ఫ్యాక్ట్ చెక్: రాహుల్ గాంధీ కమలం గుర్తు ఉన్న కాషాయ రంగు టోపీని ధరించలేదు.

కమలం గుర్తు ఉన్న కాషాయ రంగు టోపీని రాహుల్ గాంధీ ధరించారు

Update: 2024-06-03 08:24 GMT

లోక్‌సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. అభ్యర్థులంతా ఇప్పుడు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ కాషాయ రంగు టోపీ ధరించి ఉన్న ఫోటో ఒకటి వైరల్ అవుతూ ఉంది. ముఖ్యంగా ఆ టోపీలో బీజేపీ లోగో.. కమలం గుర్తు ఉంది.

చాలా ఎగ్జిట్ పోల్స్.. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డిఏ 350 సీట్లకు పైగా గెలుస్తుందని అంచనా వేసింది. ఈసారి 370 సీట్లు లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ, మిత్రపక్షాల మద్దతుతో 400 సీట్ల మార్కును అధిగమించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

"ఎగ్జిట్ పోల్ ఫలితాల తర్వాత రాహుల్ గాంధీ కమలం గుర్తు ఉన్న కాషాయ రంగు టోపీ ధరించారు" అనే క్యాప్షన్‌తో పోస్టులు వైరల్ చేస్తున్నారు. కాషాయ టోపీలో కమలం గుర్తు ఉన్న రాహుల్ గాంధీ ఫోటోను సోషల్ మీడియా వినియోగదారులు షేర్ చేస్తున్నారు.



ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న పోస్టులలో ఎలాంటి నిజం లేదు.
రాహుల్ గాంధీ టోపీకి బీజేపీ లోగోని ఎడిట్ చేసి ఉంచారు. అసలు చిత్రంలో రాహుల్ గాంధీ ఎటువంటి గుర్తు లేని కాషాయ రంగు టోపీని ధరించారు.
గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర స్టేట్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ 'హిమేష్ పరేష్ జోషి' వివిధ కోణాల నుండి క్లిక్ చేసిన రాహుల్ గాంధీ ఫోటోగ్రాఫ్‌లను షేర్ చేశారని మేము కనుగొన్నాము. రాహుల్ గాంధీ ధరించిన టోపీపై ఎలాంటి లోగో కూడా మాకు కనిపించలేదు.


“रंग केसरी वीरों का...देश जोड़ने निकले रणधीरों का। #BharatJodoYatra" అంటూ మేము డిసెంబర్ 15, 2022న ఈ ఛాయాచిత్రాలను INC ఉత్తరప్రదేశ్ అప్లోడ్ చేసినట్లు కూడా గుర్తించాం.

Full View


ఈ ఫోటోలు 2022 లో మహారాష్ట్రలో జరిగిన భారత్ జోడో యాత్రలో తీశారని స్పష్టంగా తెలుస్తోంది.
పలువురు కాంగ్రెస్ నేతలు, పలు రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ అధికారిక ఖాతాలు షేర్ చేసిన రాహుల్ గాంధీ ఫోటోలను మేము కనుగొన్నాము. ఎక్కడా కూడా రాహుల్ గాంధీ కమలం గుర్తు ఉన్న టోపీని ధరించలేదు.






“Rahul Gandhi in Saffron Cap“ అనే కీవర్డ్స్ ను ఉపయోగించి గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. జనసత్తా న్యూస్ కూడా ఇందుకు సంబంధించిన కథనాన్ని ప్రచురించిందని మేము కనుగొన్నాము. అందులో “రాహుల్ గాంధీ కాషాయ రంగు టోపీని ధరించి కనిపించారు” అని కథనం ఉంది.
ఏ సోషల్ మీడియా పోస్ట్‌లో కానీ.. ప్రచురించిన వార్తా కథనాల్లోనూ రాహుల్ గాంధీ ధరించిన కాషాయ రంగు టోపీపై మాకు కమలం గుర్తు కనిపించలేదు.
మా పరిశోధన, అనేక మీడియా నివేదికల ఆధారంగా, వైరల్ చిత్రం ఎడిట్ చేశారని మేము కనుగొన్నాము.
2022లో జరిగిన భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ కాషాయ రంగు టోపీ ధరించారు. కానీ ఆ టోపీపై బీజేపీ ఎన్నికల గుర్తు కనిపించలేదు. ఇక ఈ ఫోటోకు ఎగ్జిట్ పోల్స్ లేదా 2024 సార్వత్రిక ఎన్నికలతో ఎలాంటి సంబంధం లేదు.


Claim :  కమలం గుర్తు ఉన్న కాషాయ రంగు టోపీని రాహుల్ గాంధీ ధరించారు
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News