇక్కడ చూడొచ్చు.



ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కౌంటింగ్‌, వెరిఫికేషన్‌ ప్రక్రియ చేపట్టారు. జిల్లాలోని ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలోని ఐదు కేంద్రాల నుంచి ఈవీఎంలపై వచ్చిన అభ్యర్థుల వారీ ఓట్లను వీవీప్యాట్‌లతో లెక్కించినట్లు అధికారి తెలిపారు. నాందేడ్ జిల్లా కలెక్టర్ అభిజిత్ రౌత్ మాట్లాడుతూ జిల్లాలోని 75 కేంద్రాలు, 30 లోక్‌సభ, 45 అసెంబ్లీ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ఎలాంటి లోపం లేకుండా జరిగిందని తెలిపారు.

ఎకనామిక్ టైమ్స్ వెబ్ సైట్ లో కూడా ఇందుకు సంబంధించిన కథనాన్ని మేము డిసెంబర్ 9న చూశాం. అందులో కూడా అధికారులు ఎలాంటి అవకతవకలు జరగలేదని చెప్పినట్లుగా నివేదించారు. ఆ కథనాన్ని ఇక్కడ చూడొచ్చు.

మహారాష్ట్రలోని నాందేడ్‌లోని జిల్లా యంత్రాంగం ఈవీఎంలకు ఓట్లకు సంబంధించి 75 వీవీప్యాట్ యంత్రాలను పరిశీలించి లెక్కింపులో తేడా లేదని స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కౌంటింగ్‌, వెరిఫికేషన్‌ ప్రక్రియ చేపట్టారు. జిల్లాలోని ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలోని ఐదు కేంద్రాల నుంచి ఈవీఎంలపై వచ్చిన అభ్యర్థుల వారీ ఓట్లను వీవీప్యాట్‌లతో లెక్కించినట్లు అధికారి తెలిపారు. నాందేడ్ జిల్లా కలెక్టర్ అభిజిత్ రౌత్ మాట్లాడుతూ జిల్లాలోని 75 కేంద్రాలు, 30 లోక్‌సభ, 45 అసెంబ్లీ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ఎలాంటి లోపం లేకుండా జరిగిందని తెలిపారు. అభ్యర్థుల ప్రతినిధులు, ఎన్నికల పరిశీలకుల సమక్షంలో లాట్లు తీసి కేంద్రాలను ఎంపిక చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కౌంటింగ్ సమయంలో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఐదు వీవీప్యాట్‌ల స్లిప్పులను భౌతికంగా లెక్కించి, ఈవీఎంల ఓట్లతో ధృవీకరించారు.

నాందేడ్ ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని ఎన్నికల సంఘం అధికారులు ధృవీకరించారంటూ పలు మీడియా సంస్థలు ధృవీకరించాయి. ఆ వీడియోలను ఇక్కడ చూడొచ్చు.

Full View


Full View


Full View


కాబట్టి, వైరల్ అవుతున్న వాదనల్లో ఎలాంటి నిజం లేదు.


Tags:    

Similar News