నిజ నిర్ధారణ: హిజాబ్ ధరించిన మహిళ, హిజాబ్ ఉండగానే తలకి షాంపూ చేసుకుంటుంటున్న వీడియో ప్రకటన కాదు, పేరడీ
హిజాబ్ ధరించి ఉండగానే జుట్టుకు షాంపూ చేసుకుంటున్న స్త్రీని చూపిస్తున్న వీడియో మలేషియా కి చెందిన షాంపూ ప్రకటన అని సోషల్ మీడియాలో షేర్ అవుతోంది.
హిజాబ్ ధరించి ఉండగానే జుట్టుకు షాంపూ చేసుకుంటున్న స్త్రీని చూపిస్తున్న వీడియో మలేషియా కి చెందిన షాంపూ ప్రకటన అని సోషల్ మీడియాలో షేర్ అవుతోంది.
14 సెకన్ల నిడివి గల వీడియోలో హిజాబ్‌లో ఉన్న ఒక మహిళ తన తలపై హిజాబ్ ఉండగానే షాంపూ చేసుకుంటున్నట్టు చూపిస్తోంది. వీడియో తో పాటు వైరల్ అయిన కధనాలు ఇలా ఉన్నాయి. “#మలేషియా నుండి #షాంపూ ప్రకటన #వైరల్ వీడియో”
“A shampoo advertisement in Malaysia for Hijabi Women.”
"హిజాబీ మహిళల కోసం మలేషియాలో షాంపూ ప్రకటన."
నిజ నిర్ధారణ:
వీడియో మలేషియా లో విడుదల అయిన షాంపూ ప్రకటన కాదు. ఎస్కార్వ్స్ అనే హెడ్ స్కార్ఫ్ కంపెనీ చేసిన పేరడీ యాడ్ ఇది. క్లెయిం అబద్దం.
వీడియోలోని కీలక ఫ్రేమ్‌లను ఉపయోగించి శోధన చేసినప్పుడు, ఏప్రిల్ 2017లో ఎంటిఏఎస్ ప్రొడక్షన్ పేరుతో ఒక యూట్యూబ్ ఛానెల్ ప్రచురించిన 2.13 నిమిషాల వీడియో లభించింది. క్లయింట్ పేరు ఎస్కార్వ్స్ అని వీడియో వివరణలో ఉంది.
వ్యాపారాలు, బ్రాండ్‌ల వీడియోలతో కంపనీల లక్ష్యాలను సాధించడంలో సహాయపడే వీడియో ప్రొడక్షన్ ఏజెన్సీ గా కంపెనీ వెబ్‌సైట్ వివరణ లో చూడవచ్చు. వెబ్‌సైట్‌లో, పేరడీ ‘షాంపూ’ వీడియో వైరల్ అయిన తర్వాత తమ ఉత్పత్తికి డిమాండ్ పెరిగిందని ఎస్కార్వ్స్ గ్రూప్ యజమాని పువాన్ హిదయా సుకిమాన్ టెస్టిమోనియల్ పేర్కొనడం కూడా చూడవచ్చు.
హిదయా సుకిమాన్ సోషల్ మీడియా ఖాతాల కోసం వెతుకుతున్నప్పుడు, ఎడ్యా సుకిమాన్ పేరుతో ఫేస్ బుక్ ఖాతాని కనుగొన్నాము. మే 2017లో ఆమె చేసిన ఒక పోస్ట్‌లో ఇది పేరడీ వీడియో అని, మతపరమైన భావాలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా పేర్కొంది.
సిలిసోస్ అనే మలేషియా వెబ్‌సైట్ ప్రకారం, ఈ వీడియో 2006లో విడుదల అయిన సన్‌సిల్క్ ప్రకటనకు అనుకరణ. మొత్తం 2 నిమిషాల నిడివి గల వీడియోను మలేషియాలో హిజాబ్‌ను విక్రయించే ఎస్కార్వ్స్‌కు బ్రాండ్ అవగాహన కల్పించేందుకు తయారు చేసారు. ఒక ముస్లిం మహిళ తన హిజాబ్‌పై షాంపూ చేసుకుంటున్నది అనే ఆలోచన కు అర్ధం ఏమిటంటే, ఎస్కార్వ్స్ హిజాబ్‌లు నిజంగా సౌకర్యవంతంగా ఉన్నాయని చూపించడం అంటూ వారు ప్రకటించారు.
ఈ క్లెయిమ్ 2017లో కూడా వైరల్ అయ్యింది, కొన్ని నిజ-నిర్ధారణ సంస్థలచే తనికీ చేయబడింది.
అందువల్ల, వీడియో షాంపూ కోసం తయారైన మలేషియా ప్రకటనను చూపడం లేదు, ఇది హిజాబ్‌లను విక్రయించే కంపెనీకి చెందిన పారడీ ప్రకటన. క్లెయిం అవాస్తవం.