ఫ్యాక్ట్ చెక్: బిల్డింగ్ ల మీద నుండి కార్లు పడిపోతున్న వీడియోకు ఫ్రాన్స్ లో అల్లర్లకు ఎటువంటి సంబంధం లేదు

జూన్ 27, 2023న పారిస్‌లో 17 ఏళ్ల బాలుడిని పోలీసులు కాల్చి చంపారు. ఈ సంఘటన తర్వాత, వందలాది మంది నిరసనకారులు వీధుల్లోకి వచ్చి ప్రభుత్వాన్ని, పోలీసులను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేశారు.

Update: 2023-07-11 12:00 GMT

జూన్ 27, 2023న పారిస్‌లో 17 ఏళ్ల బాలుడిని పోలీసులు కాల్చి చంపారు. ఈ సంఘటన తర్వాత, వందలాది మంది నిరసనకారులు వీధుల్లోకి వచ్చి ప్రభుత్వాన్ని, పోలీసులను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేశారు.

కొందరు నిరసనకారులు ఇష్టమొచ్చినట్లు వీధుల్లో విధ్వంసం సృష్టించడమే కాకుండా.. పలు సంస్థలను దోచుకుంటున్న అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్అయ్యాయి. కొన్ని కార్లు భవనంపై నుండి పడిపోతున్నట్లు చూపించే వీడియో వైరల్‌గా మారింది.

“#फ्रांस ने एक #राष्ट्रवादी महिला को छोड़कर एक #सेक्युलर लिबरल मैकरों को राष्ट्रपति चुना, परिणाम देखिए।“ అంటూ వీడియోను పోస్టు చేశారు. ఫ్రాన్స్ దేశ ప్రజలు సెక్కులర్ లిబరల్ వ్యక్తి అయిన మాక్రాన్ ను ఎన్నుకున్నారు.. అతడికి నేషలిస్టు మహిళను ఎన్నుకుని ఉండి ఉంటే బాగుండేదంటూ వీడియోను వైరల్ చేస్తున్నారు.

ఫ్రాన్స్ తలబడుతోంది, నాశనం అవుతోంది అంటూ పలువురు పోస్టులు పెడుతున్నారు.




Full View

ఫ్యాక్ట్ చెకింగ్:

ఈ వీడియోకు ఫ్రాన్స్‌లో నిరసనలకు ఎటువంటి సంబంధం లేదు. ఈ వీడియో ప్రముఖ హాలీవుడ్ సినిమా 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' సినిమాకు సంబంధించినది.

మేము Googleలో ఇందుకు సంబంధించి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే వీడియోని అక్టోబర్ 19, 2020న Facebook పోస్ట్‌ని మేము కనుగొన్నాము “This ‘Fast& Furious 8’ scene had no CGI (Via camera setups)” అంటూ దానికి క్యాప్షన్ ఓ క్యాప్షన్ ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ లో ఒరిజినల్ కార్లను వాడారు. ఎటువంటి కంప్యూటర్ గ్రాఫిక్స్ ను ఉపయోగించకుండా సినిమా షూటింగ్ చేశారు.
Full View

దీన్ని క్లూగా తీసుకుని “Fast and Furious 8 car crash scene” అంటూ కీవర్డ్ సెర్చ్ చేశాం. 2016లో పోస్ట్ చేసిన కొన్ని YouTube వీడియోలను మేము కనుగొన్నాము. ‘Fast & Furious 8 car crash scene’ అంటూ వీడియోలను పోస్టు చేశారు. క్లీవ్‌ల్యాండ్, OH (NYC) డౌన్‌టౌన్‌లోని గ్యారేజీ నుండి రియల్ కార్లను తీసుకుని వచ్చి షూటింగ్ చేస్తున్నారని తెలిపారు. మీరు ప్రతిరోజూ ఎగిరే కార్లను చూడలేకపోవచ్చు అంటూ చెప్పుకొచ్చారు.

Full View

Full View

Movieweb.com (జూన్ 10, 2016)లో ప్రచురించిన కథనం ప్రకారం, ఈ స్టంట్ క్లీవ్‌ల్యాండ్‌లో చిత్రీకరించారు. ఇక్కడ అనేక కార్లు పార్కింగ్ ప్లేస్ భవనం నుండి కిందకు పడిపోయాయి.
screenrant.com ప్రకారం, ప్రొడక్షన్ యూనిట్ నిజమైన కార్లను సేకరించింది. పార్కింగ్ గ్యారేజీ వివిధ అంతస్తుల కిటికీల దగ్గర వాటిని జాగ్రత్తగా అమర్చారు. ప్రతి కారును ర్యాంప్‌పై ఉంచారు.. షాట్ కు తగ్గట్టుగా కార్లను ఒక్కసారిగా బిల్డింగ్ మీద నుండి కిందకు పడేశారు. బిల్డింగ్ పై నుండి కార్లు కిందకు పడిపోయాయి. ఈ సీన్ ను షూట్ చేయడానికి ప్రొడక్షన్ సిబ్బంది.. యాక్షన్ డిపార్ట్మెంట్ చాలా కష్టపడ్డారని తెలిపారు.

పార్కింగ్ గ్యారేజీ నుండి కార్లు పడిపోతున్నట్లు వైరల్ అవుతున్న వీడియో ఫ్రాన్స్‌ దేశంలో అల్లర్లకు చెందినది కాదు. ఇది 2017 లో వచ్చిన హాలీవుడ్ చిత్రం ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 8 కోసం షూటింగ్ చేస్తున్నప్పటి వీడియో. వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు.
Claim :  Video shows riots in France
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News