ఫ్యాక్ట్ చెక్: మహిళా ఓటర్లకు తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై డబ్బులు ఇవ్వలేదు
బీజేపీ నేత అన్నామలై కుప్పుస్వామి 2024 లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారిగా పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. కోయంబత్తూరు స్థానానికి బీజేపీ టికెట్‌పై ఆయన పోటీ చేస్తున్నారు.
బీజేపీ నేత అన్నామలై కుప్పుస్వామి 2024 లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారిగా పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. కోయంబత్తూరు స్థానానికి బీజేపీ టికెట్‌పై ఆయన పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గానికి ఏప్రిల్ 19న పోలింగ్ జరుగుతుందని.. కోయంబత్తూరులో బీజేపీకి 60% ఓట్లు వస్తాయని ఆయన జోస్యం చెప్పారు. ఉత్తర చెన్నై అభ్యర్థి పాల్ కనగరాజ్ తరపున కూడా ఆయన ప్రచారం చేస్తున్నారు.
తనకు హారతి పట్టిన ఓ మహిళకు అన్నామలై డబ్బులు ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉంది. నైతిక ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తూ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు లంచం ఇస్తున్నారనే వాదనతో ట్విట్టర్ లో వీడియోను షేర్ చేస్తున్నారు.
చాలా మంది X వినియోగదారులు “కరుణానిధి 2.0” అనే క్యాప్షన్‌తో వీడియోని షేర్ చేసారు.
చాలా మంది X వినియోగదారులు “కరుణానిధి 2.0” అనే క్యాప్షన్‌తో వీడియోని షేర్ చేసారు.
ఒక యూజర్ “@annamalai_k ఎందుకు ఇలా చేస్తున్నారు? హారతి ఇచ్చే వారికి డబ్బు ఇవ్వడంలో తప్పు లేదు. అది మన సంస్కృతిలో ఒక భాగం. ప్రపంచం మొత్తం మిమ్మల్ని గమనిస్తోందని మీకు తెలిసినప్పుడు మీరు ఇలా చేస్తారా?" అంటూ పోస్టులు పెట్టారు.
కొందరు “ஓட்டுக்கு பணம் கொடுக்காத உத்தமபுத்திரன்! #NoVoteForBJP” అంటూ ట్వీట్ చేశారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ అవుతున్న వీడియో జూలై 2023కు సంబంధించింది.
వీడియో నుండి తీసుకున్న కీఫ్రేమ్‌లను Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి సెర్చ్ చేసినప్పుడు.. తమిళంలోని టైటిల్‌తో డైలీ ఫోకస్ అనే యూట్యూబ్ ఛానెల్ ప్రచురించిన వీడియోను మేము కనుగొన్నాము. ఈ వీడియో జూలై 30, 2023న అప్లోడ్ చేశారు. తనకు హారతి ఇచ్చిన ఒక మహిళకు అన్నామలై ఆమె అడగకుండానే డబ్బు ఇచ్చాడని టైటిల్ లో తెలిపారు.
కోయంబత్తూరు జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి క్రాంతి కుమార్ ఇది పాత వీడియో అని విచారణలో తెలుసుకున్నారు. బీజేపీ అభ్యర్థి కె అన్నామలైపై వచ్చిన ఆరోపణలను క్రాంతి కుమార్ తోసిపుచ్చారని పేర్కొంటూ ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రచురించిన వార్తా నివేదికను కూడా మేము కనుగొన్నాము. ఇది పాత వీడియో కాబట్టి లోక్‌సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళి (MCC) పరిధిలోకి రాదని కలెక్టర్ స్పష్టం చేశారు.
2023 జులై 29న రామనాథపురం జిల్లాలో 'ఎన్ మన్ ఎన్ మక్కల్ యాత్ర' సందర్భంగా ఈ వీడియోను చిత్రీకరించినట్లు ఆయన స్పష్టం చేశారు. ఆప్యాయతకు చిహ్నంగా హారతి పట్టిన వారికి బహుమతి ఇవ్వడం మన సంస్కృతిలో ఉందని అన్నారు.
వీడియో పాతదేనని, నైతిక ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించలేదని నిర్ధారిస్తూ కలెక్టర్ చేసిన ట్వీట్‌లను కూడా మేము కనుగొన్నాము.
ఈ వైరల్ పోస్టులపై అన్నామలై కూడా స్పందించారు. 29-07-2023న రామనాథపురం జిల్లాలో 'ఎన్ మన్ ఎన్ మక్కల్' యాత్రలో వీడియో చిత్రీకరించారని వివరించారు. హారతి పట్టిన వారికి బహుమానం ఇవ్వడం సంస్కృతి అని, ఎన్నికల సమయంలో అది పాటించడం లేదని అన్నారు.
కె అన్నామలై ఒక మహిళకు డబ్బు ఇస్తున్నట్లు చూపుతున్న వైరల్ వీడియో ఇటీవలిది కాదు. మోడల్ ప్రవర్తనా నియమావళిని ఆయన ఉల్లంఘించలేదు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : Tamil Nadu BJP President Annamalai bribing voters during the campaigning for Lok Sabha elections
Claimed By : Twitter users
Fact Check : False