ఫ్యాక్ట్ చెక్: ప్రధాని నరేంద్ర మోదీ మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను అవమానించలేదు
ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ల వీడియో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతూ ఉంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రధానికి అభివాదం చేస్తుండగా.. ప్రధాని మోదీని గుర్తించకుండా కెమెరా వైపు చూశారనే వాదన వినిపించింది.
క్లెయిమ్: ప్రధాని నరేంద్ర మోదీ మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను అవమానించారు
ఫ్యాక్ట్ : వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు
జులై 23న, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం ముగియడానికి ఒకరోజు ముందు పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా పార్లమెంటు ఉభయ సభల సభ్యులు ఈ వేడుకకు హాజరయ్యారు.

ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ల వీడియో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతూ ఉంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రధానికి అభివాదం చేస్తుండగా.. ప్రధాని మోదీని గుర్తించకుండా కెమెరా వైపు చూశారనే వాదన వినిపించింది. రాష్ట్రపతిని పట్టించుకోకుండా ప్రధాని అవమానించారని సోషల్ మీడియా వినియోగదారులు పేర్కొన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, ఎంపీ సంజయ్ సింగ్ ఈ వీడియోను షేర్ చేస్తూ రాష్ట్రపతిని అవమానించడమేనని ట్వీట్ చేశారు. సంజయ్ సింగ్ షేర్ చేసిన వీడియో ప్రకారం, రామ్‌నాథ్ కోవింద్ పార్లమెంటు సెంట్రల్ హాలులో తన వీడ్కోలు సందర్భంగా ఆందరికీ నమస్కారం చేస్తూ ముందుకు వెళ్లారు. ఆయన నమస్కరిస్తుంటే మోదీ పట్టించుకోనట్టుగా వేరే వైపు చూస్తున్నారు. ఆ తర్వాత రామ్‌నాథ్ కోవింద్ ముందుకు కదిలివెళ్లారు. ఈ వీడియోకు పోస్ట్ చేసిన సంజయ్ సింగ్ ''ఇది చాలా అవమానకరం, వెరీ సార్ సార్. ఈ వ్యక్తులు అంతే, మీ పదవీకాలం పూర్తి కావడంతో ఇక మీవైపు కన్నెత్తి కూడా చూడరు'' అంటూ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే వీడియో వైరల్ అయింది.
నేషనల్ ఫోరమ్, యశ్వంత్ సిన్హా నేతృత్వంలోని సంస్థ కూడా ట్విట్టర్‌లో వీడియోను షేర్ చేసింది. ఆర్జేడీ నేత రిషి కుమార్ కూడా క్లిప్‌ను ట్వీట్ చేశారు.
ఈ వీడియోను పలువురు సోషల్ మీడియా యూజర్లు షేర్ చేశారు. కొంతమంది వినియోగదారులు ప్రధాని మోదీకి కెమెరాపై ఉన్న ప్రేమను ఎత్తి చూపగా.. మరికొందరు దీనిని రాష్ట్రపతికి అవమానమని పేర్కొన్నారు.

ఫ్యాక్ట్ చెకింగ్:
మా బృందం వైరల్ విజువల్స్‌లో 'సన్సద్ టీవీ' లోగోను చూసింది. దీన్ని క్లూగా ఉపయోగించి.. మేము YouTubeలోని Sansad TV ఛానెల్ ను పరిశీలించాము. వైరల్ క్లిప్ ఉన్న పూర్తి వీడియోను కనుగొన్నాము.వీడియోలోని 0:58 నుండి 1:01 మార్క్ వరకు, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రధాని నరేంద్ర మోదీకి నమస్కారం చేయడం స్పష్టంగా చూడవచ్చు. ప్రధాన మంత్రి మోదీ కూడా తిరిగి నమస్కరించారు.
దీని తరువాత, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతులను ముడుచుకుని ముందుకు సాగారు. 1:03 మరియు 1:08 మార్క్ మధ్య, కాకినాడ (ఆంధ్రప్రదేశ్) ఎంపీ గీతా విశ్వనాథ్ వంగాను పలకరించడానికి రాష్ట్రపతి.. ప్రధాని మోదీ కంటే కొంచెం ముందుగా ఆగి.. ఆమెతో మాట్లాడారు.
కెమెరా కోణం (కెమెరా ప్రధానమంత్రి వైపు చూపబడింది) కారణంగా.. రామ్ నాథ్ కోవింద్ ప్రధాని ముందు నిలబడి, ఆయనతో మాట్లాడుతున్నట్లు కనిపించింది. రామ్ నాథ్ కోవింద్ ప్రధానిని పలకరించిన తర్వాత ఎంపీ గీతా విశ్వనాథ్ వంగాను పలకరిస్తూ ఉన్నారు.

ఇక సంజయ్ సింగ్ ట్వీట్‌పై ట్విట్టర్ స్పందించింది. ఔట్ ఆఫ్ కాంటెస్ట్ అంటూ పేర్కొంటూ .. ఒక అడ్వయిజరీని జోడించింది. ప్రజలను పక్కదారి పట్టించడం, అయోమయంలో పడేయడం, హాని కలిగించే వీలున్న వాటిని షేర్ చేయవద్దని సూచించింది.
మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వీడ్కోలు వేడుక వీడియో క్లిప్‌ను తప్పుదారి పట్టించే దావాతో షేర్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ మాజీ రాష్ట్రపతిని అవమానించలేదు.
క్లెయిమ్: ప్రధాని నరేంద్ర మోదీ మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను అవమానించారు
క్లెయిమ్ చేసింది ఎవరు: సోషల్ మీడియా యూజర్లు, పలువురు రాజకీయ నాయకులు
ఫ్యాక్ట్: వైరల్ పోస్టుల ద్వారా చెబుతున్నది అబద్ధం
క్లెయిమ్: ప్రధాని నరేంద్ర మోదీ మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను అవమానించారు
క్లెయిమ్ చేసింది ఎవరు: సోషల్ మీడియా యూజర్లు, పలువురు రాజకీయ నాయకులు
ఫ్యాక్ట్: వైరల్ పోస్టుల ద్వారా చెబుతున్నది అబద్ధం
Claim : PM Modi insult former President Ram Nath Kovind
Claimed By : Twitter Users
Fact Check : False