ఫ్యాక్ట్ చెక్: ఆ ఫోటోలకు ఇటీవల తవాంగ్ లో భారత్-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులకు ఎలాంటి సంబంధం లేదు..!
భారత్-చైనా దేశాల మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. సరిహద్దుల్లోని తవాంగ్ వద్ద రెండు దేశాల ఆర్మీ మధ్య తలెత్తిన ఘర్షణల నేపథ్యంలో భారత్, చైనాల మధ్య చర్చలు కూడా కొనసాగుతూ ఉన్నాయి.
భారత్-చైనా దేశాల మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. సరిహద్దుల్లోని తవాంగ్ వద్ద రెండు దేశాల ఆర్మీ మధ్య తలెత్తిన ఘర్షణల నేపథ్యంలో భారత్, చైనాల మధ్య చర్చలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. తూర్పు లద్దాఖ్ ప్రతిష్టంభన తొలిగేదిశగా నిర్మాణాత్మక చర్చలు జరిగాయని భారత్, చైనా చెబుతూ ఉన్నాయి. అపరిష్కృత సమస్యలను వేగంగా పరిష్కరించుకోడానికి ప్రయత్నిస్తూ ఉన్నామని భారత్-చైనా ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి.
అరుణాచల్ ప్రదేశ్లో ఇండో-చైనా ఘర్షణల మధ్య, సోషల్ మీడియా వినియోగదారులు భారతీయ సైన్యం- చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మధ్య జరిగిన ఘర్షణలను సంబంధించిన చిత్రాలు ఇవంటూ పలు ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ వస్తున్నారు.
ఇటీవల చోటు చేసుకున్న ఘటనలకు సంబంధించిన ఫోటోలు ఇవంటూ పోస్టులు పెడుతూ ఉన్నారు.
ఇటీవల చోటు చేసుకున్న ఘటనలకు సంబంధించిన ఫోటోలు ఇవంటూ పోస్టులు పెడుతూ ఉన్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న ఫోటో ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది.గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఫిబ్రవరి 21, 2021న ఎకనామిక్ టైమ్స్ లో ఇందుకు సంబంధించిన ఫోటో కనిపించింది. 'Galwan clash: China shares dramatic video of mountain clash with Indian troops.' అంటూ కథనాన్ని పోస్టు చేశారు. అప్పట్లో భారత్-చైనా దేశాల మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియో అని.. తిరిగి షేర్ చేస్తూ వస్తున్నారని మనకు స్పష్టంగా తెలుస్తోంది.
ఎకనామిక్ టైమ్స్ నివేదిక వైరల్ ఇమేజ్ను కలిగి ఉందని మేము కనుగొన్నాము. నివేదికలో "చైనీస్ ప్రభుత్వ మీడియా విడుదల చేసిన నాటకీయ ఫుటేజీ గత సంవత్సరం భారత సరిహద్దులో సైనికుల మధ్య ఘర్షణలను చూపిస్తుంది" అని ఉంది. ("Dramatic footage released by Chinese state media purportedly shows deadly clashes between troops at the Indian border last year — a rare insight into violence at the tense, remote frontier."
మేము సంబంధిత కీవర్డ్ సెర్చ్ చేసాము. ఫిబ్రవరి 20, 2021 న NDTV అధికారిక YouTube ఛానెల్లో అప్లోడ్ చేసిన వీడియోను మేము కనుగొన్నాము. వీడియో వివరణలో "వందలాది మంది భారతీయ మరియు చైనా సైనికులు తూర్పు లడఖ్లోని గాల్వాన్ లోయలో కనిపించారు. గత ఏడాది సరిహద్దు వద్ద గొడవకు సంబంధించిన వీడియోను చైనా ప్రభుత్వ మీడియా ట్వీట్ చేసింది. గత ఏడాది జూన్లో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణను చూపుతున్న వీడియో ఇది. హింసాత్మక గొడవలో పలువురు మరణించినట్లు చైనా అధికారికంగా అంగీకరించింది. గాల్వాన్లో 30 మందికి పైగా చైనా సైనికులు మరణించారని భారతదేశం భావిస్తోంది. భారత సరిహద్దులను కాపాడడం కోసం ఇరవై మంది భారతీయ సైనికులు తమ ప్రాణాలను అర్పించారు.
వీడియోలోకి దాదాపు 46 సెకన్ల వద్ద, మేము అదే ఫ్రేమ్ని వైరల్ ఇమేజ్గా గుర్తించాము. అంతేకాకుండా, ఫిబ్రవరి 2021లో ఒకే ఫ్రేమ్, ఇమేజ్ని కలిగి ఉన్న మరిన్ని మీడియా అవుట్లెట్ల నివేదికలను మేము కనుగొన్నాము. జూన్ 2020 నాటి "ఇండో-చైనా గాల్వాన్ క్లాష్"ని చూపించడానికి చైనీస్ స్టేట్ బ్రాడ్కాస్టర్ వీడియోను విడుదల చేసినట్లు కూడా మేము కనుగొన్నాము.
https://www.nbcnews.com/video/chinese-state-broadcaster-releases-footage-of-deadly-clash-with-indian-troops-101294149793
https://zeenews.india.com/india/after-admitting-it-suffered-casualties-chinas-state-media-releases-video-of-galwan-valley-clash-2343096. హాటముల్
Full View
అందువల్ల.. ఈ వైరల్ పోస్టులు ప్రజలను తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయి. వైరల్ చిత్రం ఫిబ్రవరి 2021లో చైనా విడుదల చేసిన వీడియో నుండి ఎడిట్ చేశారు. తవాంగ్లో ఇటీవల జరిగిన ఘర్షణలకు సంబంధించినది కాదు.
https://zeenews.india.com/
అందువల్ల.. ఈ వైరల్ పోస్టులు ప్రజలను తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయి. వైరల్ చిత్రం ఫిబ్రవరి 2021లో చైనా విడుదల చేసిన వీడియో నుండి ఎడిట్ చేశారు. తవాంగ్లో ఇటీవల జరిగిన ఘర్షణలకు సంబంధించినది కాదు.
Claim : An image with a claim that it shows confrontation between the Indian army and PLA in Arunachal Pradesh.
Claimed By : Social Media Users
Fact Check : Misleading