ఫ్యాక్ట్ చెక్: అమితాబ్ బచ్చన్ అనారోగ్యం గురించి వైరల్ అవుతున్న వాదనలు ప్రజలను తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయి

అనారోగ్యం గురించి వైరల్ అవుతున్న వాదనలు.. గూగుల్‌లో అమితాబ్ బచ్చన్ చిత్రంపై రివర్స్ సెర్చ్ నిర్వహించగా

Update: 2024-01-11 03:58 GMT

Fact Check Viral News About Amitabh Bachchan’s ill health is Misleading

‘బిగ్ 24’ అనే వెబ్‌సైట్ పోస్ట్ చేసిన కథనం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "అమితాబ్ బచ్చన్ అనారోగ్యం బారిన పడడంతో బచ్చన్ కుటుంబం కన్నీళ్లు పెట్టుకుంది." అనే టైటిల్ తో కథనాలను ప్రసారం చేశారు. ఈ వార్తలో అస్వస్థతతో అమితాబ్ బచ్చన్ ఉన్న ఫోటోను మనం గమనించవచ్చు. ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ బాధపడుతున్నట్లు మనం గమనించవచ్చు.

ఈ కథనాన్ని చదివాము.. రెండవ పేరాలోని.. "అభిషేక్ బచ్చన్ తన తండ్రి బ్రతుకుతారో లేదో అనే విషయంలో ఆశను కోల్పోయినట్లు కనిపిస్తోంది, ఎందుకంటే వైద్యులు అమితాబ్ బచ్చన్ కోలుకుంటారని చెప్పలేకపోతున్నారు" అని ఉంది.
నాల్గవ పేరాలో, "అమితాబ్ బచ్చన్‌ స్ట్రోక్‌తో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. సినిమా షూటింగ్ సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆయనను పరిశీలించిన వైద్యులు కూడా ఆయన కోలుకుంటారనే ఆశను వదులుకున్నారు." అని ఉంది.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది.
క్షుణ్ణంగా దర్యాప్తు చేసిన తరువాత.. అమితాబ్ బచ్చన్ అనారోగ్యం లేదా ఆసుపత్రిలో ఇటీవల చేరారని ప్రముఖ మీడియా సంస్థలు.. ఎటువంటి నివేదికలు ప్రచురించలేదని మేము కనుగొన్నాము. కొద్ది రోజుల క్రితం అమితాబ్ అస్వస్థతకు గురయ్యారనే సమాచారం ఖచ్చితమైనదైతే, ఆ విషయాన్ని దేశవ్యాప్తంగా ఉన్న వార్తా ఛానెల్‌లు, వార్తాపత్రికలు, వెబ్‌సైట్‌లలో ప్రచురించి ఉండేవారు. అయితే.. ఈ విషయానికి సంబంధించి మాకు ఎక్కడా ఆధారాలు దొరకలేదు.
మేము ఈ వార్తలో కనిపించే రెండు ఫోటోగ్రాఫ్‌ల మూలాలను క్షుణ్ణంగా శోధించాము. వార్తా కథనం థంబ్‌నెయిల్ ఇమేజ్‌పై రివర్స్ సెర్చ్ కోసం గూగుల్ లెన్స్‌ని ఉపయోగించాం.. అభిషేక్ బచ్చన్ చిత్రం 'దస్వి' ట్రైలర్‌ ఉన్న YouTube వీడియోను మేము కనుగొన్నాము. ఈ ట్రైలర్ థంబ్‌నెయిల్ లో వైరల్ పోస్టు థంబ్‌నెయిల్‌లో ఉపయోగించిన ఒకేలాంటి ఫోటోను కనుగొన్నాం.

Full View

గూగుల్‌లో అమితాబ్ బచ్చన్ చిత్రంపై రివర్స్ సెర్చ్ నిర్వహించగా, ఈ చిత్రం నవంబర్ 29, 2005 నాటి టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తా కథనంలో ఉందని కనుగొన్నాం. అమితాబ్ బచ్చన్ కడుపు నొప్పి బారిన పడ్డారనే విషయాన్ని అందులో నివేదించారు.
ఈ నివేదికలో ప్రచురించిన చిత్రాలు వైరల్ పోస్ట్ లలో ఉంచిన వాటితో సరిపోలుతున్నాయి. వైరల్ వార్తలలో అమితాబ్ బచ్చన్ కు సంబంధించిన ఫోటో 2005 నాటిదని నిర్ధారించాము. ఆ సమయంలో ఆయన కడుపు నొప్పి బారిన పడ్డారు.
కాబట్టి, వైరల్ వార్తలు పూర్తిగా తప్పుదారి పట్టించేవి.. ఆ సమాచారానికి ఎలాంటి ప్రామాణికత లేదు. అలాగే ఇందులో వాడిన చిత్రాలు కూడా పాతవే.


Claim :  The news includes a photograph of a visibly unwell Amitabh Bachchan, accompanied by a somber image of his son Abhishek Bachchan, causing distress to everyone.
Claimed By :  Online news report
Fact Check :  False
Tags:    

Similar News