ఫ్యాక్ట్ చెక్: ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి గ్రామీణ ఉద్యమిత వికాస్ నిగమ్ వెబ్‌సైట్ ప్రకటనల్లో ఎటువంటి నిజం లేదు
వెబ్‌పేజీ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ శాఖ అధికారిక వెబ్‌సైట్‌తో
సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న ఒక వెబ్‌సైట్, ప్రభుత్వ ఉద్యోగాలను అందజేస్తోందనే వాదనతో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఆ ఉద్యోగాలు దక్కాలంటే రిజిస్ట్రేషన్ ఫీజును కూడా కట్టాలని కోరుతున్నారు. గ్రామీణ ఉద్యమిత వికాస్ నిగమ్ పేరుతో ఉన్న సైట్ లో 2 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని.. రిజిస్ట్రేషన్ ఫీజును కట్టాలని అందులో కోరుతున్నారు.
రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని అందులో చెబుతున్నారు. నెలకు జీతాలు రూ. 17,500 నుండి రూ. 21,500 వరకు జీతాలు ఉంటాయని చెబుతున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
ముందుగా, వెబ్‌పేజీ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ శాఖ అధికారిక వెబ్‌సైట్‌తో అనుసంధానించలేదు. అన్ని అనుబంధ ప్రభుత్వ వెబ్‌సైట్‌లు.. ఆయా మంత్రిత్వ శాఖ ప్రధాన వెబ్‌పేజీకి లింక్ అవుతాయి. వెబ్‌సైట్ పేజీలో భారత జాతీయ చిహ్నాన్ని కలిగి ఉండాలి. అన్ని అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌లలో తప్పనిసరిగా జాతీయ చిహ్నం కనిపిస్తుంది. వెబ్‌సైట్ ఫుటర్‌లో మంత్రిత్వ శాఖ ఆయా విభాగాలకు ఉన్న అనుబంధాన్ని కూడా పేర్కొనలేదు.
వెబ్‌సైట్ మోసపూరితమైనది. సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖకు సంబంధించినది కాదని ఇవన్నీ తెలియజేస్తున్నాయి.
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పిఐబి) ఫ్యాక్ట్ చెక్ బృందం కూడా దీనిని స్కామ్ అని తెలిపింది. ఒక పత్రికా ప్రకటన ద్వారా, పైన పేర్కొన్న వెబ్‌సైట్ నకిలీదని, మోసపూరితమైనదని తెలిపింది. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ శాఖకు సంబంధించినది కాదని పేర్కొంది.
సైబర్ క్రైమ్, ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌తో సమన్వయంతో నకిలీ వెబ్‌సైట్‌పై తదుపరి చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టం చేసింది. నకిలీ వెబ్‌సైట్‌ను బ్లాక్ చేయడం, వెబ్‌సైట్ యజమానిపై తగిన చర్యలు తీసుకోనున్నారు.
కాబట్టి, ఇలాంటి వెబ్ సైట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
Claim : Website Gramin Udyamita Vikas Nigam is affiliated to the Ministry of Social Justice and Empowerment and offers government jobs
Claimed By : Gramin Udyamita Vikas Nigam
Fact Check : False