ఫ్యాక్ట్ చెక్: భారతదేశంలో రైల్వే ట్రాక్ వేస్తున్న వైరల్ వీడియో అంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. ఈ వీడియో మలేషియాకు సంబంధించినది.

Update: 2024-01-31 08:00 GMT

Railway track 

భారతీయ రైల్వే వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్దది. ప్రతీ రోజు కొన్ని లక్షల మంది ప్రయాణీకులు భారతీయ రైల్వేలో ప్రయాణిస్తూ ఉంటారు. నూతన లైన్లు, డబ్లింగ్, గేజ్ మార్పిడి, ప్రయాణీకుల సౌకర్యాలను మెరుగుపరచడం వంటి వివిధ మౌలిక సదుపాయాల కల్పనపై భారతీయ రైల్వే దృష్టి పెట్టింది. రైల్వేలో ప్రయాణికుల భద్రత అత్యంత కీలకం. దీనికి సంబంధించిన పనులపై కూడా భారతీయ రైల్వే భారీగా ఖర్చు పెట్టింది. రైలు సిగ్నలింగ్, టికెటింగ్, కంప్యూటరైజ్డ్ వ్యాగన్ వంటి రంగాలలో డిజిటలైజేషన్‌ కూడా మొదలైంది.

ఫాస్ట్‌ట్రాక్ టెక్నాలజీని ఉపయోగించి రైల్వే లైన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చూపించే వీడియో వైరల్ అవుతూ ఉంది. ఇది భారతదేశంలో జరుగుతున్న రైల్వేకు సంబంధించిన పనులని చెబుతూ పోస్టులు పెడుతున్నారు.
"కొత్త టెక్నాలజీతో రైల్వే లైన్ ఎలా సిద్ధం చేస్తున్నారో చూడండి, భారతదేశం" వంటి క్యాప్షన్‌లతో వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ చేశారు.
Full View

Full View


Full View



Full View

“अब नए भारत में ऐसे बनाया जाता रेल मार्ग” అని హిందీలో కూడా పలువురు పోస్టులు పెట్టారు. "సరికొత్త భారతదేశంలో రైల్వే మార్గాలను ఇలా నిర్మిస్తారు” అనే వాదనతో వీడియోను పోస్టు చేశారు.

Full View

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
వైరల్ అవుతున్న వీడియోకు సంబంధించిన కీ ఫ్రేమ్స్ ను తీసుకుని మేము గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం.
Insight Xiangshan అనే ట్విట్టర్ అకౌంట్ లో జనవరి 8, 2024న వీడియోను పోస్టు చేశారు. “Malaysia's East Coast Railway began laying tracks.” అనే టైటిల్ ను కూడా పెట్టారు. మలేషియాకు చెందిన 'ఈస్ట్ కోస్ట్' రైల్వే ట్రాక్‌లను వేయడం ప్రారంభించింది.
మలేషియా-చైనా రైలు ప్రాజెక్ట్ గురించి మరింత సెర్చ్ చేయగా.. ఇలాంటి చిత్రాలు చైనా జిన్హువా న్యూస్ ట్విట్టర్ హ్యాండిల్‌లో కనిపించాయి. “ఈస్ట్ కోస్ట్ రైల్ లింక్ #ECRL, మలేషియాలో చైనా కమ్యూనికేషన్స్ నిర్మిస్తున్న మెగా రైలు ప్రాజెక్ట్" అనే శీర్షికతో షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము.
AP న్యూస్ యూట్యూబ్ ఛానెల్ ప్రచురించిన మరో వీడియోను కూడా మేము గమనించాం. వీడియోలోని పరికరాలు వైరల్ వీడియోలో ఉన్నట్లే ఉన్నాయని మనం గమనించవచ్చు. మలేషియాలో చైనా కమ్యూనికేషన్స్ నిర్మిస్తున్న మెగా రైలు ప్రాజెక్ట్ కు సంబంధించిన వీడియో అని ఏపీ న్యూస్ ద్వారా కూడా తెలుస్తూ ఉంది.
Full View
రెండింటి మధ్య ఉన్న పోలికలను మీరు గమనించవచ్చు.
కాబట్టి, వైరల్ వీడియో భారతదేశంలో జరుగుతున్న రైల్వే లేన్ల పనికి సంబంధించినది కాదు. మలేషియా-చైనా రైలు ప్రాజెక్ట్‌లో భాగంగా మలేషియాలో ట్రాక్ లేయింగ్ పనులను చూపిస్తుంది. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim :  The video shows a Railway track being laid in India using fast-track construction technology
Claimed By :  Facebook and youtube users
Fact Check :  False
Tags:    

Similar News