ఫ్యాక్ట్ చెక్: షిర్డీ సాయి ట్రస్టు హజ్ యాత్ర కోసం 35 కోట్ల రూపాయలను విరాళంగా ఇవ్వలేదు
దేశంలోని పవిత్ర పుణ్య క్షేత్రాలలో షిర్డీ కూడా ఒకటి. సాయిబాబా నివాసమైన షిర్డీని హిందువులు పవిత్ర పుణ్యక్షేత్రంగా భావిస్తారు. షిర్డీ మహారాష్ట్రలోని ఒక నగరం. సాయిబాబా 1918లో మోక్షం పొందే ముందు వరకూ 60 సంవత్సరాలు అక్కడే గడిపారు.
దేశంలోని పవిత్ర పుణ్య క్షేత్రాలలో షిర్డీ కూడా ఒకటి. సాయిబాబా నివాసమైన షిర్డీని హిందువులు పవిత్ర పుణ్యక్షేత్రంగా భావిస్తారు. షిర్డీ మహారాష్ట్రలోని ఒక నగరం. సాయిబాబా 1918లో మోక్షం పొందే ముందు వరకూ 60 సంవత్సరాలు అక్కడే గడిపారు.
వైరల్ సందేశంతో భాగస్వామ్యం చేయబడిన స్క్రీన్‌షాట్‌లో షిర్డీ ట్రస్ట్ హజ్ ప్యాకేజీకి ఏదైనా మొత్తాన్ని విరాళంగా ఇచ్చిందా అంటూ.. Google సెర్చ్ కు సంబంధించిన ఫోటో కూడా చేశారు. షిర్డీ సాయి ట్రస్ట్ హజ్‌కు 35 కోట్ల విరాళం ఇస్తోందని పలువురు హిందీలో ట్వీట్ చేశారు.
“शिरडी साईं मंदिर ट्रस्ट ने मुस्लिमों को हज करने के लिए दिए ₹350000000 की सौगात जो हमारे हिंदू भाई शिरडी साईं मंदिर में जाकर दान करते हैं आज देखें वही हमारा दान का पैसा मुस्लिमों के हज यात्रा के लिए दिया जा रहा है हे मेरे हिंदू भाइयों अभी भी वक्त है आप खोलो और इन सब तंत्रों को समझो. कृपया साईं मंदिर मैं कोई भी पैसा ना चढ़ाएं” అంటూ వైరల్ సందేశాన్ని షేర్ చేస్తున్నారు.
హిందూ సోదరులు విరాళంగా ఇచ్చిన డబ్బులలో ముస్లింలకు చెందిన హజ్ కోసం ₹ 350000000 విరాళంగా ఇచ్చారన్నది.. వైరల్ పోస్టులో చెబుతున్నారు. హిందువులు కళ్లు తెరవాలని.. షిర్డీ ఆలయానికి విరాళాలు ఇవ్వకూడదని చెబుతూ ఉన్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు. షిర్డీ సాయి ట్రస్ట్ హజ్ యాత్రకు ఎటువంటి డబ్బును విరాళంగా ఇవ్వలేదు.
మేము షిర్డీ సాయి ట్రస్ట్ చేసిన విరాళాల గురించి కీవర్డ్ సెర్చ్ చేశాం. 2020 మార్చిలో ABP న్యూస్ యూట్యూబ్ ఛానెల్ షేర్ చేసిన వీడియో మాకు కనిపించింది. అందులో COVID మహమ్మారితో పోరాడే సమయంలో షిర్డీ సాయి ట్రస్ట్ మహారాష్ట్ర ప్రభుత్వానికి రూ. 51 కోట్ల విరాళాన్ని ప్రకటించింది.
ది హిందూలో వచ్చిన ఒక కథనంలో కూడా మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వానికి 51 కోట్ల రూపాయల విరాళాన్ని షిర్డీ సాయి ట్రస్టు ఇచ్చినట్లు నివేదించింది.
MI, CAT స్కాన్, డిజిటల్ ఉపసంహరణ యాంజియోగ్రఫీ (DSA) యంత్రాలు, ఇతర పరికరాలను కొనుగోలు చేయడానికి 2018లో షిర్డీ సాయి ట్రస్ట్ ఇందిరా గాంధీ ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రికి (IGMCH) 35.28 కోట్ల రూపాయలను విరాళంగా అందించిందని టైమ్స్ ఆఫ్ ఇండియాలోని మరో నివేదిక పేర్కొంది.
హజ్‌కు 35 కోట్ల రూపాయల విరాళం గురించి ఎక్కడా వార్తా కథనం కనిపించలేదు. అటువంటి నివేదికలు ఎక్కడా చూడలేదు. షిర్డీ సాయి ట్రస్ట్ వెబ్‌సైట్‌లో కూడా అలాంటి నివేదిక ఏదీ లేదు.
షిర్డీలోని సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్‌ని సంప్రదించిన యూటర్న్ అనే ఫ్యాక్ట్ చెక్ సంస్థ కూడా ఈ వాదనను ఖండించింది. ట్రస్ట్ ఈ వాదనలలో ఎటువంటి నిజం లేదని.. తప్పుడు ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేసింది..
హజ్ కమిటీకి షిర్డీ సాయి ట్రస్ట్ విరాళాలు ఇచ్చిందన్న వాదనలో ఎటువంటి నిజం లేదు. షిర్డీ సాయి ట్రస్ట్ ద్వారా అలాంటి విరాళాలు ఏవీ హజ్ యాత్ర కోసం వెళ్ళలేదు.