ఫ్యాక్ట్ చెక్: కొణిదెల నాగబాబును టీటీడీ ఛైర్మన్ గా నియమించలేదు.

ఆంధ్రప్రదేశ్‌లో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి విజయం సాధించింది. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆయన విజయంలో సోదరుడు నాగబాబు కీలకపాత్ర పోషించారు

Update: 2024-06-08 06:00 GMT

nagababu

ఆంధ్రప్రదేశ్‌లో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి విజయం సాధించింది. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆయన విజయంలో సోదరుడు నాగబాబు కీలకపాత్ర పోషించారు. పవన్ కళ్యాణ్ తన విజయాన్ని తన సోదరులు, కుటుంబ సభ్యులతో పంచుకున్నారు.

వీటన్నింటి నడుమ శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం తదుపరి చైర్మన్‌గా కొణిదెల నాగబాబు బాధ్యతలు చేపట్టబోతున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. మెగా అభిమానులు ఈ వార్తను షేర్ చేస్తూ ఉన్నారు.
‘TTD New Chairman' అనే క్యాప్షన్ తో నాగబాబు టీటీడీ ఛైర్మన్ అవ్వబోతున్నారంటూ ప్రచారం చేస్తూ వస్తున్నారు. @NagaBabuOffl Garu #Tirumala #Tirupati #TTDChairman #TTD #NagendraBabu #NagaBabu #TirupatiYaaYo’ అంటూ పోస్టులు పెడుతున్నారు.


ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
నాగబాబు నియామకానికి సంబంధించి స్థానిక, జాతీయ మీడియా ప్రచురించిన అటువంటి వార్తలను మేము కనుగొనలేదు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఇంకా ఏర్పడనందున, రాష్ట్రంలో ఇలాంటి నియామకాలు జరగడం సాధ్యం అవ్వదు.
మరింత ధృవీకరణ కోసం.. ఈ అపాయింట్‌మెంట్ గురించి ఏవైనా వార్తల కోసం మేము నాగబాబు చేసిన ట్వీట్ల కోసం వెతికాము. 'ఫేక్ న్యూస్‌ను నమ్మవద్దు' అని ఆయన చేసిన ట్వీట్ మాకు కనిపించింది. అధికారిక పార్టీ హ్యాండిల్స్ లేదా ధృవీకరించిన సోషల్ మీడియా ఖాతాల నుండి వచ్చే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని ఆయన కోరారు. దయచేసి తప్పుడు వార్తలను విశ్వసించవద్దు లేదా ప్రచారం చేయవద్దని నాగబాబు చేసిన ట్వీట్ ను మేము గుర్తించాం.
మాకు టీవీ9 ఛానల్ కు సంబంధించిన వీడియో రిపోర్ట్ కూడా దొరికింది, అందులో టీటీడీ చైర్మన్ నియామక వార్త గురించి ఒక విలేఖరి నాగబాబును అడగగా, అది ఫేక్ అని ఆయన బదులిచ్చారు.
ఈ వార్తలను నాగబాబు ఖండించినట్లు ఈనాడు కూడా కథనాన్ని ప్రచురించింది. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఫేక్ వార్తలను నమ్మవద్దని ప్రతి ఒక్కరినీ కోరినట్లు ఆ కథనం పేర్కొంది.
పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌గా నియమించినట్లు వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు. వైరల్ అవుతున్న వాదన అబద్ధం.
Claim :  తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు కొణిదెల నాగబాబు నియమితులయ్యారు.
Claimed By :  Social media users
Fact Check :  False
Tags:    

Similar News